సాధారణంగా వారానికోసారి మార్కెట్ నుంచి కూరగాయాలను తెచ్చుకుంటాం. వాటితోనే ఆ వారమంతా గడిపేస్తాం. ఉల్లిగడ్డలు ఎక్కువ కాలం పాడైపోకుండా ఉంటాయి కాబట్టి ఒకేసారి ఓ నెల రోజులవరకు సరిపోను తెచ్చి పెట్టుకుంటాం. ఇంట్లో కూరగాయలు అయిపోయాయంటే ఏం కూర చేయాలో అర్థం కాక మహిళలు గాబరాపడిపోతుంటారు. అలాంటప్పుడు కేవలం ఉల్లిగడ్డలతోనే రుచికరమైన ఆనియన్ మసాలా కర్రీ చేయొచ్చు. మరి దాని తయారీ విధానం తెలుసుకుందామా!.
కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, గసగసాల పేస్ట్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, నూనె, పంచదార.
తయారీ విధానం: పొయ్యిమీద ఓ గిన్నెలో కాస్తంత నూనె వేసి అది వేడికాగానే పచ్చిమిర్చి, అల్లం వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగనీయాలి. ఆ మిశ్రమానికి గసగసాల పేస్ట్ కలపాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి, వేరుశెనగ పేస్ట్ కలుపుకోవచ్చు. ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం కలుపుకోవాలి. అనంతరం గ్రేవీ కోసం తగు మోతాదులో నీళ్లు కలపాలి. ధనియాలు, గరం మసాలా కలపాలి. కొత్తిమీర కలిపి పొయ్యి మీది నుంచి దించుకుంటే.. ఆనియన్ మసాలా కర్రీ రెడీ అవుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:KP ONION: 'ఈ ఉల్లి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది'