ETV Bharat / opinion

ఇదే అసలు సంక్రాంతి- ఓ 'పీడ' పోబోతోంది! - అక్కడ ఎవరి పొంగలి ఉడకనుందో?

రాజకీయాలకు పండుగలకు అవినాభావ సంబంధం ఉంటుంది. సంక్రాంతి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. కరోనా కారణంగా ఈసారి పండుగను అనేక ఆంక్షల నడుమ జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కరోనా ఎప్పుడు పోతుందో ఏ రోజున దాని దుంపతెగనుందో అని ప్రతిరోజూ ఎదురు చూసిన సామాన్యుడికి, మాన్యుడికి ఇది నిజం సంక్రాంతి కాబోతోంది. 16న టీకా షురూ అవుతోంది. ఇతరేతర సమస్యలెన్ని ఉన్నా.. ఒక పీడ వదులుతోంది. ఇదే అసలు సిసలు సంక్రాంతి కాబోతోంది.

this time Pongal is very special
ఇదే అసలు సిసలు సంక్రాంతి
author img

By

Published : Jan 14, 2021, 11:04 AM IST

సంక్రాంతి ఒక ప్రత్యేక పండగ.. తెలుగువాళ్ల తెలుగు పండగ. నిజం పండగ సంక్రాంతే. ఇతరేతర పండగలన్నీ ఏదో ఒక దేవుడికో, రాక్షస సంహారానికో లింకు ఉన్న పండగలే. ఇదొక్కటే- ప్రజల పండగ, రైతుల పండగ, మహిళల పండగ, పిల్లల పండగ.

కోడి పందాలకు బర్డ్​ ఫ్లూ భయం

కోడిపందాలకూ ఈసారి సమస్య వచ్చిపడింది. గుంపులుగా జనం రావడానికి కరోనా కత్తి ఇంకా తలమీద వేలాడుతూనే ఉంది. అదియునూ గాక బర్డ్‌ఫ్లూ భయం కోడిపుంజులకూ పట్టుకుంది. ఒక పుంజును చూసి మరో పుంజు ట్రంప్‌లా రెచ్చిపోయి పోరాడే బదులు, చివరిదాకా పొడుచుకు చచ్చే బదులు ఒకదాన్ని చూసి మరోటి ఈక ముడిచి పారిపోయే పరిస్థితి నెలకొంది. పందెంకోడిని అరెస్టు చేస్తే బర్డ్‌ఫ్లూ అంటుకుంటుందేమోనని పోలీసులకు భయం. బర్డ్‌ఫ్లూ మనదగ్గర లేదయ్యా, హాయిగా(కోడిపందాలు) ఉండొచ్చునంటున్నాయి తెలుగు సర్కార్లు. (కోళ్లూ మాస్కులు కట్టుకుని శానిటైజ్‌ చేసుకుని పోరాడవచ్చు.)

‘రాజకీయాలతో పోలిక లేని పండగ ఉంటుందా?

కళ్లంటూ ఉంటే చూసీ, వాక్కంటూ ఉంటే రాసి’ అన్నట్టు గమనిస్తే రాజకీయాలతో పోలిక లేని పండగంటూ ఉండదు- సంక్రాంతి మరీనూ. ధనుర్మాసం ఆరంభానికి ముందే దిల్లీ సరిహద్దుల్లో భోగిమంటలు నలుదిశలా ఆరంభమయ్యాయి. జేగీయమానంగా వెలుగొందుతున్నాయి. చలిమంటకు తోడు కడుపుమంట. తమిళులు ధనుర్మాసాన్ని మార్గళైమాస అంటారు. మార్గళి అంటే పొంగలి. సంక్రాంతి పొంగలి. సూర్యోదయంకన్నా ముందే ఆరగిస్తారు. దిల్లీలో మార్గళి వండకున్నా రోజూ లంగరు సాగుతోంది. లంగరంటే వంట. ఉచితంగా అంతా కలిసి భోంచేయడానికి వండే వంట.

యడుయూరప్ప పొంగలి వడ్డించేశారు

కర్ణాటకలో కూడా సంక్రాంతి మన సంక్రాంతిలాగే జరుపుతారు. (పాకిస్థాన్‌లోని సింధ్‌ నుంచి శ్రీలంక దాకా, అసోం నుంచి గుజరాత్‌ దాకా వేరువేరు పేర్లతో ఇదే పండగ చేస్తారు. అది వేరే సంగతి.) నిన్న భోగి రోజునే యెడియూరప్ప పొంగలి/మార్గళి వండేసి ఆశావహుల్లో కొందరికి వడ్డించేశాడు. నాకు నాకు నాకు నాకు అని మాయాబజార్‌ సినిమాలోలా ఎంత ఎగబడ్డా కూడా మిగతావారికి గొబ్బెమ్మలు, పతంగులు, ముగ్గుపిండి వగైరాలే మిగిలాయి.

ప్రజాస్వామ్యం ఎక్కువైందంట!

మరో మూడు నాలుగు నెలల్లో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.. ప్రతి ఏడాదీ మనదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లి ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అన్నీ మినీ జనరల్‌ ఎలక్షన్లే. అవి కాకపోతే గ్రామ పంచాయతీలకు, మండళ్లకు, జిల్లాలకు, నగర పాలికలకు.. వివిధ సొసైటీలకు ఎన్నికలే ఎన్నికలు. అవి తెరిపినిస్తే ఉప ఎన్నికలొస్తాయి. మన దగ్గరున్నంత ప్రజాస్వామ్యం మరో చోట వినం, చూడం. మొన్నొకాయన అదే చెప్పాడు ప్రజాస్వామ్యం ఎక్కువయిందని.. ఈ విషయంలో కాదులెండి. డిమాండు చేసేవాళ్లను చూస్తే ఆయనకు ఒళ్లు మంటట.. 'ధిక్కారమున్‌ సైతునా' అని. తమలాంటి కొద్దిమందికి తక్క ఇతరులెవరికీ ప్రజాస్వామ్యం అక్కర్లేదని ఆయన అభిభాష.

ఎవరి పతంగి ఎగురుద్దో?

అయిదు రాష్ట్రాల్లో ఎవరి పతంగులు ఎగురుతాయో, ఏ గాలి ఎటు వీస్తుందో చెప్పలేం. బెంగాల్‌లో బీజేపీకి గాలిపటానికన్నా దాని తోకే ఎక్కువవుతోందని అక్కడి నాయకులే వాపోతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి వలసలు మరీ ఎక్కువయ్యాయి.

'మమత' కష్టాలు

మమత ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా, ఎన్ని ఆశలు చూపిస్తున్నా(ఈ మధ్య అడ్డంకులనూ బ్యారికేడ్లనూ నీటి ఫిరంగులనూ దాటుకొని రైతులు దిల్లీ చేరినట్టే) వలసలు ఆగట్లా. రానివాళ్లను అమిత్‌షాజీనో, నడ్డాజీనో వచ్చి తోలుకెళ్తున్నారు. ఆగమాగమైపోతోంది తృణమూల్‌- ఎన్నికలకు ముందే.

అక్కడ ఎవరి పొంగలి ఉడకనుందో?

తమిళనాట ఎవరి పొంగలి(మార్గళి) ఉడకనుందో చూడాలి. ఏ హరిదాసు జోలె ఎంత నిండుతుందో ఏమో.. అసోమ్‌లోనూ అంతే. గంగిరెద్దులెన్ని తిప్పాలో ఎన్ని విన్యాసాలు చేస్తే ఓటరు ఆనందిస్తాడో తెలియదు.

టగ్‌ ఆఫ్‌ వార్‌

సంక్రాంతి పండగ చేసుకుందాం మొర్రో అని రైతులడుగుతోంటే సర్కారు శివరాత్రో వైకుంఠ ఏకాదశో చేసుకోండంటోంది. తాడుకు ఎన్ని ముళ్లు పడ్డా కూడా టగ్‌ ఆఫ్‌ వార్‌ తేలట్లేదు.

గాలి లేకున్నా పతంగి ఎగరాలంటాడు

ట్రంపు సారు నీతీ రీతీ వేరు- గాలి లేకున్నా తన గాలిపటమే ఎగరాలంటాడు- లేకుంటే ఖబర్దార్‌! అచ్చం మృచ్ఛకటికం నాటకంలో రాజుగారి బావమరిదిలాగే ట్రంప్‌ కూడా. నువ్వేం కొత్తల్లుడివి కాదు పొమ్మన్నా చూరట్టుకు వేలాడుతాడు. రాజు బలవంతుడా మొండివాడు బలాఢ్యుడా అంటే మొండివాడేనంటాం.. రాజే మొండివాడైతే?! ఏం చెబుతాం!

ఇదంతా రాజకీయ సంక్రాంతి. అదెట్లున్నా ఎప్పుడు పోతుందో ఏ రోజున కరోనా దుంపతెగనుందో అని ప్రతిరోజూ ఎదురు చూసిన సామాన్యుడికీ మాన్యుడికీ ఇది నిజం సంక్రాంతి.. రేపటినుంచే టీకా షురూ అవుతోంది. ఇతరేతర సమస్యలెన్ని ఉన్నా- ఒక పీడ వదులుతోంది. ఇదే అసలు సిసలు సంక్రాంతి! -చికిత

ఇదీ చూడండి: 'వివాహేతర సంబంధాలను సైన్యంలో నేరంగానే పరిగణించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.