Best Smartwatches In December 2023 : నేటి యువత ఫ్యాషన్ యాక్సెసరీస్ వాడడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా సంప్రదాయ చేతిగడియారాల కంటే స్మార్ట్‌వాచ్‌లు ధరించడానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే ఎలక్ట్రానిక్స్ కంపెనీలు అన్నీ యువతను ఆకట్టుకునేందుకు.. మంచి డిజైన్‌తో, సూపర్ ఫీచర్స్, స్పెక్స్‌తో సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి.
బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోవడం ఎలా?
ప్రస్తుతం మార్కెట్లో చెప్పలేనన్ని బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ను ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- బ్యాటరీ లైఫ్ : స్మార్ట్‌వాచ్ బ్యాటరీ లైఫ్ కాస్త ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం చాలా బ్రాండ్లు కనీసం 5-10 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఉండే వాచ్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. వీటిలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోవాలి.
- స్క్రీన్ సైజ్ : నేడు చాలా స్మార్ట్ఫోన్లు అధునాత ఫీచర్లతో వస్తున్నాయి. వాటిని సరిగ్గా వాడుకోవాలంటే.. స్క్రీన్ సైజ్ కాస్త పెద్దగా ఉండే స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోవడం మంచిది.
- కాలింగ్ ఫీచర్ : కొన్ని స్మార్ట్‌వాచ్‌లు కాలింగ్ ఫీచర్‌తో వస్తున్నాయి. అత్యవసర సమయాల్లో ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది. కనుక కాలింగ్ ఫీచర్ ఉన్న స్మార్ట్‌వాచ్‌నే ఎంచుకోవడం మంచిది.
- హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ : నేడు చాలా స్మార్ట్ఫోన్లలో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్, స్పోర్ట్స్ ఫీచర్స్ ఉంటున్నాయి. ముఖ్యంగా ఈసీజీ ట్రాకర్ లాంటి ఫీచర్లు మీ ఆరోగ్య సమాచారాన్ని అందిస్తాయి. స్పోర్ట్ ఫీచర్లు.. మీరు వ్యాయామం చేసేటప్పుడు ఖర్చు చేస్తున్న క్యాలరీల గురించి సమాచారమిస్తాయి. కనుక ఇలాంటి మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోవాలి.
- డిజైన్ : మంచి ఆకర్షణీయంగా, మీ అభిరుచికి అనుగుణంగా సూపర్ డిజైన్‌తో ఉన్న స్మార్ట్‌వాచ్‌ను ఎంచుకోవాలి.
Best Smartwatchs In December 2023 : పైన పేర్కొన్న అన్ని మంచి క్వాలిటీలు ఉన్న టాప్-10 స్మార్ట్‌వాచ్‌లపై ఓ లుక్కేద్దాం.
1. Amazfit GTS 4 Mini Smart Watch Features : అమేజ్‌ఫిట్ జీటీఎస్ వాచ్.. 5 శాటిలైట్ పొజిషనింగ్ సిస్టమ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. కనుక మీ మూమెంట్స్‌ను చాలా సులువుగా ట్రాక్ చేసుకోవచ్చు. దీని బాడీ చాలా స్ట్రాంగ్‌గా, చూడడానికి మంచి స్టైలిష్‌గా ఉంటుంది.
Amazfit GTS 4 Mini Smart Watch Price : మార్కెట్లో ఈ అమేజ్‌ఫిట్ జీటీఎస్ 4 మినీ స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.7,999 వరకు ఉంటుంది.
2. Fossil Gen 6 Smartwatch Features : ఈ స్మార్ట్‌వాచ్‌లో 24 అవర్ ప్లస్ మల్టీ-డే అనే డైనమిక్ ఫీచర్ ఉంది. ఇది యూఎస్బీ డేటా కేబుల్‌తో వస్తుంది. దీనిలో అనేక స్మార్ట్‌వాచ్ ఫేసెస్ ఉంటాయి. కనుక మీకు నచ్చినట్లుగా ఈ స్మార్ట్‌వాచ్ లుక్‌ను మార్చుకోవచ్చు. అంతేకాదు.. దీనిలో ఫిట్నెస్, పేమెంట్స్, సోషల్, న్యూస్ యాప్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి.
Fossil Gen 6 Smartwatch Price : మార్కెట్లో ఈ ఫాసిల్ జెన్ 6 స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.12,497 ఉంటుంది.
3. Fastrack New Limitless FS1 Smartwatch Features : ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్‌లో ఫాస్ట్రాక్ ఒకటి. దీనిలో వాటర్‌ఫ్రూఫ్ మెకానిజం ఉంది. కనుక నీటిలోనూ దీనిని వాడవచ్చు. దీనిలో నెక్ట్స్ జెన్ ఏటీఎస్ చిప్సెట్ అమర్చారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో బిల్ట్-ఇన్ అలెక్సా ఉంది. దీని ద్వారా మ్యూజిక్‌ను కూడా కంట్రోల్ చేయవచ్చు. దీనిలో బోలెడ్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్‌వాచ్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
Fastrack New Limitless FS1 Smartwatch Price : మార్కెట్లో ఈ ఫాస్ట్రాక్ స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.1,999 ఉంటుంది.
4. Boat Wave Proc47 Smartwatch Features : 1.69 అంగుళాల స్క్రీన్, స్క్వేర్ డయిల్ సహా మంచి టచ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్మార్ట్‌వాచ్ ఇది. ఈ బోట్ స్మార్ట్‌వాచ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది స్లీక్ మెటాలిక్ డిజైన్‌తో, మల్టిపుల్ థీమ్ వాచ్ ఫేసెస్‌తో వస్తుంది.
Boat Wave Proc47 Smartwatch Price : మార్కెట్లో ఈ బోట్ స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.3,509 ఉంటుంది.
5. Honor Watch GS 3 Smartwatch Features : హానర్ వాచ్ జీఎస్ 3 పురుషులతోపాటు, మహిళలకు కూడా చాలా బాగుంటుంది. ఇది మంచి స్టైలిష్, స్లీక్ డిజైన్‌తో వస్తుంది. దీని ద్వారా మీ బ్లడ్‌లోని ఆక్సిజన్ లెవెల్స్‌ను తెలుసుకోవచ్చు. అలాగే స్లీప్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ను కేవలం 5 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
Honor Watch GS 3 Smartwatch Price : మార్కెట్లో ఈ హానర్ స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.16,990 ఉంటుంది.
6. Samsung Galaxy Watch 4 Features : శాంసంగ్ స్మార్ట్ఫోన్లతో ఈ స్మార్ట్‌వాచ్‌ను చాలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో మహిళల ఆరోగ్యాన్ని అనాలసిస్ చేసే ఎన్నో హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే 90 వర్కౌట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీనిలోని బ్యాటరీని ఫుల్ రీఛార్జ్ చేస్తే.. 40 గంటల పాటు పనిచేస్తుంది.
Samsung Galaxy Watch 4 Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ 4 ధర సుమారుగా రూ.11,999 వరకు ఉంటుంది.
7. Fire Boltt Ninja Call Pro Smartwatch Features : మ్యూజిక్ లవర్స్‌కు ఈ ఫైర్ బోల్ట్ నింజా స్మార్ట్‌ఫోన్ చాలా బాగుంటుంది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ 5 రోజులు. ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్.. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి యాప్స్‌ను సపోర్ట్ చేస్తుంది. పైగా దీనిలో హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్ లాంటి ఎన్నో హెల్త్ ఫీచర్లు ఉన్నాయి.
Fire Boltt Ninja Call Pro Smartwatch Price : మార్కెట్లో ఈ ఫైర్ బోల్ట్ నింజా స్మార్ట్‌ఫోన్ ధర సుమారుగా రూ.1,099 ఉంటుంది.
8. Apple Watch SE 2nd Gen Samartwatch Features : యాపిల్ లవర్స్ అందరికీ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది వాటర్‌ప్రూఫ్ ఉన్న స్మార్ట్‌వాచ్. దీనిలో డైనమిక్ ఫీచర్లు చాలానే ఉన్నాయి. దీని సైజ్, కలర్, స్ట్రాప్స్ అన్నింటినీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది హార్ట్ రిథమ్‌ను కూడా అనలేజ్ చేసి యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌తో.. మిగిలిన యాపిల్ ప్రొడక్టులను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఐఫోన్ 8, దాని తరువాతి లేటెస్ట్ వెర్షన్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
Apple Watch SE 2nd Gen Samartwatch Price : మార్కెట్లో ఈ యాపిల్ స్మార్ట్‌వాచ్ ధర రూ.29,999 ఉంటుంది.
9. Fire Boltt Ninja Call Pro Max 2.01 Smartwatch Features : ఈ ఫైర్ బోల్ట్ నింజా స్మార్ట్‌ఫోన్‌లో కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ సహా, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. పైగా దీనితో మీ స్మార్ట్‌ఫోన్‌లోని మ్యూజిక్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.
Fire Boltt Ninja Call Pro Max 2.01 Smartwatch Price : మార్కెట్లో ఈ ఫైర్ బోల్ట్ నింజా స్మార్ట్‌వాచ్ ధర సుమారుగా రూ.1,399 ఉంటుంది.
10. Samsung Galaxy Watch5 Features : ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ ఉన్నవారికి, క్రీడాకారులకు ఈ శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో అనేక హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy Watch5 Price : మార్కెట్లో ఈ శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 ధర సుమారుగా రూ.22,999 ఉంటుంది.
'చంద్రుడిపై నుంచి రాళ్లు తీసుకురావడమే టార్గెట్- అది అంత ఈజీ కాదు'
జీ-మెయిల్ ఎక్స్పర్ట్ అవ్వాలా? సింపుల్‌గా ఈ షార్ట్‌కట్స్ గురించి తెలుసుకోండి!
గూగుల్ మ్యాప్స్ Fuel Saving ఫీచర్ - ఇంధనం, డబ్బు రెండూ ఆదా!