బయటకు వెళితే ఎక్కువగా తినే ఫుడ్‌లో బేకరీ, ఫాస్ట్‌ఫుడ్ ఉంటుంది. ఇందులో వెజ్ పఫ్(vegetable curry puff recipe), ఎగ్ పఫ్‌లకు మంచి డిమాండ్ ఉంది. అయితే బయట తినడం మంచిది కాదని కొందరు తమకిష్టమైన వంటకాల్ని మానేస్తూ ఉంటారు. అలాంటపుడు అదే ఫుడ్‌ను ఇంట్లో తయారు చేసుకుంటే సరి. అలాంటి వారి కోసమే ఈ వెజ్ పఫ్(vegetable curry puffs taste) తయారీ విధానం.
కావాల్సిన పదార్థాలు
మైదాపిండి, ఉప్పు, నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉడికించి తురుముకున్న బంగాళదుంప, పచ్చి బఠాని, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, చక్కెర, మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం
తయారీ విధానం
ముందుగా మైదాపిండిలో ఉప్పు, నీళ్లు పోసి పిండి తడుపుకొని పక్కనపెట్టుకోవాలి. తర్వాత పిండి మిశ్రమాన్ని స్టార్ షేప్‌లో ఒత్తుకుని మధ్యలో వెన్నపెట్టి క్లోజ్ చేసుకుని రోలింగ్ పెన్‌తో లైట్‌గా ఒత్తుకుని 10 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అలానే 3-4 సార్లు ఒత్తుకుని ఫ్రిజ్‌లో పెట్టుకొని షీట్ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉడికించి తురుముకున్న బంగాళదుంప, పచ్చి బఠాని, కొత్తిమీర, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, చక్కెర, మిరియాల పొడి, గరం మసాలా వేసి వేయించి నిమ్మరసం చల్లుకుని కర్రీ తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్న డో షీట్లో పెట్టుకుని ఫోల్ట్ చేసుకుని బేకింగ్ ట్రే తీసుకుని దానిపై వాటర్ స్ప్రే చేసుకుని పఫ్స్ పెట్టుకుని మళ్లీ బాగా వాటర్ స్ప్రే చేసుకోవాలి. తర్వాత 20 నిమిషాల పాటు 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో బేక్ చేసుకుంటే వెజ్ కర్రీ పఫ్ రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">