ETV Bharat / opinion

మీటూ: ప్రియా రమానిపై వ్యాజ్యం కొట్టివేత

author img

By

Published : Feb 18, 2021, 8:44 AM IST

మహిళా పాత్రికేయురాలు ప్రియా రమానిపై కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్​ వేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని దిల్లీ కోర్టు కొట్టేసింది. ఒకరి పరువు హక్కు కోసం.. ఒక మహిళ జీవించే హక్కును, గౌరవాన్ని పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించింది. తీర్పులో మహాభారత, రామాయణాలను కూడా ప్రస్తావించింది.

mj akbhar case
'మహిళ గౌరవాన్ని పణంగా పెట్టలేం'

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని.. 2018లో కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసిన ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మహిళా పాత్రికేయురాలు ప్రియా రమానిపై ఆయన వేసిన పరువు నష్టం వ్యాజ్యాన్ని దిల్లీ కోర్టు బుధవారం కొట్టివేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒకరి పరువు హక్కు కోసం.. ఒక మహిళ జీవించే హక్కును, గౌరవాన్ని పణంగా పెట్టలేమని వ్యాఖ్యానించింది. 91 పేజీల తీర్పులో న్యాయస్థానం మహాభారత, రామాయణాలను కూడా ప్రస్తావించింది.

అసలు కేసేంటి?

1993లో ఓ హోటల్‌ గదిలో అక్బర్‌ తనను లైంగికంగా వేధించారని, 'మీటూ' ఉద్యమంగా జోరుగా సాగుతున్న 2018లో ప్రియా రమాని ఆరోపించారు. అప్పటికి కేంద్ర మంత్రిమండలిలో అక్బర్‌ మంత్రిగా ఉన్నారు. రమాని వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయని దావా వేశారు. ఆ తర్వాత చాలా మంది మహిళలు రమాని తరహాలోనే లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో అక్బర్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

విచారణ సందర్భంగా రమాని వ్యాఖ్యల కారణంగా తాను పాత్రికేయుడిగా, సంపాదకుడిగా జీవితాంతం సంపాదించుకున్న పరువు ప్రతిష్ఠలు మంట కలిశాయని అక్బర్‌ వాదించారు. ఈ వాదనతో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్‌ పాండే ఏకీభవించలేదు. రమానిపై అభియోగాలకు ఎలాంటి రుజువులు లేవని కొట్టివేస్తూ, మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను, బాధితులపై వాటి పరిణామాలను సమాజం అర్థం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. తీర్పుపై రమాని సంతోషం వ్యక్తం చేశారు. తాను చెప్పిన నిజాన్ని కోర్టు కూడా ధృవీకరించడం సంతోషంగా ఉందన్నారు.

కోర్టు కీలక వ్యాఖ్యలు

  • మహిళలకు గౌరవం ఇమ్మని చెప్పే రామాయణం, మహాభారతం లాంటి పవిత్ర గ్రంధాలు రాసుకున్న దేశంలో ఇంకా వారిపై అఘాయిత్యాలు సాగుతుండడం సిగ్గు చేటు.
  • మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులపై దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఫిర్యాదు చేసుకొనే హక్కు ఉంది.
  • సమాజంలో పెద్ద మనుషులుగా గౌరవం పొందే వ్యక్తులు కూడా తమ ప్రైవేటు జీవితాల్లో మహిళల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారు.
  • లైంగిక వేధింపులపై గళం ఎత్తిన మహిళను పరువు నష్టం పేరుతో శిక్షించకూడదు. స్త్రీ గౌరవాన్ని, జీవించే హక్కును పణంగా పెట్టి ఇంకొకరి పరువు హక్కును కాపాడలేం.
  • చాలా వరకు లైంగిక వేధింపులు మూసిన తలుపులు వెనుక జరుగుతాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉండలేం.
  • లైంగిక వేధింపులు..స్త్రీ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. సామాజికంగా ఓ ముద్ర పడుతుందన్న భయంతో చాలా మంది మహిళలు తమకు జరిగిన వేధింపులను చెప్పుకోవడానికి బయటికి రారు.

ఇదీ చూడండి: అసమ్మతి పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.