బాస్మతి బియ్యం, కొబ్బరిపాలు, బటన్ మష్రూమ్, మసాలాలు కలిపి సులభంగా, చాలా రుచికరంగా చేసుకునే తేలికైన వంటకం 'పుట్టగొడుగుల పులావ్'(mushroom recipes). దీని తయారీలో సాధ్యమైనంత వరకు తాజా పుట్టగొడుగులు ఉపయోగించాలి. అవి దొరకనప్పుడు ఎండు పుట్టగొడుగులు వాడుకోవచ్చు. వీటితోపాటు రకరకాలైన కూరగాయ ముక్కలూ వేసుకోవచ్చు. బఠాణీ, ఆలూ, క్యారెట్, కాప్సికం, మొక్కజొన్న, బ్రొకొలీ, బేబీ కార్న్ లాంటి కూరగాయలు వాడుకోవచ్చు.
కావల్సిన పదార్థాలు
కప్పున్నర బాస్మతి బియ్యం, పావుకిలో బటన్ పుట్టగొడుగులు(mushroom benefits), ఒక్కోటి చొప్పున ఉల్లిపాయ, టమాటో, బంగాళదుంప, రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, కప్పున్నర చిక్కటి కొబ్బరిపాలు, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మూడు నాలుగు యాలకులు, ఏడెనిమిది మిరియాలు, చెంచా జీలకర్ర
పులావ్(pulao recipe) తయారీలో పాత బాస్మతి బియ్యం(basmati rice calories) వాడుకోవాలి. వీటితో పులావ్ చేస్తే పొడి పొడిగా వస్తుంది. సువాసనలు వెలువడతాయి. పాత బియ్యానికి ఒక వంతు బియ్యానికి రెండొంతుల నీళ్లు పోయాలి. ఎలక్ట్రిక్ కుక్కర్‌లో తేలికగా చేసుకోవచ్చు. నూనె బదులుగా నెయ్యి వాడితే రుచి పెరుగుతుంది.
తయారీ విధానం
వేడి నూనె/నెయ్యిలో గరంమసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. దీనివల్ల మసాలా ఫ్లేవర్ నూనెకి పట్టి పులావ్ సువాసనలు వెదజల్లుతుంది. ఉల్లిపాయలు పొడవుగా కోసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అల్లంవెల్లుల్లి మిశ్రమాన్ని నూనెలో వేయించుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తుంది. కూరగాయల ముక్కలు, పుట్టగొడుగులు వేసి చిన్నమంటపై ఫ్రై చేయాలి.
ఆ తర్వాత రైస్ వేసి రెండు నిమిషాలు వేయిస్తే ఆయిల్, రైస్‌కు పట్టి ఉడికిన తర్వాత ముద్ద కాకుండా ఉంటుంది. కొబ్బరిపాలు(coconut milk), నీళ్లను బియ్యంలో పోయాలి. కొబ్బరి పాలకు బదులుగా వెజిటేబుల్ స్టాక్ కూడా కలపొచ్చు. ఈ ప్యాకెట్‌లు సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. స్టాక్ వాడేటప్పుడు ఉప్పు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో కూడా సాల్ట్ ఉంటుంది. చివరగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి.
* బాస్మతి బియ్యం బదులు పాత సోనామసూరి రైస్ కూడా వాడుకోవచ్చు.
ఇవీ చదవండి:
- బిర్యానీకి పులావ్‌కు తేడా ఏంటో తెలుసా?
- రొయ్యల పులావ్... రుచి వావ్!
- రూపాయికే బిర్యానీ.. రెస్టారెంట్ స్పెషల్ ఆఫర్!
- నాన్‌వెజ్ స్పెషల్.. మిక్స్డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?
- సండే స్పెషల్ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.
- దమ్ బిర్యానీ సరిగా కుదరడం లేదా?.. ఇలా చేయండి!
- మటన్ స్పెషల్: ఎంఎల్ఏ పొట్లం బిర్యానీ