ETV Bharat / priya

పండ్లు, కూరలు.. వేసవిలోనూ తాజాగా ఇలా!

author img

By

Published : Apr 23, 2021, 4:31 PM IST

ఆర్గానిక్ స్టోర్లలో తప్ప మామూలు దుకాణాల్లో తాజా ఆకుకూరలు, పండ్లు దొరకడం ఈ రోజుల్లో గగనమైపోయింది. పోనీ దొరికినప్పుడే ఎక్కువగా తెచ్చుకుని అవసరానికి వాడుకుందామా అంటే.. ఫ్రిజ్‌లో పెట్టినా వాటి తాజాదనం నిలవడం కష్టం. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదంటారా..? ఉంది..! తాజా ఆకుకూరలు, పండ్లు దొరికినప్పుడు తెచ్చుకుని, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా వాడుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే చదవండి మరి..!

వేసవిలోనూ తాజాగా పండ్లు, కూరగాయలు
వేసవిలోనూ తాజాగా పండ్లు, కూరగాయలు

కరివేపాకు, కొత్తిమీర ఎండిపోతున్నాయా?
ఎండాకాలంలో కొత్తిమీర, కరివేపాకు ఫ్రిజ్‌లో పెట్టినా మరుసటిరోజే వాడిపోతుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఐస్ ట్రేలో సగం వరకు కరిగించిన బటర్/నెయ్యిని పోసి అందులో తరిగిన కొత్తిమీర/కరివేపాకు వేసి ఫ్రీజర్‌లో ఉంచాలి. రెండు రోజుల తర్వాత, ఆ క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లలోకి మార్చి రిఫ్రిజిరేటర్లో భద్రపరచాలి. కూరలు ఉడికేటప్పుడు ఈ క్యూబ్స్‌ని అందులో వేస్తే సరి!

cetrayfresh650-3.jpg
కరివేపాకు, కొత్తిమీర ఎండిపోతున్నాయా?

* రసం, సాంబారు, మజ్జిగలోకి కొత్తిమీర కరివేపాకు వాడుకోవాలంటే బటర్/నేతికి బదులుగా నీటిని పోయాలి.

icetrayfresh650-7.jpg
ఆకుకూరలు వాడిపోకుండా..

ఆకుకూరలు వాడిపోకుండా..
ఆకుకూరలు కడిగి, ఆరబెట్టి, సన్నగా తరుక్కోవాలి.తర్వాత ఐస్ ట్రేలలో ముప్పావువంతు నింపి, ఆకులు మునిగేవరకు నీరుపోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. వాసన పట్టకుండా ఉండాలంటే ఈ ఐస్‌ట్రేలకు ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఫిల్మ్ చుడితే సరిపోతుంది.

icetrayfresh650-4.jpg
నచ్చిన సూప్.. నిమిషాల్లో..

నచ్చిన సూప్.. నిమిషాల్లో..
వెజిటబుల్ సూపులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టిఫిన్‌కి, భోజనానికి మధ్యలో కలిగే ఆకలికి, సాయంకాలం స్నాక్ టైంకి నూనెతో చేసిన చిరుతిళ్ల కన్నా వెజిటబుల్ సూపులు ఎంతో మంచివి. కానీ సూప్ తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందనే కారణంతో చాలామంది ఆరోగ్యం విషయంలో రాజీ పడుతుంటారు. ఇకపై అలాంటి అవసరం లేదు. కావల్సినప్పుడల్లా మీ ఫేవరెట్ సూప్‌ని చిటికెలో తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం..
పాలకూర, గుమ్మడికాయ, క్యారట్ వంటి వాటిని ప్యూరీ చేసుకుని రెండు రోజుల పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. అవి గట్టిపడిన తర్వాత జిప్‌లాక్ కవర్లో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరిగే నీటిలో ఈ క్యూబ్స్ వేసుకుని సూప్ తయారు చేసుకోవచ్చు.

icetrayfresh650-5.jpg
పండ్లను తాజాగా ఉంచండిలా...

పండ్లను తాజాగా ఉంచండిలా...
అరుదుగా దొరికే పండ్లను ఆశపడి బోలెడు కొనేస్తాం. కానీ ఒకేసారి అన్నీ తినలేం కదా.. అలాగని తిన్నన్ని తిని మిగతావి పడేయాలంటే మనసొప్పదు. అలాంటప్పుడే ఫ్రీజర్‌ను ఆశ్రయించాలి.
పండ్లను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఐస్‌ట్రేలో ముప్పావువంతు కవర్ చేయాలి. మిగిలిన పావు భాగం నీటితో నింపాలి. రెండు రోజుల తర్వాత జిప్‌లాక్ కవర్లలోకి మార్చి ఫ్రీజర్‌లో భద్రపరచాలి. తినాలనుకున్నప్పుడు ఓ గంట ముందు ఫ్రీజర్‌లోంచి తీస్తే తాజా పండ్లు రడీ..! స్మూతీ చేసుకోవాలంటే ఫ్రీజర్‌లోంచి తీసిన వెంటనే వాడుకోవచ్చు.

icetrayfresh650-2.jpg
5 నిమిషాల్లో జ్యూస్ రడీ!

5 నిమిషాల్లో జ్యూస్ రెఢీ!
ఫ్రూట్ జ్యూస్‌లు చేసుకోవాలంటే ఆ పండ్లను శుభ్రం చేసుకోవడం, తరగడం తప్పదు.. దానికి బద్ధకించి కొందరు మార్కెట్లో దొరికే జ్యూస్‌లను తాగేస్తారు. వాటిలో విపరీతమైన చక్కెర, ప్రిజర్వేటివ్స్ వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇలా జరగకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐదు నిమిషాల్లో పండ్లరసం తయారు చేసుకోవాలంటే.. ఇలా చేయండి.
మీకు నచ్చిన పండుని (యాపిల్, ఆరెంజ్, బత్తాయి తప్ప) శుభ్రం చేసి, తరుక్కుని నీరు కలపకుండా కాస్త చక్కెర, కొద్దిగా నిమ్మరసం వేసి ప్యూరీలా తయారు చేసుకోవాలి. దీన్ని ఫ్రీజర్‌లో రెండు రోజుల పాటు ఉంచాలి. తర్వాత క్యూబ్స్‌ని జిప్‌లాక్ కవర్లోకి మార్చాలి. వీటిని ఫ్రీజర్‌లో ఉంచితే రెండు నెలలు పాడవకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటితో జ్యూస్ చేసుకోవచ్చు.

icetrayfresh650-1.jpg
మూడు నెలలకు సరిపడ నిమ్మరసం...

మూడు నెలలకు సరిపడా నిమ్మరసం...
ఎండాకాలం నిమ్మరసం తాగాలని ఎవరికుండదు చెప్పండి..! కానీ హడావుడిలోనో, అలసటతోనో, నిమ్మరసం కలుపుకోలేక మంచినీళ్లతో సరిపెట్టుకుంటాం. ఓ అరగంట కేటాయిస్తే ఎండాకాలమంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమ్మరసం తాగేయొచ్చు. అదెలాగో తెలుసుకుందామా..
నిమ్మకాయలు రసం తీసి, అందులో కాస్త ఉప్పు, చక్కెర కలపాలి. అలాగే కొన్ని నిమ్మకాయలను రసం తీయకుండా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఐస్‌ట్రేలో నిమ్మరసాన్ని నింపి క్యూబ్‌కి ఒకటి చొప్పున తరిగిన నిమ్మకాయ ముక్కలనీ, నచ్చితే ఓ పుదీనా ఆకునీ వేసి రెండు రోజులపాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. క్యూబ్స్ తయారవగానే జిప్‌లాక్ కవర్‌లోకి చేర్చి ఫ్రీజర్‌లో భద్రపరిస్తే మూడు నెలలపాటు వాడుకోవచ్చు.

ఇదీ చూడండి: సూపర్​విమెన్ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.