ETV Bharat / opinion

రెరా చట్టంతో 'స్థిరాస్తి'కి దృఢమైన పునాది

అపార్ట్‌మెంట్‌ డెవలపర్లు తొలినాళ్ల హామీలను గాలికొదిలేస్తే, ఏమీ చేయలేక గుడ్లనీరు కుక్కుకునే బాధితులెందరికో గొప్ప శుభవార్తగా అయిదున్నరేళ్ల క్రితం రెరా (స్థిరాస్తి రంగ నియంత్రణ అభివృద్ధి) చట్టం అమలులోకి వచ్చింది. 2016నాటి ఈ చట్టస్ఫూర్తికి అనుగుణంగా- దేశమంతటా స్థిరాస్తిరంగాన వర్తించే ఆదర్శ ఒప్పందపత్ర రూపకల్పనకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో సుప్రీం ధర్మాసనం తాజాగా స్పందించింది. ఏకరూప నమూనా ఒప్పంద పత్రం అత్యావశ్యకమంటూ ఆ మేరకు స్పందన కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది.

rera act
రెరా చట్టం
author img

By

Published : Oct 6, 2021, 7:20 AM IST

సొంతింటిని సమకూర్చుకోవడమన్నది, దేశంలో అసంఖ్యాక మధ్యతరగతి వర్గీయులకు సుందరస్వప్నం. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణలో ఉక్కిరిబిక్కిరయ్యే ఎందరికో అది, జీవితలక్ష్యం. ఇంటి జాగా(ప్లాట్‌) కోసమో, బహుళ అంతస్తుల భవనాల్లో మక్కువపడ్డ ఫ్లాట్‌కోసమో రెక్కల కష్టంతో కూడబెట్టిన సొత్తును వెచ్చిస్తారు. బ్యాంకుల నుంచి, ఇతరత్రా సంపాదించిన రుణమొత్తాలను దానికి జతచేస్తారు. అదంతా తీసుకెళ్ళి స్థిరాస్తి వ్యాపారుల చేతిలో పోసే ఎందరికో చేదు అనుభవాలు ఎదురుకావడం చూస్తున్నాం. అపార్ట్‌మెంట్‌ డెవలపర్లు తొలినాళ్ల హామీలను గాలికొదిలేస్తే, ఏమీ చేయలేక గుడ్లనీరు కుక్కుకునే బాధితులెందరికో గొప్ప శుభవార్తగా అయిదున్నరేళ్ల క్రితం రెరా (స్థిరాస్తి రంగ నియంత్రణ అభివృద్ధి) చట్టం అమలులోకి వచ్చింది.

కొనుగోలుదారులకు క్లేశాలు..

అంగీకరించిన గడువులోగా నిర్మాణ కార్యక్రమాలు ముగించి ఫ్లాట్లు దఖలుపరచడంలో బిల్డర్ల అలసత్వం, బాధ్యతారాహిత్యం నేటికీ కొనుగోలుదారులనెందరినో తీవ్రక్లేశాలకు గురిచేస్తూనే ఉన్నాయి. అందుకు విరుగుడుగా, 2016నాటి చట్టస్ఫూర్తికి అనుగుణంగా- దేశమంతటా స్థిరాస్తిరంగాన వర్తించే ఆదర్శ ఒప్పందపత్ర రూపకల్పనకు ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో సుప్రీం ధర్మాసనం తాజాగా స్పందించింది. ఏకరూప నమూనా ఒప్పంద పత్రం అత్యావశ్యకమంటూ ఆ మేరకు స్పందన కోరుతూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. వాస్తవానికి లోగడ కేంద్ర హోంమంత్రిత్వశాఖ బిల్డర్లకు, కొనుగోలుదారులకు మధ్య నమూనా ఒప్పంద పత్రం తెచ్చినా- ఏ రాష్ట్రమూ పూర్తిగా అమలుకు సిద్ధపడలేదు. కేంద్రపాలిత ప్రాంతాలే దాన్ని నోటిఫై చేశాయి. ఇప్పుడు రాష్ట్రాల అభిప్రాయాల్ని సాకల్యంగా తెలుసుకున్నాకనే నమూనా పత్ర తయారీపై కేంద్రం స్పందిస్తే- అది సమాఖ్య స్ఫూర్తికి కట్టుబాటు చాటినట్లవుతుంది.

బోల్తా పడుతూనే..

కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలకు వలసలు పోటెత్తుతూ స్థిరాస్తిరంగం ఎప్పటికప్పుడు కొత్తరెక్కలు తొడుక్కుంటోంది. దేశంలో సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఏటా పది లక్షల మంది గృహాలు కొనుగోలు చేస్తున్నట్లు కొవిడ్‌ విజృంభణకు ముందు కేంద్రప్రభుత్వమే మదింపు వేసింది. ఈ సంవత్సరం స్థిరాస్తి రంగంలోకి ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడుల రాశి పెరిగి 600కోట్ల డాలర్లకు విస్తరించనుందన్నది 'సావిల్స్‌ ఇండియా' సంస్థ అంచనా. కోలుకుని వృద్ధిబాట పట్టిన స్థిరాస్తి రంగాన కళ్లు జిగేల్‌మనిపించే కరపత్రాలు (బ్రోషర్లు), మాటలతో బురిడీ కొట్టించే ఏజెంట్లూ బ్రోకర్ల ఉరవడి ఇప్పటికే ప్రస్ఫుటమవుతోంది. చట్టాలను, నిబంధనలను క్రోడీకరించినట్లు ప్రభుత్వాలెంత ఘనంగా చెబుతున్నా- అమాయక కొనుగోలుదారులెందరో బోల్తా పడుతూనే ఉన్నారు. ముందస్తు చెల్లింపులు రాబట్టేవేళ ఫలానా తేదీకల్లా స్వాధీనపరుస్తామన్న బిల్డర్ల హామీలు ఆపై ఆనవాయితీగా కొల్లబోతుంటే- వినియోగదారులు 'మానసికంగా ఆర్థికంగా' చితికిపోతున్నారు.

నిలువునా నీరోడుతోంది..

అపార్ట్‌మెంట్ల అప్పగింత పూర్తయ్యాక అయిదేళ్లలోపు ఎటువంటి నిర్మాణ లోపాలు బయటపడినా, డెవలపర్‌దే బాధ్యత అని 'రెరా' చట్టం చెబుతోంది. ఫలానా ప్రాజెక్ట్‌ కోసమంటూ వసూలు చేసిన మొత్తాల్లో 70శాతాన్ని చెక్కుల రూపేణా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలన్న నిబంధన, నల్లధన ప్రవాహాల్ని అరికడుతుందని ప్రభుత్వం తలపోసింది. ప్రతి మూడు నెలలకొకసారి ప్రాజెక్ట్‌ ప్రగతి నివేదికను బహిరంగపరచాలని, పనులు జాప్యమైన పక్షంలో నష్టపరిహారం చెల్లించాలనే నిబంధనల స్ఫూర్తి కార్యాచరణలో నిలువునా నీరోడుతోంది. నొయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన రెండు 40 అంతస్తుల ఆకాశ హర్మ్యాలను కూల్చివేయాలన్న అలహాబాద్‌ హైకోర్టు తీర్పును తిరగదోడాలన్న వినతుల్ని సర్వోన్నత న్యాయస్థానం నెల్లాళ్లక్రితం అడ్డంగా కొట్టిపారేసింది. మరెక్కడా బిల్డర్లు అలా గాడితప్పి వినియోగదారుల్ని వేధించుకుతినే బాగోతాలు పునరావృతం కానివ్వరాదన్న పట్టుదలతో- కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమన్వయంతో చురుగ్గా ముందడుగు వేయాలి!

ఇదీ చూడండి: 'కొవిడ్ తర్వాత 85 లక్షల ఉద్యోగాలు పెరిగాయ్‌'

ఇదీ చూడండి: సెప్టెంబర్​లోనూ సేవా రంగం జోరు- ఉపాధి అవకాశాలు మెరుగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.