How to Search a Song on YouTube by Humming : సోషల్ మీడియాలో యూట్యూబ్ రేంజ్ ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాస్యం నుంచి వార్తా విశేషాల వరకూ.. ఏది కావాలన్నా యూట్యూబ్(Youtube) యూట్యూబ్ వైపే వేలు చూపిస్తున్నారు జనం. వ్యూయర్స్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు యూట్యూబ్ నిర్వాహకులు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తెస్తున్నారు. ఇలాంటి వాటిల్లో తాజాగా వచ్చిన ఫీచరే "హమ్మింగ్".
ఎటో వెళ్తుంటే.. ఏదో పాట వినిపిస్తుంది. జస్ట్ ఓ బిట్ మాత్రమే చెవిన పడుతుంది. భలే ఉందే అనిపిస్తుంది. ఆ తర్వాత విందామంటే.. ఆ పాటేంటో తెలియదు. వేరే ఎవరినైనా అడుగుదామన్నా.. ఆ పాట గురించి పూర్తిగా తెలియకపోవడంతో.. వారికి కూడా సరిగా కన్వే చేయలేం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఎదుర్కొనే ఉంటారు. ఇకపై ఇలాంటి పరిస్థితి అవసరం లేదు. మనకు పాట లిరిక్స్ పూర్తిగా తెలియాల్సిన అవసరంలేదు. కేవలం.. ఆ ట్యూన్‌ను 3 సెకన్ల పాటు మనం హమ్ చేస్తే చాలు.. వెంటనే పాట సెర్చ్‌లో కనిపించే ఆప్షన్ తెచ్చింది యూట్యూబ్.
How to find Song on Youtube by Humming Tune : యూట్యూబ్‌లోని "వాయిస్ సెర్చ్" ఫీచర్ ద్వారా.. సాంగ్ సెర్చ్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను గూగుల్ సెర్చ్(Google Search)లోని హమ్ టు సెర్చ్ (Hum To Search) ఫీచర్ స్ఫూర్తితో పరిచయం చేసినట్లు యూట్యూబ్ పేర్కొంది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన పాట లేదా మ్యూజిక్ కోసం మైక్ సింబల్‌పై క్లిక్ చేసి మూడు సెకన్లపాటు హమ్ చేస్తే.. సెర్చ్ రిజల్ట్‌లో ఒరిజనల్ పాటతోపాటు, యూజర్ క్రియేట్ చేసిన కంటెంట్, షార్ట్స్‌లోని కంటెంట్‌లో సదరు పాటకు సంబంధించిన వీడియోలను చూపిస్తుంది. అయితే.. ఈ ఫీచర్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుందని యూట్యూబ్ తెలిపింది.
ఈ ఫీచర్ ద్వారా యూట్యూబ్‌లో పాటను ఎలా సెర్చ్ చేయాలంటే..?
- మొదట మీరు YouTube యాప్ ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత ఎగువ కుడి వైపున ఉన్న Search iconపై నొక్కాలి.
- ఇప్పుడు మీరు సెర్చ్ బార్ పక్కన మైక్రోఫోన్ చిహ్నాన్ని గమనించవచ్చు. దానిపై నొక్కాలి.
- మీరు మైక్రోఫోన్‌పై నొక్కిన తర్వాత.. మీకు కావాల్సిన పాట ట్యూన్‌ను 3 సెకన్ల పాటు హమ్ చేయాలి లేదా పాడాలి లేదా విజిల్ వేసినా చాలు.
- వెంటనే.. ఆ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఎంత కరెక్ట్‌గా హమ్ చేస్తే.. ఎంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి.
Youtube Humming Feature : ప్రస్తుతం ఈ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు యూట్యూబ్ పేర్కొంది. 2020 నుంచి గూగుల్‌లో హమ్ టు సెర్చ్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు అదే సాంకేతికతతో యూట్యూబ్‌లో సాంగ్ సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. కానీ, గూగుల్ హమ్ టు సెర్చ్‌లో అయితే 15 సెకన్లు హమ్ చేయాలి.. అదే యూట్యూబ్‌లో కావాల్సిన పాట కోసం 3 సెకన్లు హమ్ చేస్తే సరిపోతుంది.
ప్రస్తుతానికి దేశంలోని YouTube వినియోగదారులందరూఈ ఫీచర్‌ను చూడలేకపోవచ్చు. ఇది ఆండ్రాయిడ్‌లో(ఎక్కువగా యాప్ బీటా వెర్షన్‌లో ఉన్నవారు) కొద్దిమంది YouTube వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. iOSలో YouTube వినియోగదారులకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.
Youtube Shorts Play Store : గూగుల్ ప్లేస్టోర్‌లో 'యూట్యూబ్' షార్ట్స్.. ఏం చూడవచ్చో తెలుసా?
YouTubers Failing Reasons : మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలా?.. ఈ తప్పులు చేయకండి!