ETV Bharat / opinion

సృజనకు సోపానం-ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం - eenadu editorial

అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల చివరి సంవత్సరం పరీక్షలను సెప్టెంబరు 30కల్లా పూర్తిచేయాలని దేశంలోని విశ్వవిద్యాలయాలకు సూచించింది యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ). విద్యార్థులకు తప్పనిసరిగా మాస్కులు, గ్లవ్స్‌, శానిటైజర్లను అందించాలని, పరీక్ష కేంద్రాన్ని వైరస్‌ సంహార ద్రవాలతో శుభ్రపరచాలని ఆదేశించింది.

Tips for Creating Open Book Exams
సృజనకు సోపానం-ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానం
author img

By

Published : Aug 18, 2020, 6:58 AM IST

దేశమంతటా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అందరూ కోరుతున్నారు. దీన్ని అంగీకరిస్తూనే... విద్యార్థుల భవితకు ఆటంకాలేర్పడకుండా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలను కోరుతోంది. అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల చివరి సంవత్సరం లేక చివరి సెమిస్టర్‌ పరీక్షలను సెప్టెంబరు 30కల్లా పూర్తిచేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ సూచించింది. పరీక్షల్లో రాణించినప్పుడే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్‌ పోఖ్రియల్‌ నిశాంక్‌ ఉద్ఘాటించారు. పరీక్షల కోసం మానవ వనరుల శాఖ ఓ ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌ఓపీ)ని రూపొందించింది. ఆన్‌లైన్‌ (అంతర్జాలం)లో, ఆఫ్‌లైన్‌లో (ఎప్పటిలానే పెన్నూ పేపర్లతో)- మిశ్రమ పద్ధతిలో పరీక్షలు నిర్వహించే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం మొత్తం 31 మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. విద్యార్థులకు తప్పనిసరిగా మాస్కులు, గ్లవ్స్‌, శానిటైజర్లను అందించాలని; పరీక్ష హాలును వైరస్‌ సంహార ద్రవాలతో శుభ్రపరచాలని; రవాణా సమయంలో, పరీక్ష హాలులో సీట్ల అమరికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ, పంజాబ్‌ వంటి రాష్ట్రాలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సమస్య సుప్రీంకోర్టు వరకు చేరడంతో యూజీసీ సమర్పించిన అఫిడవిట్‌ సెప్టెంబరు 30కల్లా పరీక్షలు పూర్తిచేయాలని నిశ్చయించినట్లు తెలిపింది.

నిరంతర అధ్యయనం వైపు...

ఈ చిక్కుముడిని అధిగమించడానికి ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతి తోడ్పడుతుందేమో పరిశీలించాలి. విద్యార్థుల భద్రత, ఆరోగ్యాలకు ఎటువంటి హానీ లేకుండా ఇంటి నుంచే పరీక్షలు రాయడానికి సైతం ఈ పద్ధతి ఉపకరిస్తుంది. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, ప్రిన్స్‌టన్‌, లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ వంటి విఖ్యాత సంస్థలు ఇప్పటికే ఇంటి నుంచి పరీక్షలకు అనుమతించాయి. సెప్టెంబరులోపు భారత్‌లో కరోనా అదుపులోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి- మన యూజీ, పీజీ విద్యార్థులకు ఓపెన్‌ బుక్‌ పరీక్షలు నిర్వహించే విషయాన్ని పరిగణించాలి. ఓపెన్‌ బుక్‌ పద్ధతి వస్తే విద్యార్థులు కష్టపడి చదవడం మానేసి, చూచి రాతలకు అలవాటు పడిపోతారన్నది ప్రధాన అభ్యంతరం. కానీ, ప్రస్తుతం అమలులో ఉన్న పరీక్షా విధానం గొప్పగా ఏమీ లేదని గ్రహించాలి. ఈ సంప్రదాయ పద్ధతిలో విద్యార్థులు బట్టీ చదువులకు అంకితమైపోతున్నారని, ఉపాధ్యాయులు ఇలాంటివారికే ఎక్కువ మార్కులు, గ్రేడ్లు ఇచ్చి ఉత్తమ విద్యార్థులుగా ముద్ర వేస్తున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత విజ్ఞానాధార ప్రపంచంలో నిరంతర అధ్యయనశీలురే విజేతలుగా నిలుస్తారు. భారతీయ విద్యావిధానం మన విద్యార్థులను ఆ మేరకు తీర్చిదిద్దడంలో విఫలమవుతోంది. తాజాగా కేంద్రం వెలువరించిన నూతన విద్యావిధానమూ విద్యార్థులు తమ మెదడులో పాఠాలను కుక్కడం మానేసి- ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ, కొత్త విజ్ఞానాన్ని సృష్టించగలవారిగా ఎదగాలని లక్షిస్తోంది. ఉపాధ్యాయులూ పాఠ్య పుస్తకాల్లోని సమాచారాన్ని విద్యార్థుల మెదళ్లలోకి చొప్పించడమే తమ పని అనుకోకుండా, సృజనాత్మకతను పెంపొందించడానికి ప్రాధాన్యమివ్వాలి. విద్యార్థుల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలనే కుతూహలాన్ని కల్పించేలా బోధించాలి. ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతి విద్యార్థుల్లో సమస్యా పరిష్కార శక్తిని, విశ్లేషణాత్మక ఆలోచనా విధానాన్ని ద్విగుణీకృతం చేస్తుందని నిరూపితమైంది. ఈ పద్ధతిలో సమాధానాలు రాయడానికి విద్యార్థులు పాఠ్య పుస్తకాలను, రిఫరెన్స్‌ గ్రంథాలను, ఈ-పుస్తకాలను పరిశీలించవచ్ఛు అలాగని చూచి రాతను ప్రోత్సహించడం ఇక్కడ ఉద్దేశం కాదు. అందుబాటులోని గ్రంథాల ఆధారంగా విద్యార్థి కీలక ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయడానికి ఊతమివ్వడం ఓపెన్‌ బుక్‌ పద్ధతి ప్రధాన లక్ష్యం. విద్యార్థి తానిచ్చే సమాధానాలకు ఆధారంగా ఎటువంటి వాదాన్ని వినిపిస్తాడనేదాని మీద అతడు లేక ఆమె సత్తాను నిగ్గుతేల్చవచ్ఛు

బోధన పద్ధతులపై ప్రభావం

విద్యార్థులు పాఠాలను కంఠతా పట్టడం మానేసినప్పుడు, వారి ఆలోచనా ధోరణిలోనే మౌలిక మార్పు వస్తుంది. వివిధ భావాలు, సూత్రాలను క్షుణ్నంగా అవగాహన చేసుకుని, విశ్లేషణ సామర్థ్యం పెంచుకుని, సమస్యా పరిష్కార సత్తాను అలవరచుకోవాలనే తపన వారిలో పెరుగుతుంది. అదే జరిగినప్పుడు విద్యాభ్యాసం విసుగు పుట్టించే మొక్కుబడి కార్యకలాపంగా కాకుండా ఆనందదాయక సృజనాత్మక విషయంగా రూపాంతరం చెందుతుంది. ప్రశ్నల తీరు మారినప్పుడు తరగతి గదుల్లో బోధన-అభ్యసన రీతులు సైతం సమూల మార్పులకు లోనవుతాయి. విశ్లేషణాత్మక ప్రశ్నలు తలెత్తి, వాటిపై ఆసక్తికరమైన చర్చలు జరిగి, ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతుంది. ఓపెన్‌ బుక్‌ పరీక్షా విధానానికి తెరతీసినప్పుడు ఉపాధ్యాయుల బోధన రీతులు మార్చుకోవలసి వస్తుంది. ఆచరణాత్మక అభ్యసనాన్ని చేపట్టడం ఉపాధ్యాయుల వృత్తి ధర్మంగా మారిపోతుంది. ఓపెన్‌ బుక్‌ పరీక్షా పద్ధతికి మారినంతమాత్రానే విద్యా విధానంలోని రుగ్మతలన్నీ మటుమాయమవుతాయనేతొందరపాటు నిర్ణయానికి రాకూడదు. ఈ పద్ధతివల్ల విద్యార్థులు-ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను రూపాంతరం చెందించడం మాత్రం ఖాయం. చెప్పడం, వినడం కన్నా ప్రశ్నించడం, నేర్చుకోవడానికి ప్రాధాన్యం పెరుగుతుంది. విద్యార్థుల మేధాశక్తి వికసించే నెలవులుగా తరగతి గదులు మారిపోతాయి. వారి సమాధానాలను మూల్యాంకనం చేయడానికి అధ్యాపకులు కొత్త ప్రమాణాలు అనుసరించాల్సి వస్తుంది. 21వ శతాబ్దిలో విజయ పతాక ఎగురవేయడానికి భారతీయ విద్యార్థులను ఓపెన్‌ బుక్‌ పద్ధతి సమాయత్తం చేస్తుంది. ఈ కరోనా కష్ట కాలాన్ని మన విద్యావిధాన రూపాంతరీకరణకు సాధనంగా ఉపయోగించుకోవాలి!

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌.జ్యోతికుమార్‌, (రచయిత- మిజోరం కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.