పండగ ఏదైనా తెలుగువారు ఎక్కువగా చేసుకునే పిండి వంటకం కజ్జికాయలు. మరి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి..
కావాల్సిన పదార్థాలు:
- మైదాపిండి
- బొంబాయి రవ్వ
- నెయ్యి
- ఉప్పు
- నీళ్లు
- ఎండు కొబ్బరి తురుము
- గసగసాలు
- యాలకుల పొడి
- జీడిపప్పు
- బెల్లం
- పుట్నాల పొడి
తయారీ విధానం:
- ఒక బౌల్లో మూడొంతుల మైదాపిండి, ఒక వంతు బొంబాయి రవ్వ, ఒక వంతు నెయ్యి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి చపాతి పిండిలా కలుపుకోవాలి.
- మరో పాత్రలో ఎండుకొబ్బరి పొడి, గసగసాల పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, బెల్లం, పుట్నాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని చపాతీలా ఒత్తుకొని కజ్జికాయల అచ్చులో వేయాలి. కొబ్బరి మిశ్రమాన్ని దాంట్లో పెట్టి కజ్జికాయాల్లాగా ఒత్తుకోవాలి.
- అలా తయారైన కజ్జికాయలను నూనెలో వేసుకుని.. తక్కువ మంటమీద వేయించి గోధుమ రంగులోకి మారగానే తీయాలి. అంతే నోరూరించే కజ్జికాయలు రెడీ అయినట్లే..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: