ETV Bharat / opinion

మారాల్సిన వ్యాక్సిన్‌ వ్యూహం!

కరోనా తీవ్రరూపం దాల్చున్న వేళ.. టీకాకు ప్రాధాన్యం పెరుగుతోంది. కేంద్రం ఇటీవల వ్యాక్సిన్​ ధరలు నిర్ణయించింది. ఈ ధరల వల్ల కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు.. టీకా అందని ద్రాక్షలా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంక్షోభం నుంచి భారత్​ తేరుకోవాలంటే సార్వత్రిక టీకా కార్యక్రమానికి కేంద్రమే పూనుకోవాలని అభిప్రాయపడతున్నారు.

author img

By

Published : Apr 28, 2021, 8:25 AM IST

Vaccination strategy
వ్యాక్సిన్‌ వ్యూహం

టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల్ని మెరుగు పరచడం, మహమ్మారిని నిలువరించే పద్ధతుల్ని పాటించడం.. కొవిడ్‌ గండాన్ని గడచి గట్టెక్కడానికి ఉన్న తరుణోపాయాలని ఆర్‌బీఐ తాజాగా నివేదించింది. జబ్బు ఉద్ధృతిని, మరణాల ముప్పును తప్పించడానికి టీకా ఎంతగానో అక్కరకొస్తుందని అమెరికా, యూకే, చిలీ అనుభవాలు చాటుతున్నాయి. జనవరి 16న మొదలైన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విడతల వారీగా విస్తరిస్తూ మే నెల ఒకటి నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా అందించాలన్న విధాన నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది.

రెండు డోసులు తీసుకున్నవారు ఎంత మంది?

45 ఏళ్లు దాటిన వారందరికీ తన వంతుగా ఉచితంగా టీకాలు అందిస్తామన్న కేంద్ర సర్కారు- 18 ఏళ్లు దాటిన వయోవర్గంలో ఉన్న దాదాపు 60 కోట్ల మంది వ్యాక్సినేషన్‌ బాధ్యత నుంచి వైదొలగింది. టీకాల ఉత్పత్తికి సీరమ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలకు ఆర్థిక దన్ను ప్రకటించి, సగం వ్యాక్సిన్లు తన ఖాతాలోకి వస్తాయని, తక్కినవి ఆయా సంస్థలు నిర్ధారించిన రేట్లకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సమీకరించుకోవాలనడమే వివాదాస్పదమవుతోంది. ఇప్పటికి దాదాపు 14.5 కోట్ల వ్యాక్సిన్లు వినియోగమైన ఇండియాలో రెండు డోసులూ వేసుకొన్న వారు కేవలం రెండు శాతమే.

డిమాండ్​ పెరిగే అవకాశం

కొవిడ్‌ కరాళ నృత్యం చేస్తున్న వేళ మే ఒకటి నుంచి డిమాండు ఇంతింతలై, రాత్రికిరాత్రి సరఫరాలు పెరిగే అవకాశం లేక రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి అధికమై, అంతిమంగా నెలకొనేది గందరగోళమే! కరోనా వ్యాక్సిన్ల కోసం బడ్జెట్లో రూ.35 వేల కోట్లను ప్రత్యేకించిన కేంద్రం- 45 ఏళ్లు పైబడిన వారి టీకాల నిమిత్తం వ్యయం చేయగలిగేది పదివేల కోట్ల రూపాయల లోపు. అవసరమైతే మరెంత ఖర్చుకైనా వెనకాడబోమన్న వాగ్దానాన్ని విస్మరించి దాదాపు రూ.48 వేల కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై మోపడమే బేసబబు! 20కి పైగా రాష్ట్రాలు ఉచిత వ్యాక్సిన్ల భారాన్ని నెత్తికెత్తుకొన్నా- కొవిడ్‌ నుంచి రక్షణ కరవై కోట్ల మంది అభాగ్యుల జీవన హక్కు తెగటారిపోయే ప్రమాదం లేకపోలేదు!

ప్రతి ఒక్కరూ సురక్షితం కానిదే ఏ ఒక్కరూ ధీమాగా ఉండే వీల్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడ చేసిన హెచ్చరిక పూర్తిగా అర్థవంతం. కాబట్టే, అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా వంటి దేశాలు తమ పౌరులందరికీ ఉచితంగానే టీకాలు అందిస్తున్నాయి. అందుకు భిన్నంగా దిగువ మధ్యాదాయ దేశమైన ఇండియాలో కేంద్ర సర్కారు అనుసరిస్తున్న వ్యాక్సిన్‌ వ్యూహం- ధనిక పేద రాష్ట్రాల మధ్యే కాదు, సమాజంలోనూ ధనిక పేద వర్గాల నడుమా అంతరాల్ని, ఫలితంగా ప్రాణాంతక పర్యవసానాల్ని కళ్లకు కట్టే ప్రమాదం ఉంది.

మధ్యతరగతి నడ్డి విరిచేలా..

ఏడు దశాబ్దాలకు పైగా సార్వత్రిక ఉచిత టీకా కార్యక్రమం అమలవుతున్న ఇండియాలో అంతర్రాష్ట్ర అంటువ్యాధుల నియంత్రణ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. కొవిడ్‌ విజృంభణ కారణంగా రాబడులు కుంగి రాష్ట్ర ప్రభుత్వాలు దిగాలు పడుతుంటే, ఉపాధి మార్గాలు మూసుకుపోయి వెంటాడుతున్న కరోనా భయాలతో మధ్యతరగతి ప్రజలూ పలు యాతనల పాలవుతున్న వేళ ఇది. ఇప్పటిదాకా ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకాలకు కేంద్రం నిర్ణయించిన ధర 250 రూపాయలు. వచ్చే నెల నుంచి అక్కడ ఒక్కో డోసుకు అంతకు అయిదు రెట్లకు పైగా చెల్లించడమంటే- నడిమి తరగతి నడ్డి విరిచినట్లే.

బడుగు ప్రజల ఉసురు పోసుకున్నట్లే! గిరాకీకి తగ్గ సరఫరాల కోసం రేపు స్పుత్నిక్‌ వి, మోడెర్నా, ఫైజర్‌ వ్యాక్సిన్ల ధరవరలపై రాష్ట్రాలే బేరం ఆడుకోవాలంటే, వాటి ఆర్థిక స్థితి ఏంగాను? కనీవినీ ఎరగని ఈ ప్రజారోగ్య మహాసంక్షోభం నుంచి ఇండియా తేరుకోవాలంటే- యథాపూర్వం సార్వత్రిక టీకా కార్యక్రమానికి కేంద్రమే పూనుకోవాలి. టీకాల ఉత్పత్తి, దిగుమతి, సరఫరాలు, ధరల్ని హేతుబద్ధంగా నియంత్రిస్తూ రాష్ట్రాల తోడ్పాటుతో- భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవన హక్కుకు భద్రత కల్పించాలి!

ఇదీ చూడండి: 'జాతీయ సంక్షోభంపై మౌనంగా ఉండలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.