మొబైల్.. ప్రస్తుతం ప్రజలకు నిత్యావసర వస్తువులా మారింది. కొద్ది సేపు ఫోన్ కనిపించకుంటే కంగారు పడిపోతుంటారు. అంతలా జీవన విధానాన్ని మార్చేసింది సెల్ ఫోన్. మరి అలాంటి ఫోన్ వాడకం విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రంతా ఛార్జింగ్ పెట్టొచ్చా? 100 శాతం వరకు ఛార్జింగ్‌లోనే ఉంచొచ్చా? బ్యాటరీ జీరో పర్సంట్కు వచ్చాకే మళ్లీ ఛార్జ్ చేయడం మంచిదా? పదే పదే ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ దెబ్బతింటుందా? ఛార్జింగ్ అవుతుండగా ఫోన్ వాడొచ్చా? ఇవి అందరి మదిలో మెదిలే ప్రశ్నలే. మరి ఇందులో ఏది నిజం? ఛార్జింగ్ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? ఆ అపోహలు.. వాస్తవాలు తెలుసుకుందాం.
అపోహ-1: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టొద్దు.
వాస్తవం: ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్‌లో ఉంచితే ఎలాంటి ప్రమాదం లేదు. మీ ఫోన్ ఎప్పటికీ ఓవర్ ఛార్జ్ అయ్యే అవకాశం లేదు. బ్యాటరీ, ఛార్జర్పైనా ప్రభావం చూపదు. మంటలు కూడా చెలరేగవు. ఒకవేళ.. ఉపయోగించే ఛార్జర్లో, ఇంట్లోని ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టమ్‌లో లోపాలు ఉంటే మాత్రం ఇబ్బందులు రావచ్చు.
ప్రస్తుతం వాడకంలో ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీలు.. ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత విద్యుత్‌ను సంగ్రహించకుండా నిరోధించే పరికరాలను ఇన్‌బిల్ట్‌గా కలిగి ఉంటున్నాయి. అయితే.. అన్నివేళలా ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టి అలాగే ఉంచడం మంచిది కాదు. మీ మోడల్ అన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలదా? అన్నది పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
అపోహ-2: ఫోన్ మొత్తం డెడ్ (బ్యాటరీ జీరో పర్సెంట్) అయ్యాకే ఛార్జింగ్ పెట్టాలి.
వాస్తవం: ఈ విషయంలో చాలా మందికి భయాలు ఉన్నప్పటికీ ఇది కూడా నిజం కాదు. మీ ఫోన్ తయారీదారు ఇచ్చిన బ్రాండెడ్ ఛార్జర్, బ్యాటరీ వాడుతున్నంతకాలం.. ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడితే నష్టమేమీ లేదు. ఇక్కడ కూడా మీ ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టమ్‌లో సమస్య లేదని నిర్ధరించుకోవాలి.
ఛార్జింగ్ చేస్తూ ఫోన్ వాడిన సమయాల్లో.. పేలుడు సంభవించిన ఘటనలు ఉన్నప్పటికీ అప్పుడు ఇతర కారణాల వల్లేనని చాలా సార్లు అధికారులు తేల్చారు. థర్డ్ పార్టీ లేదా లోపాలు ఉన్న ఛార్జర్ల వాడకం, ఇతర కారణాలతో అలాంటి సంఘటనలు జరిగాయని స్పష్టం చేశారు.
అయితే.. ఛార్జ్ పెట్టి ఫోన్ వాడుతున్నప్పుడు మీరు నీటికి సమీపంలో ఉండకూడదు. ఈ పరిస్థితుల్లో థర్డ్ పార్టీ ఛార్జర్లకు కూడా దూరంగా ఉండటమే మంచిది.
అపోహ-4: ఆఫ్-బ్రాండ్ ఛార్జర్లు బ్యాటరీని దెబ్బతీస్తాయి.
వాస్తవం: ఇందులో నిజం లేదు. ఫోన్ ఏ బ్రాండ్ అయితే.. అదే బ్రాండ్ ఛార్జర్ వాడటం పైవాటిల్లో తప్పనిసరి అయినా ఇక్కడ బ్యాటరీని దెబ్బతీస్తాయని చెప్పలేం.
అలా అని.. మీరు వాడే ఫోన్ బ్రాండెడ్ ఛార్జర్‌ను వాడొద్దని చెప్పలేం. కానీ.. తప్పని పరిస్థితుల్లో ఇతర బ్రాండ్ ఛార్జర్లు బాగుంటాయనుకుంటే తీసుకోవడానికి సంకోచించకండి. అలాంటివి తీసుకునే ముందు కాస్త శోధించండి.
అపోహ-5: ఫోన్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచితే మంచిది.
వాస్తవం: ఇది మంచిది కాదు. చాలా మంది ఫోన్‌ను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచుతారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ఆఫ్ చేస్తుంటారు. ఇది పెద్ద సమస్య కానప్పటికీ.. ఇది క్రమక్రమంగా బ్యాటరీ లైఫ్, పెర్ఫామెన్స్‌ను తగ్గిస్తుంది. మీరు రోజూ ఫోన్‌ను ఆఫ్ చేయాలని లేదు కానీ.. వారానికి ఓసారి చేస్తే మంచిది. ఇలా రీబూటింగ్ చేస్తే.. మీ ఫోన్ సక్రమంగా పనిచేస్తుంది.
అపోహ-6: ఛార్జర్ అలానే ప్లగ్ చేసి ఉంచొద్దు.
వాస్తవం: ఛార్జర్‌ను అలాగే ప్లగ్ చేసి ఉంచొచ్చా వద్దా అనేది మీ వ్యక్తిగతం. కానీ.. ఫోన్‌ను ఛార్జ్ చేసిన తర్వాత.. మంటలు లాంటివి చెలరేగకుండా ఉండేందుకు వెంటనే తీసేయాలని భద్రతా నియమాలు చెబుతున్నాయి.
అయితే.. మీ ఛార్జర్లో త్వరగా వేడెక్కడం లేదా శబ్దాలు చేయడం వంటి సమస్యలు ఉంటే తీసేయడమే మంచిది. ఇంట్లో వాటర్ లీకేజీ సమస్యలు ఉన్నా, పెంపుడు జంతువులు ఇంట్లో తిరుగుతున్నా, ఇతర వైరింగ్ సమస్యలు ఉన్నా.. ఛార్జర్ ప్లగ్‌కు కనెక్ట్ చేయకపోవడమే మంచిది.
అపోహ-7: ఛార్జర్‌ను ఎంతకాలమైనా వాడొచ్చు.
వాస్తవం: అవును. మీరు మీ ఫోన్ ఛార్జర్ లేదా మంచి బ్రాండెకు చెందిన ఇతర ఛార్జర్లను వాడుతున్నంతకాలం ఇది సమస్యే కాదు. అయితే.. మీ మోడల్ బ్రాండ్ ఛార్జర్ వాడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది సురక్షితం అని గుర్తుంచుకోవాలి. ఇవి చాలావరకు పేలవు. పాడుకావు. ఎలాంటి ఇబ్బందికర శబ్దాలు చేయవు.
మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే.. టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫోన్ ఛార్జింగ్ గురించి అపోహలపై ఆందోళన చెందాల్సిన పని లేదు. యూజర్ల నిర్లక్ష్యం, పొరపాట్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు వంటివి.. ఫోన్ డ్యామేజీకి కారణం అవుతాయి కానీ.. ఛార్జర్‌తో కాదు.
ఇవీ చూడండి: 'సూపర్ స్మార్ట్' ఫోన్ కావాలా? ఈ 9 యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి!
ఇంటర్నెట్ లేకుండా బతకడం ఎలా? ఇవిగో 10 మార్గాలు..
జూన్‌లో రాలేదు కానీ.. జులైలో ఈ స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ పక్కా!