ETV Bharat / science-and-technology

జీమెయిల్​ యాప్​లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్​

author img

By

Published : Dec 9, 2021, 12:56 PM IST

Gmail app update: సరికొత్త ఫీచర్లతో గూగుల్​ జీమెయిల్ యాప్​ అప్​డేట్​ను​ తీసుకురానుంది. ఇప్పటివరకు చాట్​కే పరిమితమైన జీమెయిల్ యాప్​లోని 'గూగుల్ చాట్'తో ఇకపై ఆడియో, వీడియో కాల్స్​ ద్వారా కూడా సంభాషించే అవకాశాన్ని కల్పించనుంది.

Gmail app update
గూగుల్​ జీమెయిల్ యాప్ అప్​డేట్​

Gmail app update: తమ వినియోగదారుల కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. జీమెయిల్ యాప్​లోని 'గూగుల్ చాట్' ఫీచర్​ ద్వారా వాయిస్ కాలింగ్​, వీడియో కాలింగ్​ సదుపాయాన్ని కల్పించనుంది. జీమెయిల్ యాప్ అప్​డేట్​ ద్వారా యాపిల్​, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వారమే దీన్ని తీసుకురానుంది.

Audio video call with gmail: ఇప్పటికే ఆడియో, వీడియో కాల్స్, చాట్ కోసం హ్యాంగ్ అవుట్స్​, డ్యుయో, అల్లో, గూగుల్ ప్లస్ వంటి వివిధ యాప్​లను గూగుల్​ తీసుకువచ్చింది. కానీ, ఈ యాప్​ల అవసరం లేకుండానే తమ వినియోగదారులు సులభంగా, వేగంగా ఇతరులతో మాట్లాడుకునేందుకు వీలు కల్పించాలని గూగుల్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. జీమెయిల్ యాప్​ అప్​డేటెడ్ వెర్షన్​లో ఈ తాజా సదుపాయాల్ని తీసుకురానుంది.

వన్​-టు-వన్ మాత్రమే..

Gmail google chat: జీమెయిల్ యాప్​లోని గూగుల్ చాట్ సర్వీసు ద్వారా ప్రస్తుతానికైతే ఒక్కరితో మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. గ్రూప్​ చాట్​లో పాల్గొనాలంటే మాత్రం గూగుల్ మీట్ వంటి ఇతర యాప్​లను వినియోగించుకోవాల్సిందే.

"కొంతమంది ఆఫీసులో ఉన్నప్పుడు, మరికొంత మంది మిగతా ప్రదేశాల్లో ఉన్నప్పుడు... ఈ ఫీచర్​ హైబ్రిడ్ వర్క్ వరల్డ్​లో సహోద్యోగులతో అనుసంధానమవ్వడాన్ని సులభతరం చేస్తుందని మేం ఆశిస్తున్నాం. ఈ సదుపాయం ద్వారా సులభంగా చాట్​ నుంచి వీడియో, ఆడియోకు వినియోగదారులకు కావాల్సిన విధంగా మారవచ్చు. ఇది ఇతరులతో సహకరించుకుంటూ తమ పని వేగవంతంగా పూర్తి చేసేందుకు సాయపడుతుంది" అని గూగుల్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి: వాట్సాప్ కొత్త అప్డేట్​.. ఇకపై 7 రోజులు కాదు.. 24 గంటలే

ఇదీ చూడండి: షియోమీ నుంచి సరికొత్త మొబైల్​- ఫీచర్లు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.