ETV Bharat / science-and-technology

ఐఫోన్‌ సెట్టింగ్స్‌లో ఈ మార్పులు చేశారా? ఓసారి చూడండి! - ఐఓఎస్​ 15 ఫీచర్లు

యాపిల్​ ఐఫోన్స్​లో వివిధ రకాల మోడల్స్​ ఉన్నా.. ప్రతీది ఒకటే సాఫ్ట్​వేర్​తో పనిచేస్తుంది. అదే ఐఓఎస్​ 15. మరి దీని సెట్టింగ్స్​లో ఏం ఫీచర్లు ఉన్నాయో తెలుసా?

apple iphone
ఐఫోన్​ సెట్టింగ్స్​
author img

By

Published : Nov 11, 2021, 12:08 PM IST

మొబైల్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌ ఈ ఏడాది ఐఫోన్‌ 13 సిరీస్‌ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్‌ 13, 13 మినీ, 13ప్రో, 13 ప్రో మాక్స్‌ వంటి మోడళ్లను యాపిల్‌ సంస్థ రూపొందించింది. వీటి తయారీకి వాడిన హార్డ్‌వేర్‌లో చిన్న తేడాలు ఉండొచ్చు. కానీ, ప్రతీది ఒకటే సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. మరి వీటన్నింటిలో ఉన్న ఐఓఎస్‌15 సెట్టింగ్స్‌ గురించి మీకు తెలుసా? యాపిల్‌ తయారుచేసిన ఐఫోన్లన్నీ ఇక ఐఓఎస్‌15 తోనే వస్తాయి. ఇందులో ఫేస్‌టైమ్‌, సఫారీ లాంటి చాలా రకాల ఫీచర్లు ఉంటాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

1. ఫుల్‌ స్క్రీన్‌ ఇన్‌కమింగ్‌ కాల్‌ అలర్ట్

ఐఓఎస్‌ 14 రాకముందు ఐఫోన్‌లో ఇన్‌కమింగ్‌ కాల్ వచ్చినప్పుడు డిస్‌ప్లే మొత్తాన్ని ఆక్రమించినట్లుగా కనిపించేది. ఇది వినియోగదారులకు అసౌకర్యంగా ఉండేది. ఐఓఎస్‌ 14 వచ్చాక యాపిల్‌ దీన్ని పూర్తిగా మార్చేసింది. స్క్రీన్‌పైనా నోటిఫికేషన్ల లాగా వచ్చేలా రూపొందించింది. ఇది చాలా సందర్భాల్లో మిస్సైన కాల్స్‌ను వినియోగదారుడికి గుర్తు చేస్తుండేది. ఐఫోన్‌లో ఈ సెట్టింగ్‌ చేర్చుకోవాలంటే.. సెట్టింగ్‌లోకెళ్లి ఫోన్‌ సెట్టింగ్స్‌>తర్వాత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ లో ఉన్న ఫుల్‌ స్క్రీన్‌ సెట్టింగ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి.

2. ఛేంజ్‌ సిరి వాయిస్

ఈ ఏడాది ప్రారంభంలో ఐఓఎస్‌ 14.5 వచ్చాక సిరి రెండు కొత్త స్వరాలను అందించింది. మొట్టమొదటిసారి సిరిలో ఫీమేల్‌ వాయిస్‌ డిఫాల్ట్‌గా రాకుండా మనమే సిరి వాయిస్‌ను ఎంచుకొనే విధంగా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చారు. మనకు నచ్చిన వాయిస్‌ను మార్చుకొనే వెసులుబాటును కల్పించారు. ఒక్కసారి ఆప్షన్ సెలక్ట్‌ చేసుకోగానే యాపిల్‌ ఐడీతో ఉన్న అన్ని డివైసెస్‌లో సిరి వాయిస్‌ మారిపోతుంది. దీన్ని సెట్టింగ్స్‌లోకెళ్లి సిరి అండ్‌ సెర్చ్ ఆప్షన్‌ ఎంచుకొని సిరి వాయిస్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు సిరి వాయిస్‌ ఛేంజ్‌ అయిపోతుంది.

3. 5జీ కవరేజీని ఆఫ్‌ చేసుకోవచ్చు..

యాపిల్ ఫోన్లలో ప్రత్యేకమైన 5జీ స్మార్ట్ డేటా ఫీచర్‌ కూడా అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఆటోమెటిక్‌గా 4జీ నుంచి 5జీ కి మారేలా ఉంటుంది. నెట్‌వర్క్‌లో వచ్చే స్వల్ప మార్పుల వల్ల బ్యాటరీ దెబ్బతినే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ డేటా వృథా అవుతుందనుకున్నా.. 5జీ స్పీడ్‌ను వద్దనుకున్నా.. బ్యాటరీ సామర్థ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా ఈ ఆటోమెటిక్‌ స్విచ్‌ ఉపయోగపడుతుంది. దీన్ని ఆఫ్‌ చేసుకోవచ్చు.. అలాగే అవసరం అనుకున్నప్పుడు ఆన్‌ కూడా చేసుకోవచ్చు. దీన్ని మార్చుకోవడం కోసం.. సెట్టింగ్‌లోకెళ్లి సెల్యూలర్‌>సెల్యూలర్‌ డాటా ఆప్షన్>వాయిస్‌ అండ్‌ డేటాలో ఎల్‌టీఈని యాక్టివేట్‌ చేసుకుంటే 5జీ కవరేజీ ఆఫ్ అయిపోతోంది. అలాగే 5జీ కవరేజీ ఆన్‌ను సెలక్ట్‌ చేసుకుంటే 5జీ ఆన్‌ అవుతోంది.

4. ఫేస్‌మాస్క్‌తోనూ ఫోన్‌ అన్‌లాక్‌..

ఫేస్‌ లాక్‌ సెట్టింగ్‌ ద్వారా మన ఫోన్‌ అన్‌లాక్‌ చేసుకోవచ్చని మనకి తెలుసు. అయితే, ఫేస్‌మాస్క్‌ ఉన్నపుడు ఫోన్‌ అన్‌లాక్‌ చేయడం ఎలా? సగమే కనిపించే ఫేస్‌తో ఫోన్‌ను అన్‌ లాక్‌ చేయడం కష్టమవుతుంది. దీనికోసం యాపిల్‌ ప్రత్యేకంగా ఫేస్‌ ఐడీ టెక్నాలజీని తీసుకువచ్చింది. కానీ, దీనికోసం కచ్చితంగా యాపిల్‌ వాచ్ ఉండాలని కండిషన్‌ను పెట్టింది. దీంతో ఫేస్‌ కనిపించకుండా ఉన్నా ఫోన్‌ అన్‌లాక్‌ అయ్యేలా చేస్తోంది. దీనికోసం సెట్టింగ్‌ యాప్‌లో ఫేస్‌ఐడీ అండ్‌ పాస్‌కోడ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కిందికి స్క్రోల్‌ చేశాక అన్‌లాక్‌ విత్‌ యాపిల్‌ వాచ్ సెక్షన్‌ అనే ఫీచర్‌ను సెలక్ట్‌ చేసుకుంటే ఫేస్‌ మాస్క్ ఉన్నా ఫోన్‌ అన్‌ లాక్‌ అవుతుంది.

5. టెక్స్ట్‌ను సులువుగా చదివేయచ్చు..

ఐఫోన్‌ స్క్రీన్‌పై ట్యాప్‌ చేయడం ద్వారా ఫాంట్‌ సైజ్‌ను అడ్జెస్ట్‌ చేసుకొని టెక్ట్స్‌ను సులువుగా చదివే అవకాశాన్ని కూడా ఐఓఎస్‌15 సెట్టింగ్స్‌ తీసుకువచ్చింది. దీనికోసం సెట్టింగ్స్‌>డిస్‌ప్లే అండ్‌ బ్రైట్‌నెస్ > టెక్స్ట్ సైజును యాక్టివేట్‌ చేసుకుంటే సరిపోతుంది.

6. డార్క్‌ మోడ్‌తో బ్యాటరీ ఆదా..

మొబైల్‌ స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను ప్రతిసారీ అడ్జెస్ట్‌ చేసుకోవడం వీలుకాదు. దీంతో బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దీనికోసం ఐఓఎస్‌15 సెట్టింగ్స్‌లో డార్క్‌ మోడ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ ఆప్షన్‌ను యాక్టివేట్‌ చేసుకున్నట్లయితే బ్యాటరీని ఆదా చేసుకోవడం సహా వైట్‌బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న అప్లికేషన్స్‌ను కూడా డార్క్‌ మోడ్‌లోకి మార్చుకోవచ్చు. ఈ సెట్టింగ్స్‌ యాక్టివేట్‌ చేసుకోవాలంటే ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి డిస్‌ప్లే అండ్‌ బ్రైట్‌నెస్‌ ఆప్షన్స్‌లో స్క్రీన్‌పైన ఉన్న డార్క్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకుంటే సరి.

7. ఆటో బ్రైట్‌నెస్‌ను డిసబుల్‌ చేసుకోవచ్చు..

స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌తో బ్యాటరీ పనితీరుపైనా తీవ్ర ప్రభావం పడుతోందని మనందరికీ తెలిసిందే. అయితే, ఎంత మేర లైట్‌ వస్తుందో తెలుసుకొని ఆటోమెటిక్‌గా అడ్జస్ట్‌ చేసుకునేలా ఐఓఎస్‌ను రూపొందించారు. దీన్ని మొత్తాన్ని నియంత్రించాలనుకుంటే డిసబుల్‌ ఆటో బ్రైట్‌నెస్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు. మనం ఏదయితే సెట్‌ చేసి పెట్టుకుంటామో తిరిగి మనం మార్చుకునేంత వరకు అదే లెవల్‌లో బ్రైట్‌నెస్‌ ఉంటుంది. ఈ సెట్టింగ్స్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలంటే.. సెట్టింగ్స్‌>ఆక్ససెబిలిటీ>డిస్‌ ప్లే అండ్‌ టెక్ట్స్‌ సైజ్‌లో కింద ఉన్న ఆటో బ్రైట్‌నెస్‌ను స్విచ్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

8. కెమెరా ఫీచర్స్‌లో హెచ్‌డీఆర్ వీడియో ఆఫ్‌ చేసుకోవచ్చు..

ఐఫోన్‌12, ఐఫోన్‌13 ఫోన్లలో హెచ్‌డీఆర్‌ వీడియో రికార్డు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, హెచ్‌డీఆర్‌ వీడియోను ఇతర ఫోన్లకు షేర్ చేస్తే అది అన్నిట్లో సపోర్ట్ చేయకపోవచ్చు. దీనికోసం డెవలపర్స్‌ కొత్తగా అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. కొన్ని ఫోన్లలో హెచ్‌డీఆర్‌ వీడియో క్వాలిటీతో చూడాలంటే ప్రత్యేక పరికరం అవసరం అవుతుంది. అయితే, ఇందులో హెచ్‌డీఆర్‌తో రికార్డు చేసుకునే వెసులుబాటుతో హెచ్‌డీఆర్‌ లేకుండా వీడియో రికార్డు చేసే సెట్టింగ్స్‌ కూడా ఐఓఎస్15 లో ఉంది. దీనికోసం సెట్టింగ్‌>కెమెరా>రికార్డు వీడియో>హెచ్‌డీఆర్‌ వీడియో ఆఫ్‌ పొజిషన్‌ స్విచ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి.

ఇదీ చూడండి : ఐఫోన్లలో యాపిల్‌ లోగోతో ఏమేం చేయొచ్చంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.