ETV Bharat / priya

హెల్దీ 'కొర్రల సలాడ్‌' సింపుల్​ రెసిపీ! - kangni recipes

కొర్రలు కడుపు నింపడమే కాదు.. బరువును అదుపులో ఉంచుతాయని వైద్యులు చెబుతూంటారు. అందుకే, ఆరోగ్యం వైపు పరుగులు పెడుతున్నాావారు కొర్రలను నిత్యావసర వస్తువుగా ఇంట్లోకి తెచ్చేసుకుంటున్నారు. కానీ, కొర్రలను ఎప్పుడూ ఒకే రకంగా ఉడికించి తింటే బోరే కదా..! అందుకే, వారానికోసారి ఇలా కొర్రల సలాడ్​ చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.

korrala-salad-or-kangni-salad-recipe-in-telugu
హెల్దీ 'కొర్రల సలాడ్‌' సింపుల్​ రెసిపీ!
author img

By

Published : Jul 12, 2020, 1:01 PM IST

ఆరోగ్యాన్నిచ్చే కొర్రలను రుచికరంగా మార్చుకోవాలంటే.. కొర్రల సలాడ్​ను​ ఓ సారి ట్రై చేయాల్సిందే...

korrala-salad-or-kangni-salad-recipe-in-telugu
హెల్దీ 'కొర్రల సలాడ్‌' సింపుల్​ రెసిపీ!

కావాల్సినవి

  • కొర్రలు - కప్పు (అరగంట నానబెట్టి తర్వాత అన్నంలా వండుకోవాలి),
  • సన్నగా పొడుగ్గా తరిగిన క్యారెట్‌, కీరదోస, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున,
  • ఉల్లికాడల తరుగు - కప్పు,
  • కొత్తిమీర తరుగు - అలంకరణ కోసం.

డ్రెసింగ్‌ కోసం

  • నిమ్మరసం - టేబుల్‌స్పూను,
  • ఆలివ్‌నూనె - మూడు టేబుల్‌ స్పూన్లు,
  • ఉప్పు, మిరియాలపొడి - రుచికి సరిపడా.

తయారీ విధానం

ముందుగా డ్రెసింగ్‌ కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి. ఉడికించి పెట్టుకున్న కొర్రలపై డ్రెసింగ్‌, కొత్తిమీర తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. చివరగా టేబుల్‌స్పూను డ్రెసింగ్‌, కొత్తిమీర తరుగు వేస్తే చాలు. కావాలనుకుంటే ఇందులో ఉడికించిన క్యాలీఫ్లవర్‌ తరుగు, పచ్చి బటానీల్లాంటివి వేసుకోవచ్చు.

ఇదీ చదవండి: చిరుజల్లుల వేళ 'జపనీస్‌ ఆనియన్‌ సూప్‌' చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.