ETV Bharat / priya

సమ్మర్​ స్పెషల్​: సోంపు షర్బత్​ సింపుల్​ రెసిపీ - సోంపు షర్బత్​ తయారు చేసుకొండిలా

ఓ వైపు లాక్​డౌన్​ వల్ల ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. మరోవైపు బానుడి భగభగలు. ఇలాంటి సమయంలో చల్ల చల్లగా ఏదైనా తాగితే బాగుండు అనిపిస్తోందా? అయితే అద్భుతమైన రుచితో పాటు మీ ఒంట్లో వేడిని తరిమికొట్టే 'సోంపు షర్బత్' ఇంట్లోనే తయారు చేసుకోండిలా...

Saunf ka Sharbat
సమ్మర్​ స్పెషల్​: సోంపుతో వేడిని తరిమికొట్టండిలా!
author img

By

Published : Jun 5, 2020, 4:20 PM IST

రెస్టారెంటులోనో, ఏదైనా పార్టీలోనో తృప్తికరమైన భోజనం తిన్న వెంటనే గుర్తొచ్చేది సోంపు. సోంపు గింజలతో తాజా శ్వాస అనుభూతి పొందుతారు. రిఫ్రెష్​ అవుతారు.​ ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను ఈ గింజలు తగ్గిస్తాయి. ఇటువంటి ఎన్నో ఔషధ విలువలున్న సోంపును భారతీయులు విరివిగా ఉపయోగిస్తుంటారు.

ఈ వేసవి కాలంలో భానుడి సెగల నుంచి ఉపసమనం పొందాలంటే.. వీటితో 'సోంపు షర్బత్'​ తయారు చేసుకొని తాగండి చాలు.

సమ్మర్​ స్పెషల్​: సోంపుతో వేడిని తరిమికొట్టండిలా!

కావాల్సిన పదార్థాలు

రాత్రంతా నానబెట్టిన సోంపు(1/3 కప్పు) , చక్కెర 2 టేబుల్​ స్పూన్​, ఉప్పు 1 టీ స్పూన్​, మిరియాలు 1 టీ స్పూన్​, ఐసు ముక్కలు తగినన్ని, జీలకర్ర పొడి 1 టీస్పూన్​, నిమ్మకాయ, పుదీనా ఆకులు.

తయారు చేసే విధానం

ముందుగా నానబెట్టిన సోంపును తీసుకొని ఓ రుబ్బురోలులో వేయాలి. వాటితో పాటు చెక్కెర, ఉప్పు, మిరియాలు వేసి మెత్తగా చేసుకోవాలి. ఓ వాటర్​ జెగ్గులో ఐసు ముక్కలను తీసుకొని వాటిలో మెత్తగా చేసుకున్న సోంపు పొడిని వెయ్యాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు కలుపుకొని జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం, పుదీనా ఆకులు వేయాలి. మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే చల్లచల్లగా 'సోంపు షర్బత్'​ రెడీ.

వీడియోలో చూపినట్లుగా.. సోంపు షర్బత్​ను తయారు చేసుకుని మీ అభిప్రాయాన్ని ఈటీవీ భారత్​తో పంచుకోండి.

ఇదీ చూడండి:చలవనిచ్చే 'చాస్'.. తయారు చేయండి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.