Google Chrome Vulnerability : గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ సంస్థ CERT-in. గూగుల్ క్రోమ్‌లో పలు సాఫ్ట్వేర్ విభాగాల్లో కొన్ని హైరిస్క్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్ కనుగొన్నట్లు తెలిపింది. ఇవి సైబర్ నేరగాళ్లు సిస్టమ్‌ను హ్యాక్ చేసేందుకు అవకాశం కల్పిస్తాయని హెచ్చరించింది. క్రోమ్ బ్రౌజర్ వాడేవారు వెంటనే దానిని అప్డేట్ చేసుకోవాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సూచించింది.
సెక్యూరిటీ లోపాలున్నాయ్! కస్టమ్ ట్యాబ్స్, వెబ్పీ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, ప్రాంప్ట్‌లు, ఇన్‌పుట్, ఇంటెంట్‌లు, ఇంటర్‌స్టీషియల్స్, పిక్చర్ ఇన్ పిక్చర్లో సెక్యూరిటీ లోపాలను గుర్తించినట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం వెల్లడించింది. దాంతోపాటు డౌన్‌లోడ్స్, ఆటోఫిల్ పాలసీలు సరిగ్గా అమలు కాలేదని వివరించింది. ఈ లోపాలు యూజర్ సిస్టమ్‌ను హాక్ చేసే అవకాశం కల్పిస్తాయని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల నుంచి ఈ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు వెంటనే గూగుల్ క్రోమ్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకోండిలా!
- ముందుగా మీకు సంబంధించిన కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి.
- టూల్‌బార్‌లోని(Tool bar) త్రీ డాట్బటన్పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత హెల్ప్(Help) బటన్‌పై క్లిక్ చేసి అబౌట్ గూగుల్ క్రోమ్(About Google Chrome) ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీరు వినియోగించే బ్రౌజర్ లేటెస్ట్ వర్షెన్ ఇన్స్టాల్ చేయకపోతే.. అప్డేట్ ఆప్షన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవచ్చు. అది పూర్తవ్వగానే సిస్టమ్‌ను రీస్టార్ట్ చేయాల్సిఉంటుంది.
Android Phones Security Risk : ఆండ్రాయిడ్ యూజర్స్‌కు అలర్ట్.. ఫేక్ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్‌తో.. జర జాగ్రత్త!
Android Phones Security Risk In Telugu : కొద్ది రోజుల క్రితం ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అందరికీ టెక్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా సెక్యూరిటీ వల్నరబులిటీస్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే గూగుల్ ప్లేస్టోర్‌లో నకిలీ టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లు కూడా ఉన్నట్లు తెలిపారు. వీటిలోని స్పైవేర్స్.. యూజర్ల డేటాను చోరీ చేస్తాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లను వెంటనే అప్డేట్ చేసుకోవాలని, ఫేక్ యాప్‌లను డిలీట్ చేయాలని సూచిస్తున్నారు.
How to Activate DND in Mobile Networks : స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా..? వాటి నోరు మూసేయండిలా!
Realme c53 Mobile Price and Details : రూ. 10వేలకే 108MP కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్..!