ETV Bharat / science-and-technology

Windows-11: సరికొత్త డిజైన్​తో మైక్రోసాఫ్ట్​ చివరి విండోస్​ - విండోస్​ 11కు సంబంధించిన ఫీచర్లు

ఎంతో ఉత్కంఠ రేపిన విండోస్‌ 11(Windows-11) ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. కొత్త డిజైన్‌, వినూత్నమైన ఫీచర్లు, మెరుగైన నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకేసారి ఎన్నో పనులు చేసుకునేలా ఎక్కువ డెస్క్‌టాప్‌లను సృష్టించుకోవటానికి, వీటి మధ్య తేలికగా మారటానికి వీలుండటంతో పాటు సరికొత్త మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌, ఆండ్రాయిడ్‌ యాప్‌లను సపోర్టు చేయటం వంటి మార్పులెన్నింటినో కలబోసుకొని వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ చరిత్రలోనే అత్యంత అధునాతమైన, సమగ్రమైన ఆపరేటింగ్‌ సిస్టమ్‌గా పరిగణిస్తున్న దీని విశేషాలేంటో చూద్దాం.

windows 11 features
విండోస్​ 11
author img

By

Published : Jun 30, 2021, 10:32 AM IST

Updated : Jun 30, 2021, 11:24 AM IST

మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఐదేళ్ల తర్వాత విండోస్‌ ప్లాట్‌ఫామ్‌(Windows-11)లో తొలి భారీ మార్పును ఆవిష్కరించింది. టెక్నాలజీ పరిశ్రమ కోసం కొన్ని గణనీయమైన మార్పులకూ నాంది పలికింది. విండోస్‌ 10ను విడుదల చేస్తున్న సమయంలోనే 'ఇది విండోస్‌ చివరి వర్షన్‌' అని కంపెనీ గొప్పగా ప్రకటించింది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వర్షన్‌ అంటేనే భారీ మార్పులకు సంకేతం. భవిష్యత్‌ యాప్స్‌, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నరనటానికిదో సూచన. కాబట్టే డెవలపర్లు, వినియోగదారుల్లో ఇది సరికొత్త ఆసక్తిని రేకెత్తించింది. అనుకున్నట్టుగానే మునుపెన్నడూ లేని ఫీచర్లను ముందుకు తెచ్చింది.

ఆండ్రాయిడ్‌ యాప్‌ సపోర్టు

WINDOWS 11 FEATURES
ఆండ్రాయిడ్‌ యాప్‌ సపోర్టు

అతి పెద్ద కొత్త మార్పు ఇదే. ఇప్పుడిక విండోస్‌లోనూ ఆండ్రాయిడ్‌ యాప్‌లను వాడుకోవచ్చు. ఇందుకోసం అమెజాన్‌, ఇంటెల్‌ సంస్థలతో మైక్రోసాఫ్ట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్‌ పరికరాలకు అమెజాన్‌ యాప్‌స్టోర్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను అందిస్తుంది. వివిధ ప్రాసెసర్లతో తయారయ్యే విండోస్‌ ల్యాప్‌టాప్‌ల్లో యాప్‌లు పనిచేయటానికి అనువైన పరిజ్ఞానాన్ని ఇంటెల్‌ బ్రిడ్జ్‌ కల్పిస్తుంది. ఇలా విండోస్‌తో ఆండ్రాయిడ్‌ యాప్‌ల కలయికతో పీసీలు మరింత వైవిధ్య భరితం కానున్నాయి. అంటే జొమాటో, ఓలా, ఉబర్‌ వంటి యాప్‌లను సైతం కొత్త విండోస్‌ వేదికలో వినియోగించుకోవటానికి వీలుంటుందన్నమాట.

టీమ్స్‌ జోడింపు

WINDOWS 11 FEATURES
టీమ్స్‌ జోడింపు

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వీడియో సమావేశాలకు ఆదరణ గణనీయంగా పెరిగింది. మున్ముందూ ఈ ధోరణి కొనసాగేదే. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మైక్రోసాఫ్ట్‌ సంస్థ విండోస్‌11కు టీమ్స్‌నూ జతచేసింది. అంటే టీమ్స్‌ ఇకపై నేరుగా కొత్త ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమవుతుందన్నమాట. స్టార్ట్‌ మెనూలోనే ఇది దర్శనమిస్తుంది. వీడియో సమావేశాలు, మాటామంతీ పరంగా ఇది పెద్ద అడుగే. దీంతో తేలికగా, త్వరగా టీమ్‌ సమావేశాల్లో పాల్గొనటానికి వీలవుతుంది. టాస్క్‌బార్‌ నుంచే మ్యూట్‌, అన్‌మ్యూట్‌ చేసుకోవచ్చు. పర్సనల్‌ కాంటాక్ట్‌లతో ఎక్కడైనా టెక్స్ట్‌, ఛాట్‌, వాయిస్‌, వీడియోల ద్వారా కనెక్ట్‌ కావొచ్చు. అవతలివాళ్లు టీమ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోయినా ఎస్‌ఎంఎస్‌ ద్వారా అనుసంధానమయ్యే వీలుండటం విశేషం.

భవిష్యత్‌ పీసీలకు మార్గనిర్దేశం

WINDOWS 11 FEATURES
భవిష్యత్‌ పీసీలకు మార్గనిర్దేశం

డెస్క్‌టాప్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో తిరుగులేని ఆధిపత్యం గల విండోస్‌ కొత్త వర్షన్‌ భవిష్యత్‌ పీసీలకూ మార్గనిర్దేశం చేయనుంది. ఎందుకంటే దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకోవటానికి పీసీకి కనీస అవసరాలు తప్పనిసరి. 'సపోర్టు చేసే పీసీ'ల్లో విండోస్‌11 ఉచితంగా అప్‌డేట్‌ అవుతుంది గానీ పీసీకి కనీసం 64-బిట్‌ సీపీయూ, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉండాలి. పైగా టీపీఎం సెక్యూరిటీ చిప్‌తో కూడినదై ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని భద్రంగా ఉంచటం కోసం దీన్ని తప్పనిసరి చేశారు. దీంతో విండోస్‌11 సపోర్టుతో కూడిన చవకైన ల్యాప్‌టాప్‌లు సైతం చాలా వేగంగా, సురక్షితంగా పనిచేస్తాయి.

థర్డ్‌పార్టీ చెల్లింపులకు సై

డెవలపర్లు థర్డ్‌పార్టీ చెల్లింపు వ్యవస్థలను వాడుకోవటానికి కొత్త మైక్రోసాఫ్ట్‌ స్టోర్స్‌ అనుమతిస్తుంది. తమ యాప్‌లు, సేవల నుంచి వచ్చే ఆదాయాన్ని పూర్తిగా డెవలపర్లే ఉంచుకోవచ్చు.

మీ పీసీ సపోర్టు చేస్తుందా?

WINDOWS 11 FEATURES
మీ పీసీ సపోర్టు చేస్తుందా?

అన్ని యోగ్యమైన విండోస్‌ 10 కంప్యూటర్లలోనూ విండోస్‌ 11ను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే మీ కంప్యూటర్‌ దీన్ని సపోర్టు చేస్తుందా? తెలియటం లేదా? దీన్ని గుర్తించటానికీ మైక్రోసాఫ్ట్‌ సంస్థ విండోస్‌ పీసీ హెల్త్‌ చెక్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ముందుగా https://www.microsoft.com/en-in/windows/windows-11 లోకి వెళ్లాలి. ఓపెన్‌ అయిన పేజీలో కిందికి వెళ్లి చెక్‌ కంపాటబిలిటీని క్లిక్‌ చేయాలి. విండోస్‌ పీసీ హెల్త్‌ చెక్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇన్‌స్టాల్‌ పూర్తయ్యాక 'ఓపెన్‌ విండోస్‌ పీసీ హెల్త్‌ చెక్‌' ఆప్షన్‌ను ఎంచుకొని ఫినిష్‌ బటన్‌ను నొక్కాలి. అనంతరం చెక్‌ నౌ బటన్‌ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌ చేస్తే చాలు. ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లు విండోస్‌ 11కు అనుగుణమైనదో కాదో చెక్‌ చేసి తెలుపుతుంది.

ఎన్నో పనులు ఒకేసారి

WINDOWS 11 FEATURES
ఎన్నో పనులు ఒకేసారి

ఒకేసారి చాలా పనులు చేసుకోవటానికి కొత్త స్నాప్‌ లేఅవుట్లు, స్నాప్‌ గ్రూప్స్‌, డెస్క్‌టాప్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకమైన డెస్క్‌టాప్‌లనూ సృష్టించుకోవచ్చు. అవసరమైనట్టుగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు- పనులకు, చదువుకోవటానికి, గేమింగ్‌కు వేర్వేరుగా డెస్క్‌టాప్‌లను సృష్టించుకోవచ్చు

గేమర్లకు పండుగ

WINDOWS 11 FEATURES
గేమర్లకు పండుగ

పీసీ గేమర్ల కోసం గణనీయమైన మార్పులెన్నో కనువిందు చేయనున్నాయి. డైరెక్ట్‌ఎక్స్‌ 12 అల్టిమేట్‌ను విండోస్‌ 11 సపోర్టు చేస్తుంది. ఇది చాలా ఎక్కువ ఫ్రేమ్‌ రేట్లతో గ్రాఫిక్స్‌కు వీలు కల్పిస్తుంది. మరింత స్పష్టమైన, విశాలమైన దృశ్యాలకు అనుగుణమైన ఆటో హెచ్‌డీఆర్‌నూ సపోర్టు చేస్తుంది. మరింత వేగంగా లోడ్‌ చేసుకోవటానికి తోడ్పడే డైరెక్ట్‌స్టోరేజ్‌ సైతం అందుబాటులోకి రానుంది. దీంతో సీపీయూ ద్వారా కాకుండా నేరుగా గ్రాఫిక్‌ కార్డుల మీదే గేమ్స్‌ అసెట్స్‌ను లోడ్‌ చేసుకోవచ్చు. విండోస్‌ 11లో బిల్టిన్‌గాఎక్స్‌బాక్స్‌ సైతం అందుబాటులో ఉంటుంది. ఎక్స్‌బాక్స్‌ గేమ్‌ పాస్‌ గలవారంతా 100కు పైగా హై క్వాలిటీ గేమ్స్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.

వైవిధ్యమైన విడ్జెట్లు

WINDOWS 11 FEATURES
వైవిధ్యమైన విడ్జెట్లు

వార్తలు, వాతావరణ, క్యాలెండర్‌, చేయాల్సిన పనుల జాబితా, ఇటీవల చూసిన ఫొటోలకు సంబంధించిన అప్‌డేటెడ్‌ విడ్జెట్లు కనువిందు చేయనున్నాయి. అంటే ఫోన్లలో మాదిరిగానే డెస్క్‌టాప్‌లోనూ వార్తలు, వాతావరణం వంటివి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చన్నమాట. కావాలనుకుంటే అన్నింటిని ఒకేసారి ఫుల్‌ స్క్రీన్‌లోనూ చూసుకోవచ్చు. ఈ విడ్జెట్లతో కొత్తవి జోడించుకోవచ్చు. వద్దనుకుంటే ఎప్పుడైనా తొలగించుకోవచ్చు. పర్సనలైజ్డ్‌ ఫీడ్‌ను ఓపెన్‌ చేసినప్పుడు తెర మీద గ్లాసు పొర మాదిరిగా జరుగుతూ వెళ్తుంది. చేస్తున్న పనికి ఎలాంటి ఆటంకం కలగదు.

ఇదీ చూడండి: గూగుల్ పిక్సెల్​ 5ఏ రిలీజ్​ డేట్ ఫిక్స్​!

Last Updated : Jun 30, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.