ETV Bharat / science-and-technology

నాసా మూన్ మిషన్​కు లీకుల బెడద, రాకెట్ ప్రయోగం వాయిదా

author img

By

Published : Aug 29, 2022, 6:25 PM IST

Artemis 1 Space Launch 5 సుదీర్ఘ విరామం తర్వాత జాబిల్లిపైకి మానవసహిత యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్న నాసాకు తొలి ప్రయత్నంలో చుక్కెదురైంది. ఆర్టెమిస్‌ 1 పేరుతో నాసా చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రయోగం వాయిదా పడింది.

artemis 1 launch
ఆర్టెమిస్‌ 1

Artemis 1 Space Launch: 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఆర్టెమిస్‌-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్‌, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా.. ఇంధన ట్యాంకర్​లో లీకేజీల కారణంగా పలుమార్లు అవాంతరాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరిస్తూ ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు నాసా తొలుత ప్రకటించింది. అయితే, చివరికి రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. సోమవారం ప్రయోగం నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. తదుపరి తేదీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని వివరించింది.

ఫ్లోరిడాలోని నాసా కెనెడీ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటికే లాంచ్‌పాడ్‌పై రాకెట్‌ను ఉంచారు. శనివారం లాంచ్‌పాడ్‌ను ఐదు పిడుగులు తాకినా రాకెట్‌కుగాని, ఓరియన్‌ క్యాప్సూల్‌కుగాని ఎలాంటి నష్టం జరగలేదు. అయితే, రాకెట్ ప్రయోగానికి గంటల ముందు లాంఛ్ సిస్టమ్ రాకెట్​లో ఇంధనం లీక్ అయినట్లు సమాచారం. సూపర్ కోల్డ్ హైడ్రోజన్, ఆక్సిజన్ లీక్ అవ్వడం వల్ల ప్రయోగాన్ని వాయిదా వేశారు. పిడుగల కారణంగా నిర్దేశించిన సమయం కంటే ఇంధన సరఫరా గంట ఆలస్యంగా నడిచింది. అనంతరం, రిహార్సల్స్​ నిర్వహించగా ఆ సమయంలోనే ఇంధన లీకేజీ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాల్వ్​లోనూ లీకేజీలు ఏర్పడ్డాయి. ఉదయం, నాలుగు ప్రధాన ఇంజిన్లు, పెద్ద ఇంధన ట్యాంకు ఉన్న ప్రాంతంలో పగుళ్లు లేదా లోపాలు గుర్తించినట్లు నాసా అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి: వచ్చేస్తోంది 5జీ శకం, ప్రపంచాన్నే మార్చేసే సాంకేతికత

పంపిన వారికి తెలియకుండా వాట్సాప్​ మెసేజ్​లు చదివేయండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.