ETV Bharat / science-and-technology

యాపిల్ బడ్జెట్​ ఫోన్​ ఎస్​ఈ 2022​ ఫీచర్లు లీక్​!

లగ్జరీ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. మరో బడ్జెట్ మోడల్​ ఎస్​ఈ 2022ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేసే ముందే నెట్టింట పలు ఫీచర్లు లీకయ్యాయి. మరి ఎస్​ఈ 2022 ఎలా ఉండబోతుందో మీరు చూసేయండి.

Another new phone from Apple brand..Features Leaked!
యాపిల్​ నుంచి మరో సరికొత్త ఫోన్​.. ఫీచర్లు లీక్​!
author img

By

Published : Apr 5, 2021, 12:56 PM IST

ప్రముఖ టెక్​ దిగ్గజం యాపిల్​ నుంచి రానున్న మరో బడ్జెట్​ ఫోన్​కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట్లో హాల్​చల్​ చేస్తున్నాయి. యాపిల్ బడ్జెట్ సెగ్మెంట్​లో ఎస్​ఈకి కొనసాగింపుగా.. ఎస్ఈ 2022 పేరుతో ఈ ఫోన్​ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సెగ్మెంట్​లో ఎస్​ఈ, ఎస్​ఈ 2020లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

రోస్​ యంగ్​ అనే ఓ టెకీ యాపిల్​ ఎస్​ఈ 2022​ ఫీచర్లు లీకైనట్లు ట్వీట్​ చేశారు. యంగ్​ ట్వీట్​ ప్రకారం ఐఫోన్ 2022 మోడల్​ 4.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేతో రానుంది. ఇదిలా ఉంటే 2023 మోడల్ 6.1 అంగుళాల స్క్రీన్‌తో మరింత పెద్దదిగా ఉండబోతోందని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్​ఈ 2023 వెర్షన్‌లో పంచ్ హోల్ డిస్​ప్లే ఉండనున్నట్లు సమాచారం. ఈ రెండు వేరియంట్లకు 5జీ సపోర్ట్ ఉండనుంది.

మరి ఎస్​ఈ 2022, ఎస్ఈ 2023 మోడళ్ల ధర, ఇతర ఫీచర్లు ఎలా ఉంటాయనే విషయం తెలియాలంటే యాపిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి:
భారత్​లోనే ఐఫోన్​ 12 తయారీ- ధర తగ్గుతుందా
?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.