పూరీ.. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఓ వంటకం. అయితే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి కాస్త భిన్నంగా బీట్రూట్తో పూరీ చేసేయండి. బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామూలుగా ఇది తినడానికి ఇష్టపడనివారికి ఇలా పూరీతో జోడించి ఇస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు. మరి దీని తయారీ తెలుసుకుందామా..
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - కప్పు
బొంబాయి రవ్వ - రెండు చెంచాలు
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - సరిపడా
బీట్రూట్ రసం - పావుకప్పు
తయారీ విధానం
- గిన్నెలో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, ఉప్పు తీసుకోవాలి.
- బీట్రూట్ రసం, నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి.
- పావు గంట తరువాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి.
- అది వేడయ్యాక పిండిని పూరీల్లా ఒత్తుకొని రెండేసి చొప్పున నూనెలో వేయించుకొని తీసుకుంటే చాలు.
ఇదీ చదవండి: రాజ్యాంగ నిర్మాతకు నేతల ఘన నివాళులు