ఉల్లి దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ్వ దోశ.. ఇలా చాలా రకాల దోశలు మీరు తినే ఉంటారు. కానీ రొయ్య దోశ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒకవేళ తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి. వెంటనే చేసేసుకోండి.
కావాల్సిన పదార్ధాలు:
రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు తగినంత, నూనె, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, ఉడికించిన గుడ్డు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తయారీ విధానం:
ముందుగా ఓ బేసిన్లో రొయ్యలు, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. తరువాత మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని వేయించి పొడి చేయాలి. ఇప్పుడు పొయ్యిమీద ఓ పాత్రను ఉంచి నూనె, ఉల్లిపాయల ముక్కలు వేసి వేయించాలి. అందులో పచ్చిమిర్చి, ధనియాలపొడి, గరం మసాలా, ముందుగా కలిపిపెట్టుకున్న వేసి రొయ్యలు వేసి వేపుడు చేసుకోవాలి.
అనంతరం ఓ స్టవ్ వెలిగింది, దానిపై పెనం పెట్టి చిన్నసైజు దోశలు వేయాలి. వాటిపైన వేయించిన రొయ్యలు, నూనె, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి. చివరగా దానిపై ఉడికించిన గుడ్డు తురుము, కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన రొయ్య దోశలు రెడీ.
ఇవీ చదవండి: