చేపలు తింటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. చేపలతో ఎక్కువగా పులుసు, లేదా ఫ్రై చేసుకుంటుంటారు. కాస్త వెరైటీగా, రుచిగా, మరిన్ని పోషకాలతో కావాలనుకుంటే మాత్రం వెల్లుల్లి చేప ఇగురు ట్రై చేయాల్సిందే. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి.
కావాల్సినవి:
చేపలు, ఉప్పు, పసుపు, కారం, మిరియాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్
తయారీ విధానం:
చేప ముక్కల్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో మిరియాలు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, చింతపండు వేసి దోరగా వేయించి, చివరగా వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకోవాలి.
తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో చేప ముక్కలు వేసి బాగా వేయించి, తీసేసి పక్కనపెట్టుకోవాలి. మళ్లీ అదే నూనెలో వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వేయించిన చేప ముక్కలు వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివరగా ముందు తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కొద్దిసేపు మగ్గించుకుంటే వెల్లుల్లి చేపల ఇగురు రెడీ.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సండే స్పెషల్ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.