ETV Bharat / priya

'మీల్ మేకర్​ మంచూరియా' ఇలా చేస్తే టేస్ట్ అదరహో! - రుచికరమైన మీల్ మేకర్ మంచూరియా

అధిక ప్రోటీన్స్ ఉండే మీల్ మేకర్​ను (meal maker manchuria) తరచూ వండుకుంటాం. నాన్​ వెజ్​ను తలపించేలా టేస్టీగా చేసుకుని ఆరగిస్తాం. ఈ నేపథ్యంలో నోరూరించే రుచితో ఉండే మీల్​ మేకర్ మంచూరియాను (meal maker manchuria recipe) ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం!.

meal maker manchuria
మీల్ మేకర్ మంచూరియా
author img

By

Published : Oct 7, 2021, 4:24 PM IST

వెజ్​ ప్రియులు మీల్​ మేకర్​ను అధికంగా ఇష్టపడతారు. మంచి విందు చేసుకోవాలంటే ప్రత్యేకంగా మీల్ మేకర్​ను (meal maker manchuria) వండుకుని ఆరగిస్తారు. అయితే.. మరింత టేస్టీగా ఉండే మీల్ మేకర్​ మంచూరియాను (meal maker manchuria recipe) తయారు చేసుకోవాలంటే ఎలాగో తెలుసుకుందాం!

meal maker manchuria
మీల్ మేకర్ మంచూరియా

కావాల్సిన పదార్థాలు:

మైదా పిండి, కార్న్​ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు, మీల్​మేకర్, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, రెడ్​ క్యాప్సికం, సోయా సాస్​, గ్రీన్​ చిల్లీ సాస్​, వెనిగర్​, లేత ఉల్లిపాయ, కొత్తిమీర.

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, కార్న్​ఫ్లోర్, మిరియాల పొడి, ఉప్పు వేసి నీళ్లు పోసి పిండి తడుపుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న మీల్​మేకర్​ వేసి బాగా కలుపుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి డీప్​ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్​లో నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా కట్​ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కట్​ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, రెడ్​ క్యాప్సికం ముక్కలు వేయాలి.

కొంచెం వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మీల్ మేకర్​ను ఆ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. సోయా సాస్​, గ్రీన్​ చిల్లీ సాస్​, వెనిగర్​, లేత ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్​ ఆనియన్స్​, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత దానిని ప్లేట్​లోకి తీసుకుని పై నుంచి కొత్తిమీర,​ ఆనియన్స్​తో మళ్లీ గార్నిష్​ చేసుకుంటే మీల్​ మేకర్ మంచూరియా రెడీ అవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:'మీల్​మేకర్'​తో పసందైన బిర్యానీ చేద్దామిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.