ETV Bharat / science-and-technology

'అంగారక గ్రహానికి పోదాం పదండి' - వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నివేదిక

భూ గ్రహానికి జనాభా విస్ఫోటం కంటే మించిన భారం మరొకటి లేదని అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే అంగారక గ్రహంపైకి మానవుడు వలస వెళ్లాలని అంటుంటారు ఆయన. నిర్ణీత గడువు, కార్యాచరణ, పక్కా ప్రణాళికతో ఇది సాధ్యమే అంటారు. చాలాకాలంగా ఈ వాదనను బలంగా వినిపిస్తున్న మస్క్.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ELON MUSK
ఎలాన్ మస్క్
author img

By

Published : Jul 20, 2021, 2:00 PM IST

లగ్జరీ కార్ల సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్​ఎక్స్ అధినేత ఎలాన్​ మస్క్ ట్విట్టర్​లో చురుగ్గా ఉంటూ.. ఎప్పటికప్పడు తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ మేరకు జనాభా విస్ఫోనంపై 'టెస్లా ఓనర్స్ ఆఫ్ ద ఈస్ట్ బే' అనే ఫ్యాన్ క్లబ్ చేసిన ఆసక్తికర ట్వీట్​కు బదులిచ్చారు. 'జనాభా విస్ఫోటం ప్రభావం మనపై పడొచ్చు. కానీ దీనిని అరికట్టేందుకు మీరు(మస్క్) గట్టి ప్రయత్నాలు చేస్తున్నందుకు అభినందిస్తున్నాం' అంటూ ఆ ఫ్యాన్ క్లబ్ రాసుకొచ్చింది.

దానికి బదులుగా​.. అంగారక గ్రహానికి వెళదాం అంటూ ట్వీట్​ చేశారు మస్క్​.

ELON MUSK
టెస్లా ఓనర్స్ ఆఫ్ ద ఈస్ట్ బే ఫ్యాన్ క్లబ్ ట్వీట్​

"అంగారక గ్రహానికి మానవుల అవసరం చాలా ఉంది. భూమిపై తమతో పాటు ఇతర జీవులను సంరక్షించుకునేందుకు మనిషి ఉన్నాడు. కాబట్టి అంగారక గ్రహానికి వెళదాం."

--ట్విట్టర్​లో ఎలాన్ మస్క్

ELON MUSK
ఎలాన్ మస్క్ ట్వీట్

2050-2100 మధ్యలో సంతానోత్పత్తి రేటు తీవ్రం కానుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ నివేదిక-2020 పేర్కొంది. ఈ అధ్యయనం ప్రముఖ సైన్స్ జర్నల్ 'ది లాన్సెట్‌'లోనూ ప్రచురితమైంది.

ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా మళ్లీ ఎలాన్​ మస్క్​

ఇదీ చదవండి: మస్క్ పేరుతో మోసం- 2 మిలియన్ డాలర్ల నష్టం!

"జనాభా విస్ఫోటం.. అనేది మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద సమస్య. ప్రస్తుతం అంగారకునిపై జనాభా లేనందున మానవునికి ఉపయోగకరంగా ఉంటుంది. అరుణ గ్రహానికి ప్రాణం పోదాం పదండి."

--ట్విట్టర్​లో ఎలాన్ మస్క్

మానవులను అంగారక గ్రహాంపైకి తీసుకెళ్లాలనే ప్రణాళికలను వేగవంతం చేసిన మస్క్.. వచ్చే ఐదున్నర ఏళ్లలో దీనిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫిబ్రవరిలో వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.