ETV Bharat / science-and-technology

'సూపర్ స్మార్ట్' ఫోన్​ కావాలా? ఈ 9 యాప్స్​ ఇన్​స్టాల్​ చేసుకోండి!

Useful Android Apps: టెక్‌ యుగంలో దాదాపు 50 శాతం మంది ప్రజలు.. రోజులో 5-6 గంటలు స్మార్ట్‌ఫోన్లతోనే గడుపుతున్నారట. స్మార్ట్​ఫోన్ల ఎక్కువైన ఈ తరుణంలో అనేక కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిలో.. మీ మొబైల్​ను మరింత స్మార్ట్​గా మార్చే 9 ప్రత్యేక యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

Useful Android Apps That'll Make Your Phone Smarter

author img

By

Published : Jun 28, 2022, 8:07 AM IST

Useful Android Apps: కెమెరా, గ్యాలరీ, ఫైల్ మేనేజర్, కాంటాక్ట్స్​, మ్యూజిక్ ప్లేయర్.. దాదాపు నిత్యం ఉపయోగించే యాప్స్ ఇవి. అయితే.. స్మార్ట్​ ఫోన్​లోనే డిఫాల్ట్​గా వచ్చే ఈ యాప్స్​లో ఎప్పటికీ పెద్దగా మార్పులు ఉండవు. ఉన్న ఫీచర్లతోనే సరిపెట్టుకోవాలి. అయితే.. ఇలాంటి ఉపయోగకర యాప్స్​కు ఇప్పుడు అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని ఇన్​స్టాల్​ చేసుకుంటే మీ మొబైల్​ మరింత స్మార్ట్​గా తయారవుతుంది. వాటిపై ఓ లుక్కేయండి!

1. ఫైల్స్​ గో(ఫైల్​ మేనేజర్​): ఫైల్ మేనేజ్​మెంట్​ యాప్​కు.. 'ఫైల్స్ గో' మంచి ఆల్టర్నేటివ్. మెసేజింగ్ యాప్‌ల ద్వారా వచ్చిన డూప్లికేట్​ ఫైల్స్, జంక్​ పిక్చర్స్, వీడియోలు గుర్తించి తొలగించమని సలహా ఇస్తుంది. వినియోగంలో లేని యాప్స్​ను అన్ఇన్​స్టాల్​ చేయమని గుర్తు చేస్తుంది. వీటన్నింటితో పాటు భారీ మొత్తంలో ఉన్న ఫైల్స్​ను షేర్​ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

Useful Android Apps
ఫైల్స్​ గో(ఫైల్​ మేనేజర్​)

2. పికాయ్​(కెమెరా): పికాయ్​.. మొబైల్​లోని డిఫాల్ట్​ కెమెరా యాప్​కు మంచి ప్రత్యామ్నాయం. సీన్​ డిటెక్షన్ అల్గారిథం దీని ప్రత్యేకత. మీరు ఫొటో తీస్తుండగానే.. అది మరింత అందంగా కనిపించేందుకు ఎలాంటి ఫిల్టర్​ ఉపయోగిస్తుంటే బాగుంటుందో లైవ్​లోనే సూచిస్తుంది. సంజ్ఞలతోనే ఆ ఫిల్టర్లను మార్చుకోవచ్చు. ఇది ఫ్రంట్​ కెమెరాకు కూడా పనిచేస్తుంది.

Useful Android Apps
పికాయ్​(కెమెరా)

3. స్మార్ట్​ లాంచర్​ 5: ఫోన్‌లో పాత ఇంటర్‌ఫేస్‌తోపాటు, యాప్స్‌, ఫోన్‌ పనితీరులో మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకునేందుకు ఆండ్రాయిడ్ యూజర్లకు లాంచర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి స్మార్ట్​ లాంచర్​ 5. ఈ యాప్​ను లాంచ్​ చేయడం ద్వారా ఫొన్లోని యాప్స్​ను గ్రిడ్స్​ స్థానంలో విడ్జెట్స్​గా మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా యాప్​లను రీసైజ్​ చేసుకోవచ్చు. ప్రీమియం వెర్షన్​తో వాల్​పేపర్​, ఎడిట్​ కేటగిరీలు, అడ్వాన్స్​డ్ ఐకాన్స్​ సదుపాయాలు అన్​లాక్​ చేయవచ్చు.

Useful Android Apps
స్మార్ట్​ లాంచర్​5(లాంచర్​)

4. ట్రూకాలర్​: ఆండ్రాయిడ్​ ఫోన్లలో మెసేజింగ్​ యాప్​ డిఫాల్ట్​గా వచ్చినా అంతగా రక్షణ కలిగి ఉండదు. ఇలాంటి వారికోసం మెసేజ్​ యాప్​ను మార్చుకోవడాన్ని గూగుల్​ సులభతరం చేస్తుంది. ట్రూకాలర్​లో కాలర్​ ఐడీ ఆన్​ చేసిన తర్వాత స్పామ్ మెసేజ్​స్​ రాకుండా చూస్తుంది. ఇవే కాక వన్​టైమ్​ పాస్​వర్డ్ కాపీ చేయడం, స్మార్ట్ కేటగిరీ ఆప్షన్లతో ఉంటుంది.

Useful Android Apps
ట్రూకాలర్​(ఎస్​ఎమ్​ఎస్​)

5. మ్యూజిక్స్​మ్యాచ్(మ్యూజిక్​ ప్లేయర్​): మ్యూజిక్స్​మ్యాచ్ అనేది గుర్తింపు పొందిన యాప్​ కానప్పటికీ.. మంచి ఫీచర్లను కలిగి ఉండి అద్భుతంగా పనిచేస్తుంది. మనం ప్లే చేస్తున్న పాటలకు సంబంధించిన లిరిక్స్​ను చూపిస్తుంది. ఆ లిరిక్స్​ను పోస్టర్​గా మార్చి సోషల్​ మీడియాలో షేర్​ చేసుకునే అవకాశం ఉంది. ఇతర భాషల్లోని పాటలను మనకు నచ్చిన భాషల్లోకి ట్రాన్స్​లేట్​ చేసే సదుపాయం కూడా ఉంది. థర్డ్​ పార్టీ యాప్​లైన యాపిల్​ మ్యూజిక్, స్పాటిఫై లాంటి యాప్స్​లోనూ పనిచేస్తుంది.

Useful Android Apps
మ్యూజిక్స్​మ్యాచ్(మ్యూజిక్​ ప్లేయర్​)

6. ఒపెరా టచ్​(బ్రౌజర్​): ఆండ్రాయిడ్​లో ఉండే బ్రౌజింగ్ యాప్​లలో ఒపెరా టచ్​ ఒకటి. పెద్ద స్కీన్లు గల ఫోన్లలో సైతం సులభంగా ఉపయోగించుకునేలా ఈ యాప్​ ఉంటుంది. సాధారణంగా అన్ని యాప్​లలో ఆప్షన్లు వరుసగా ఉంటాయి. కానీ దీంట్లో ఫాస్ట్ యాక్షన్​ బటన్​తో మరొక ట్యాబ్‌కు మారడం, రీలోడ్, సెర్చింగ్​ లాంటివన్నీ యాక్సెస్ చేయడానికి సులభంగా ఉంటుంది.

Useful Android Apps
ఒపెరా టచ్​(బ్రౌజర్​)

7. డ్రూప్​(ఫోన్​, కాంటాక్ట్స్​): ఫోన్​ డైలర్​, కాంటాక్ట్స్​ యాప్స్​ గురించి పెద్దగా ఆలోచించరు. ఒకవేళ గనుక మీరు ప్రత్యామ్నాయం చూస్తే డ్రూప్​ అనేది మీకు మంచి ఆప్షన్​. ఇది మీకు కావాల్సిన ప్రతి కాంటాక్ట్​ను ఫింగర్​టిప్స్​ పైనే ఉంచుతుంది. స్వైప్​ ఆధారిత యూఐ ద్వారా పనిచేసే ఈ యాప్​ ఫ్లోటింగ్​ ఐకాన్​తో ఎప్పుడూ స్క్రీన్​ పైనే కనిపిస్తుంది. దాని పైన క్లిక్​ చేసి కాల్​ చేయడం, వాట్సాప్​ చాట్​ చేయడం లాంటివి చేసుకోవచ్చు.

Useful Android Apps
డ్రూప్​(ఫోన్​, కాంటాక్ట్స్​)

8. క్యూరేటర్​(గ్యాలరీ): ఈ యాప్​తో ఫొటోలను కంటెంట్​ ఆధారంగా గుర్తించి పనిచేస్తుంది. ఇది మనం అనుకున్న విషయాన్ని సెర్చ్​ చేసే సదుపాయాన్ని కల్పిస్తుంది. జంతువులు, స్కైలైన్​లు, సెల్ఫీల ఆధారంగా గుర్తించి ప్రత్యేకంగా ఉంచుతుంది. ఈ యాప్​ గూగుల్​ ఫొటోస్​ లాగా మెరుగైన ఫొటో మేనేజ్​మెంట్​ అందించకున్నా.. ఆఫ్​లైన్​లో బాగా పనిచేస్తుంది.

Useful Android Apps
క్యూరేటర్​(గ్యాలరీ)

9. AMడ్రాయిడ్​(క్లాక్​): AMడ్రాయిడ్​ అనేది నిద్ర నుంచి లేవడానికి అలారం పెట్టుకునే వాళ్ల కోసం అన్ని ఫీచర్లతో అందుబాటులో ఉన్న యాప్​. అనేక రకాల పరిస్థితులు, రోజులకు సరిపోయేలా దీన్ని రూపొందించారు. ఈ యాప్​తో ఫ్లాష్​లైట్​, వైఫైని ఆటోమేటిక్​గా ఆన్ చేసేలా సెట్​ చేసుకోవచ్చు. అలారంను తాత్కాలికంగా ఆపివేయడమే కాకుండా.. స్క్రీన్​పై వాతావరణ సమాచారాన్ని కూడా చూడవచ్చు. ఈ యాప్​ను తక్కువ వాల్యూమ్​తో మోగుతూ, క్రమంగా పెరుగుతూ సున్నితంగా మేల్కొలిపే విధంగా రూపొందించారు.

Useful Android AppsUseful Android Apps
ఆమ్​డ్రాయిడ్​(క్లాక్​)

ఇవీ చదవండి: ఇంటర్నెట్ ఆఫ్​ థింగ్స్​.. అంతర్జాలం కానుంది ఇక వస్తుజాలం!

వాట్సాప్​లో కొత్త ఫీచర్స్.. చాట్​ లిస్ట్​లోనే స్టేటస్​.. గ్రూప్ కాలింగ్​లో మ్యూట్​​ ఆప్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.