How To Read Deleted Messages On WhatsApp : సాధారణంగా అవతలి వారు మన వాట్సాప్‌కు మేసేజ్ చేసి వెంటనే డిలీట్ చేస్తే.. వారు ఏం సందేశం పంపి ఉంటారు? అనే సందేహం కలుగుతుంది. ఆ మెసేజ్‌ను తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. అందుకే వాట్సాప్ కొత్తగా 'డిలీట్ ఫర్ ఎవ్రీ వన్' అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది.. దీనితో డిలీట్ అయిన మెసేజ్‌లను ఈజీగా చదవవచ్చు.
డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్‌లు తిరిగి పొందాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి!
వాట్సాప్‌లో డిలీట్ అయిన మేసేజ్‌లను తిరిగి పొందేందుకు థర్డ్ పార్టీ యాప్ అవసరం ఉంటుంది. అందుకోసం యాండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు వేరు వేరు మార్గాలు ఉన్నాయి.
యాండ్రాయిడ్ యూజర్లు డిలీటెడ్ మెస్సేజ్‌లు చదవాలంటే..
- మొదట గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లాలి.
- 'వాట్సాప్ డిలీటెడ్ మెసేజ్' అని సెర్చ్‌లో టైప్ చేయాలి.
- వెంటనే వివిధ రకాలు యాప్‌లు డిస్ప్లే అవుతాయి.
- అందులో మంచి రేటింగ్, ఫీడ్‌బ్యాంక్ ఉన్న యాప్‌ను ఎంచుకొని డౌన్లోడ్ చేయాలి.
- అనంతరం యాప్‌కు అవసరమున్న పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి. ఈ యాప్ సాయంతో డిలీట్ అయిన మెసేజ్‌లను తిరిగిపొందవచ్చు.
- WAMR, వాట్సాప్ రిమూవ్డ్ ప్లల్ అనే యాప్‌లు మంచిగా పనిచేస్తాయి.
ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్ డిలీటెడ్ మెసేజ్‌లను ఏలా తిరిగి పొందాలి..
ఐఫోన్ వినియోగదారులకు డిలీట్ అయిన మెసేజ్‌లను.. యాప్ ద్వారా తిరిగి పొందేందుకు అనుమతి లేదు. కాకపోతే ఓ చిన్న ట్రిక్ ద్వారా డిలీటెడ్ మెసేజ్‌లను చదవచ్చు.
- ఐఫోన్ వినియోగదారులు వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను నోటిఫికేషన్ సెంటర్లో చూసేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్‌పై లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా ఈ ప్రక్రియ మరింత సులభం చేసుకోవచ్చు.
- డెరెక్ట్‌గా యాప్‌ను ఓపెన్ చేయడం ద్వారా డిలీట్ అయిన మెసేజ్‌లను మీరు చూడలేరు. కేవలం నోటిఫికేషన్ ద్వారా మాత్రమే వాటిని మీరు చూడగలుగుతారు.
వాట్సాప్ అప్డేట్ లింక్ ఫీచర్..
WhatsApp Channels Update Link Feature : వాట్సాప్ ఛానల్ వినియోగదారులకు మరో అదిరిపోయో ఫీచర్ తీసుకువచ్చింది మెటా కంపెనీ. వాట్సాప్‌లో ఛానల్ అప్డేట్ లింక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ ఛానల్ లింక్‌ను.. ఛానల్ క్రియేటర్ మాత్రమే కాదు.. యూజర్లు కూడా కాపీ చేయవచ్చు. అనంతరం దాన్ని ఇతరులకు షేర్ చేయవచ్చు.
భారత్‌లో 7,420,748 వాట్సాప్ అకౌంట్లు బ్యాన్..
WhatsApp Banned Accounts In India : భారత్‌లో మొత్తం 74,20,748 అకౌంట్లను బ్యాన్ చేసింది వాట్సాప్. భారత ఐటీ నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఖాతాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు ఖాతాలను పూర్తిగా బ్యాన్ చేసింది వాట్సాప్.
How to Use SBI WhatsApp Banking Services : వాట్సాప్‌లో SBI సేవలు.. ఏం చేయొచ్చంటే..?