ETV Bharat / science-and-technology

సైబర్​ నేరగాళ్ల వల నుంచి ఇలా తప్పించుకోండి..

సైబర్​ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిడిట్​ కార్డులు ఇస్తామని, క్యాష్​ బ్యాక్​ ఒచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? వాటిని గుర్తించడం ఎలా? అలాంటి మోసాల బారిన పడకుండా ఏం చేయాలి? అనే వివరాలపై ఓ ప్రత్యేక కథనం.

How to Safe from Cyber threats
సైబర్ నేరాలపట్ల తీసుకోవాల్సి జాగ్రత్తలు
author img

By

Published : Mar 23, 2021, 6:53 PM IST

దేశంలో సైబర్ నేరాగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్​లైన్​ మోసాల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. తాజాగా సైబర్​ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు, వ్యక్తిగత డేటా కాజేస్తున్నట్లు సైబర్​ నిపుణులు గుర్తించారు. క్రెడిట్ కార్డుల పేరుతో అలాంటి మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు వివరిస్తున్నారు.

యువకులే టార్గెట్​..

ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడటం ఎక్కువగా జరుగుతున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఉచితంగా క్రెడిట్​ కార్డ్ ఇస్తామని, భారీ ఆఫర్లు కూడా ఉన్నాయని సైబర్​ నేరగాళ్లు నమ్మబలుకుతున్నారు.

ముఖ్యంగా పెట్రోల్​, డీజిల్ ధరలు ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. తాము ఇచ్చే క్రెడిట్​ కార్డు వాడితే వాటిపై 15 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఆశ చూపుతున్నారు. చాలా మంది ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులై సైబర్​ నేరాగాళ్ల వలలో చిక్కుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు .

కొత్తగా క్రెడిట్​ కార్డుకోసం ఎదురుచూస్తున్న వారికి కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న వారికి క్యాష్​ బ్యాక్ వచ్చిందని నమ్మిస్తున్నారని సైబర్​ నిపుణులు ఆయుశ్ భరద్వాజ్​ చెబుతున్నారు. సామాజిక మాధ్యమల్లో 18 నుంచి 30 ఏళ్ల యువకులే లక్ష్యంగా ఈ మోసాలు అధికంగా జరుగుతున్నట్లు వివరించారు.

మోసాలు జరిగే తీరు..

పైన పేర్కొన్న ఆఫర్లలో ఆకర్షితులై నకిలీ ఫేస్​బుక్​ ఖాతాలో ఉండే సైట్ల ద్వారా ఎవరైనా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. వారికి సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్​ వస్తాయి. నిజమైన బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్​గానే మాట్లాడి.. అవతలి వ్యక్తి నుంచి ఆధార్​, పాన్​ వివరాలు సహా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.

ఇలా సేకరించిన సమాచారాన్ని డీప్​ వెబ్​లో అమ్మకానికి పెడ్డటం, కొత్త సిమ్​కార్డ్​లు కొనుగోలు చేసి నేరాలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు.

ఇప్పటికే క్రెడిట్ కార్డు వాడుతున్నవారికైతే.. మీకు క్యాష్​ బ్యాంక్ వచ్చిందని దాన్ని పొందాలంటే కొన్ని వ్యక్తిగత వివరాలు చెప్పాల్సి ఉంటుందని అడుగుతారు సైబర్ నేరగాళ్లు. మాటల్లో పెట్టి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్​ వివరాలు ఓటీపీ వంటి వాటిని అడుగుతారు.

అలా ఎవరైనా వివరాలు చెబితే వారి బ్యాంక్ ఖాతాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము కాజేస్తున్నారు సైబర్​ నేరగాళ్లు.

వలలో చిక్కుకోకుండా ఏం చేయాలి?

  • ఎవరైనా క్రెడిట్​ కార్డు కోసం దరఖాస్తు చేస్తే.. అది కచ్చితంగా సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్​సైటా? కాదా? అనేది నిర్ధరించుకోవాలి. ఫేస్​బుక్​లో బ్యాంకుల అధికారిక ఖాతాలకు బ్లూ టిక్ గుర్తింపు ఉంటుంది. బ్లూ టిక్ లేని ఖాతాల్లో ఉండే లింక్​లపై క్లిక్​ చేయొద్దని నిపుణులు ఆయుశ్​ భరద్వాజ్​ సూచించారు.
  • క్రెడిట్​ కార్డుల ద్వారా వచ్చే క్యాష్​ బ్యాక్​లు ఎప్పుడూ కూడా వినియోగదారుడి బ్యాంక్​ ఖాతాలో జమకాదు. మీ ఖాతాలో క్రెడిట్​ కార్డ్​ క్యాష్​బ్యాక్ జమ చేస్తామంటూ ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే.. అలాంటి కాల్స్, మెసేజ్​ల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
  • ఫోన్​ కాల్స్​ ద్వారా మిమ్మల్ని మాటల్లో పెట్టి.. క్యూఆర్​ కోడ్​లు స్కాన్​ చేయమన్నా, పిన్​ ఎంటర్​ చేయమని చెప్పినా, ఓటీపీలు అడిగినా చెప్పకూడదు. అలా ఎప్పుడైనా జరిగితే వెంటనే కాల్ కట్ చేసి.. ఫోన్​ వచ్చిన నంబర్​పై ఫిర్యాదు చేయాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
  • బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కూడా ఓటీపీ ఎప్పుడు కూడా అడగవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్​బీఐ, ట్రాయ్​ ఎప్పటికప్పుడు వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి.

ఇదీ చదవండి:బ్రౌజింగ్ హిస్టరీ సరే.. బ్రౌజర్‌ కహానీ తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.