ETV Bharat / opinion

శ్రామికశక్తికి నైపుణ్యాల సాన - jobers

కరోనా మహమ్మారితో ప్రపంచార్థికం దుర్భర మాంద్యంలోకి జారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపాధిని దెబ్బతీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 'భారత్‌లో తయారీ' లక్ష్యాలు, 'స్వావలంబన భారత్‌' స్వప్నాలు సాకారం కావాలంటే దేశార్థికాన్ని పునరుత్తేజితం చెయ్యగల కీలక రంగాలన్నింటికీ సమర్థ మానవ వనరుల అవసరం ఏపాటి ఉండనుందో శాస్త్రీయంగా మదింపు వేసి, నైపుణ్య శిక్షణలో ఆయా రంగాలవారిని భాగస్వాముల్ని చేసే జాతీయ వ్యూహం సత్వరం రూపొందాలి.

The workforce needs to be skilled
శ్రామికశక్తికి నైపుణ్యాల సాన
author img

By

Published : Jun 10, 2020, 10:44 AM IST

నూట యాభై ఏళ్ల తరవాత మళ్ళీ ఓ మహమ్మారి పెను విధ్వంసక శక్తి కారణంగా ప్రపంచార్థికం దుర్భర మాంద్యంలోకి జారిపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతావని వృద్ధి రేటు మైనస్‌ 3.2గా నమోదు కావచ్చునంటున్న ప్రపంచబ్యాంకు, ప్రజల తలసరి ఆదాయాలు 3.6శాతం మేర తెగ్గోసుకుపోయి కోట్లమంది కడు పేదరికంలోకి జారిపోయే ముప్పునూ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి 29 కోట్లమంది వలస శ్రామికుల ఉపాధిని దెబ్బతీసిందంటున్న చైనా, వచ్చే రెండేళ్లలో కోటీ 40 లక్షల మందిని వృత్తి విద్యా నైపుణ్య శిక్షణ ద్వారా రాటుతేల్చి భవిష్యత్‌ అవసరాలకు దీటుగా తీర్చిదిద్దే ప్రణాళికను సిద్ధం చేసింది.

దేశ ప్రగతిని దిగలాగుతున్నాయి...

పెను ఉత్పాతాన్నే మహత్తర అవకాశంగా మలచుకొని ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారతావని) సాధించాలంటున్న మోదీ ప్రభుత్వం వలసకూలీల కోసం బృహత్‌ పథకాన్ని ప్రస్తావిస్తోంది. ఏడు దశాబ్దాల గణతంత్ర భారతంలో మానవ వనరుల అభివృద్ధి అంశం మరుగున పడిపోబట్టే నేడు దేశం ఇంతగా కిందుమీదులు కావాల్సి వస్తోంది. పాతికేళ్ల వ్యవధిలో దక్షిణ కొరియా పారిశ్రామిక సేవా రంగాల్లో 41 నుంచి 81శాతానికిపైగా ఉపాధి వృద్ధి నమోదు చెయ్యగలిగిందంటే కారణం వృత్తి నైపుణ్యాలు మెండుగాగల శ్రామిక శక్తే! భారతీయ కార్మికులతో పోలిస్తే ఉత్పాదక శక్తిలో జర్మనీ నాలుగింతలు, తైవాన్‌ అయిదు, అమెరికా ఆరు, సింగపూర్‌ పదిరెట్ల పనితనం కనబరచడానికి నైపుణ్యాభివృద్ధి ప్రణాళికలే పుణ్యం కట్టుకొన్నాయి. అదే ఇక్కడ, 'స్కిల్‌ ఇండియా' పథకం కింద రూ.5,900కోట్లు వ్యయీకరించి 68లక్షల మందికి శిక్షణ ఇస్తే, ఉపాధి పొందగలిగింది 23శాతమే! నేల వీడి చేసే సాములాంటి ఈ తరహా పథకాలే దేశ ప్రగతిని దిగలాగుతున్నాయి!

నైపుణ్య భారతమే ప్రధానాస్త్రం..

పేదరికం మీద ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధంలో నైపుణ్య భారత్‌ కార్యక్రమమే ప్రధానాస్త్రమని అయిదేళ్లనాడు ప్రధాని మోదీ చేసిన ప్రకటనలో అతిశయోక్తి ఈషణ్మాత్రం లేదు. 2022నాటికి చిల్లర వర్తక రంగాన అయిదు కోట్లు, స్వాస్థ్య సౌందర్య రంగాల్లో కోటిన్నర దాకా, టెలికాం రంగంలో 20 లక్షలకుపైగా అదనపు అవకాశాలు విప్పారతాయన్న అంచనాల్ని వెన్నంటి, సాఫ్ట్‌వేర్‌ ఎలెక్ట్రానిక్స్‌ ఉత్పత్తులపై జాతీయ విధాన ప్రకటనలు ఉపాధి విస్తృతికి హద్దే లేదంటున్నాయి. ప్రపంచ వస్తూత్పాదనల తయారీ కేంద్రంగా, సరఫరా గొలుసుగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చైనాపై విముఖత ప్రబలుతున్న నేపథ్యంలో- దానికి ప్రత్యామ్నాయంగా రాణించాలనుకొంటున్న ఇండియా వ్యూహాలు గతానికి భిన్నంగా రాటుతేలాలి. పని నైపుణ్యాలు కలిగిన శ్రామిక శక్తి అమెరికాలో 52శాతం, యూకేలో 68, జర్మనీ 75, జపాన్‌ 80, దక్షిణ కొరియాలో 96శాతం ఉంటే, ఇండియాలో అలాంటి పనిమంతుల సంఖ్య అయిదు శాతం లోపు! కరోనా అనంతరకాలంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ పారిశ్రామిక, సేవా రంగాల్లో రాగల మార్పులకు దీటుగా దేశ యువతను తీర్చిదిద్దుకోవడమే నేటి సవాలు! విదేశాలనుంచి తిరిగి వస్తున్న వారి వృత్తి నైపుణ్యాలను నమోదు చేసి ఇక్కడ వారి సేవల్ని వినియోగించుకోగల 'స్వదేశ్‌' పథకానికి మోదీ సర్కారు శ్రీకారం చుట్టింది. 'భారత్‌లో తయారీ' లక్ష్యాలు, 'స్వావలంబన భారత్‌' స్వప్నాలు సాకారం కావాలంటే ఈ పరిమిత చొరవ సరిపోదు. దేశార్థికాన్ని పునరుత్తేజితం చెయ్యగల కీలక రంగాలన్నింటికీ సమర్థ మానవ వనరుల అవసరం ఏపాటి ఉండనుందో శాస్త్రీయంగా మదింపు వేసి, నైపుణ్య శిక్షణలో ఆయా రంగాలవారిని భాగస్వాముల్ని చేసే జాతీయ వ్యూహం సత్వరం రూపొందాలి. చైనాలో మాదిరిగా వృత్తి విద్యకు చదువుల్లో పెద్దపీట వేసి, సీనియర్‌ సెకండరీ స్థాయికొచ్చేసరికి నైపుణ్యాలు ఒంటపట్టేలా వ్యవస్థను తీర్చిదిద్దాలి. నిపుణ శ్రామిక శక్తే ఏ జాతికైనా కలిమి, బలిమి!

ఇదీ చూడండి: అగ్ని రహస్యం బయటకు వచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.