ETV Bharat / priya

Mixed Vegetable Biryani: పసందైన మిక్స్​డ్​ వెజ్​ బిర్యానీ

author img

By

Published : Sep 25, 2021, 4:00 PM IST

బిర్యానీ అందరికీ ఫేవరేట్​. అయితే.. ఎప్పుడూ చికెన్​, మటన్​లతోనేనా? ఈ సారి వెజ్​తో ట్రై చేద్దాం.. మంచి ప్రొటీన్స్​ అందిస్తూనే నోరూరించే నేతితో చేసిన వెజ్​ బిర్యానీని (Mixed Vegetable Biryani) ఇంట్లోనే తయారు చేసి ఆస్వాదిద్దాం. ఇది రుచికరమే కాదు, తయారుచేయడం ఎంతో సులభం కూడా.

vegetable biryani with ghee
నేతి వెజ్​ బిర్యానీ

చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినేది బిర్యానీ. అయితే బిర్యానీ అనగానే నాన్​వెజ్​ బాగుంటుందని అనుకుంటారు. కానీ అది భ్రమ. వెజ్​లో కూడా మంచి టేస్టీగా చేసుకోవచ్చు. అలా చేసుకుని బిర్యానీని (Mixed Vegetable Biryani) తింటే ఎవరైనా 'వహ్వా' అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంటకం చూసేయండి. వెంటనే చేసేసుకోండి.

కావాల్సిన పదార్థాలు

  • యాలకలు
  • దాల్చిన చెక్క
  • షాజీర
  • మరాఠీ మొగ్గ
  • లవంగాలు
  • నెయ్యి
  • బిర్యానీ ఆకు
  • ఉల్లిపాయలు
  • ఉప్పు సరిపడా
  • కొత్తిమేర
  • పుదీనా
  • జీడిపప్పు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​
  • కాలీఫ్లవర్​
  • క్యారెట్​
  • బీన్స్​
  • పచ్చిమిర్చి
  • పచ్చి బాఠాణీ
  • బిర్యానీ రైస్​
  • గరంమసాలా
  • పెరుగు
  • ధనియాల పొడి
  • కారం సరిపడినంత

మిక్స్​డ్​ వెజిటేబుల్​ బిర్యానీ తయారీ విధానం..

ముందుగా ఒక పాన్​లో నెయ్యి వేడి చేసుకొని అందులో బిర్యానీ ఆకు, మరాఠిమొగ్గ, ఉల్లిపాయలు, సరిపడా ఉప్పువేసి సన్నగా తరిగిన కొత్తిమేర, పుదీనా వేసి బాగా కలుపుకొని వేగనివ్వాలి. ఆ తరువాత అందులో జీడిపప్పు , అల్లం వెల్లుల్లి పేస్ట్, కాలీఫ్లవర్​ ముక్కలు, క్యారెట్​ ముక్కలు, బీన్స్​ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠాణీ వేసి బాగా కలుపుకొని మూతపెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తరువాత అందులో పెరుగు, గరంమసాలా, ధనియాల పొడి, కారం, సరిపడా నీళ్లు పోసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలి. అంతకు ముందే మరుగుతున్న నీళ్లలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, షాజీర, సరిపడా ఉప్పు, బాస్మతీ బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్​ మిశ్రమంలో బాస్మతీ అన్నం పరుచుకొని పై నుంచి కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టాలి. 15 నుంచి 20 నిమిషాల వరకు మంచిగా మగ్గనిస్తే మిక్స్​డ్​ వెజిటేబుల్​ బిర్యానీ రెడీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Parotta making: చిల్లీ పరోటా.. చాలా సింపుల్​గా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.