ETV Bharat / priya

15 నిమిషాల్లోనే 'రైస్​ ఇడ్లీ' సులువుగా చేసుకోండిలా! - Simple made food

ఉరుకులు పరుగుల జీవితంలో క్షణం తీరిక లేకుండా గడుపుతాం. కొన్ని సార్లు వంట చేసుకోవడానికి సమయమే దొరకదు. అటువంటి పరిస్థితుల్లో తక్కువ పదార్థాలతో, తక్కువ టైంలో రైస్​ ఇడ్లీని సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం.

Home made recipe special 'rice idly'
15 నిమిషాల్లో 'రైస్​ ఇడ్లీ' అల్పాహారం
author img

By

Published : Aug 6, 2020, 1:01 PM IST

వంట ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. అయితే ఎక్కువ శ్రమ పడకుండా అతి తక్కువ సమయంలో రుచికరమైన వేడివేడి రైస్​ ఇడ్లీని సులభంగా కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

కావాల్సినవి

బియ్యపు రవ్వ-ఒకటిన్నర కప్పులు, పలుచని అటుకులు-కప్పు, పుల్లని పెరుగు లేదా మజ్జిగ- కప్పు, బేకింగ్‌ సోడా-చిటికెడు, మంచినీళ్లు-తగినన్ని, ఉప్పు-రుచికి సరిపడా.

తయారుచేసే విధానం

అటుకుల్ని పెరుగులో వేసి నాలుగు నిమిషాలు నానబెట్టి గరిటెతో మెత్తగా చేయాలి. అందులోనే బియ్యపురవ్వ వేసి కొద్దిగా సోడా, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి. అటుకులు, బియ్యపు రవ్వ నీటిశాతాన్ని పీల్చేసుకోవడంతో గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి కలిపి నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో వేసి ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి సుమారు 15 నిమిషాలు ఉడికించి దించాలి. దించేముందు ఇడ్లీలు ఉడికాయో లేదో ఓసారి వేలితో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. మృదువుగా స్పాంజిలా ఉండే ఈ ఇన్‌స్టంట్‌ ఇడ్లీలు రుచిగా కూడా ఉంటాయి.

ఇదీ చూడండి: 'దిల్ బహార్' మనసారా చేసుకొని.. కడుపారా ఆస్వాదించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.