ETV Bharat / science-and-technology

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కీలక హెచ్చరిక! - గూగుల్‌ క్రోమ్‌ అప్‌డేట్‌

cyber attack on google chrome: కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. 97.0.4692.71 కంటే పాత వెర్షన్‌ గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్నవారి డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లు సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ ఏజెన్సీ హెచ్చరించింది.

Google Chrome
గూగుల్‌ క్రోమ్‌
author img

By

Published : Jan 9, 2022, 10:15 PM IST

cyber attack on google chrome: ప్రముఖ ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. 97.0.4692.71 కంటే పాత వెర్షన్‌ గూగుల్‌ క్రోమ్‌ వాడుతున్న వారి డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లు సైబర్‌ దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు ఇటీవల కాలంలో జరిగిన దాడులను ఉదహరించింది. వీటిని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులందరూ గూగుల్‌ క్రోమ్‌ తాజా వెర్షన్‌కు అప్‌డేట్‌ కావాలని సూచించింది. తద్వారా గూగుల్‌ క్రోమ్‌లోని పలు సాంకేతిక లోపాలకు పరిష్కారం లభించడమే కాకుండా.. సిస్టమ్స్‌పై సైబర్‌ కేటుగాళ్లకు నియంత్రణ సాధ్యపడదని వెల్లడించింది.

మరోవైపు మొబైల్స్‌కు సంబంధించి గూగుల్‌ క్రోమ్‌ యాప్‌తోపాటు ఇతర యాప్‌లను ఎప్పుటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అనుమానాస్పదంగా అనిపించే యాప్‌లు‌, ఈమెయిల్స్‌, వ్యక్తిగత సమాచారం అడిగే లింక్‌ల జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి లింక్‌లు ప్రమాదకర స్పైవేర్లను సిస్టమ్స్‌లోకి జొప్పిస్తాయి.

ఇదీ చూడండి: డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాతో వివో కొత్త 5జీ ఫోన్‌.. ధర, ఫీచర్లివే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.