ETV Bharat / opinion

అందరికీ అందని ఆన్‌లైన్‌ బోధన

కరోనా వల్ల విద్యారంగం తీవ్రంగా నష్టపోయింది. విద్యా సంవత్సరంలో చాలా సమయం ఖాళీగా గడిచిపోయింది. ఇటీవల ఆన్​లైన్ క్లాసులు ప్రారంభించినా.. అందులో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలతో పోలిస్తే... గ్రామాల్లో విద్యార్థులు ఆన్​లైన్​లో​ చదువుకునే సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్​ఫోన్​ వంటివి అందుబాటులో లేకపోవడం సహా.. మరెన్నో ఇతర సమస్యలు ఆన్​లైన్​ చదువులకు సవాళ్లు విసురుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇలా ఉన్నాయి.

online education is Difficulties for rural students
గ్రామీణ విద్యార్థులకు ఆన్​లైన్ స్కూల్ కష్టాలు
author img

By

Published : Sep 14, 2020, 7:36 AM IST

దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని కరోనా ఒక కుదుపు కుదిపింది. విద్యారంగానికి ఆయువుపట్టు అయిన బోధనా రీతుల్నే ఇది ఆసాంతం మార్చేస్తోంది. గురుముఖతః చదువు ప్రమాదంలో పడింది. ఆన్‌లైన్‌ పద్ధతిలో డిజిటల్‌ స్క్రీన్‌ చూస్తూ చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బోధనపరంగా ఆన్‌లైన్‌ చదువులను ఎవరూ సమర్థించరు. అదే సమయంలో విపత్కర కాలంలో ఈ పద్ధతిని ఉన్నంతలో మంచి ప్రత్యామ్నాయంగా అంగీకరించక తప్పదు. ఆన్‌లైన్‌ సాంకేతికతకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నప్పటికీ మారిన పరిస్థితులు గ్రామీణ విద్యారంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేలా ఉన్నాయన్నది నిర్వివాదం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థినుల చదువులు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నాయి. గ్రామాల్లో ఉండే సామాజిక ఆర్థిక స్థితిగతులు అందుకు కారణమవుతున్నాయి.

అదనపు ఆర్థిక భారం

ఆన్‌లైన్‌ విద్యకు స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్లలో ఏదోఒకటి ఉండాలి. అంతర్జాలంతో అనుసంధానం అవసరం. ఇవన్నీ ఆర్థికంగా భారం మోపేవే. గ్రామాల్లో అంతర్జాల కనెక్టివిటీ అంతంతమాత్రం. విద్యార్థుల్లో ఎక్కువమందికి మామూలు ఫోన్లు ఉంటాయి. కొందరికి ఫోన్లే ఉండవు. అందువల్లే ఆన్‌లైన్‌ తరగతులకు వారు దూరమై ఒత్తిడికి గురవుతున్నారు. వారిలో ఆత్మన్యూనత వేళ్లూనుకుంటోంది. ఫోన్లు ఉన్నా అవసరమైన డేటా లేని విద్యార్థులు అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను అడగలేక సతమతమవుతున్న వైనం ఇందులోని మరో బాధాకర కోణం. వీడియో ఆడియో పాఠాలు వినాలంటే ఎక్కువ డేటా అవసరం. డేటా కొనుగోలు చేయలేనివారు చదువులకు క్రమేపీ దూరమవుతున్నారు. ఆన్‌లైన్‌ చదువులకు ఏకాంతం, ఏకాగ్రతలు ఎంతో అవసరం. గ్రామాల్లో అలాంటి పరిస్థితులు ఉండవు. ఇంటి వాతావరణం సైతం అందుకు దోహదం చేయదు.

అంతా యాంత్రికంగా..

విద్యార్థులు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి దూరంగా ఉంటున్నారు. చెప్పేది వారెంతవరకు విన్నారో, అసలు విన్నారో లేదో తెలియని స్థితి. అంతా యాంత్రికంగా జరిగిపోవడం బోధనలో ప్రాథమిక నియమాలకు విరుద్ధం. పిల్లలకు పాఠం ఎంతవరకు అవగతమయిందో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉపాధ్యాయులు ఉండిపోతున్నారు. చెప్పిన పాఠం సరిగ్గా వినక, వినిపించక ఆ తరవాత పిల్లలు సంధించే ప్రశ్నల వల్ల వారు పడుతున్న పాట్లు అనేకం. పాఠాలు చెబుతున్నప్పుడు అంతర్జాల ప్రసార అనుసంధానం (స్ట్రీమింగ్‌) పోతుండటం చీకాకుపెట్టే అతిపెద్ద సమస్య.

నగరాలు, పట్టణాల మాదిరిగా పల్లెలు ఆన్‌లైన్‌ పాఠాలకు సిద్ధంగా లేవన్నది వాస్తవం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యారంగాన్ని గాడిలోపెట్టడం ఒక్క ప్రభుత్వ బాధ్యతే అనుకోవడం సరికాదు. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో మెరుగైన ప్రత్యామ్నాయాల గురించి పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులూ కసరత్తు జరపాలి. తల్లిదండ్రులు గతంలో తాము చదివిన చదువులను పునశ్చరణ చేసుకుని పిల్లలకు స్వయంగా తామెంతవరకు బోధించగలమో తెలుసుకోవాలి. ఫిన్లాండ్‌ దేశంలో మాదిరి తల్లిదండ్రులూ పిల్లల చదువుల్లో బాధ్యత తీసుకోవాల్సిన రోజులు వచ్చాయి. ఉపాధ్యాయులను సహాయకులు, సమన్వయకర్తలుగా మాత్రమే పరిగణించాలి. విద్యార్థులు సైతం సాంకేతికతను అందిపుచ్చుకొంటూ ముందుకు సాగాలి.

వీడియోలతో అంతరాయాలకు కళ్లెం

ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ సాంకేతిక నైపుణ్యాలకు సాన పెట్టుకుని- పాఠాలను పది పదిహేను నిమిషాల వీడియోలుగా రూపొందించి విద్యార్థులకు అందజేయాలి. దీనివల్ల ఆన్‌లైన్‌లో ప్రసార సమస్యలను అధిగమించవచ్ఛు విద్యార్థులూ ఆయా పాఠ్యాంశాల వీడియోలను తమకు అనువైన సమయంలో ప్రశాంతంగా వీక్షించవచ్ఛు ఆపై తరగతి విద్యార్థులను అయిదారు బృందాలుగా విభజించి, బృంద నాయకుల ద్వారా సందేహాలను నివృత్తి చేయాలి.

ఆన్‌లైన్‌ విద్యలో ఎదురవుతున్న సాంకేతిక లోటుపాట్లను ఉపాధ్యాయులు, అధ్యాపకులు రూపొందించే వీడియో పాఠాలు చాలావరకు పరిష్కరిస్తాయి. వీడియో అనుసంధానం లోటుపాట్లనూ పరిహరిస్తాయి. ట్యాబ్‌, లాప్‌ట్యాప్‌, కంప్యూటర్ల అవసరం లేకుండా చరవాణుల ద్వారానే చదువులు సులభంగా సాగిపోతాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌ మార్గంలో నడవడానికి అనువుగా ప్రభుత్వం సాంకేతికపరమైన సౌకర్యాల సృష్టిపై దృష్టి సారించాలి. పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందజేయాలి. డేటా సమస్యలను పరిష్కరించాలి. ప్రతి పాఠశాల, కళాశాలలో ఆన్‌లైన్‌ విద్యకు విద్యార్థులు ఎంతమేరకు సంసిద్ధంగా ఉన్నారో శాస్త్రీయంగా సత్వర అధ్యయనం జరపాలి. పూర్వ విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఔత్సాహిక సంఘసేవకుల నుంచి సహాయ సహకారాలు స్వీకరించాలి. నిరాటంకంగా పిల్లల ఆన్‌లైన్‌ చదువులు సాగడానికి అనువుగా ఇంటి వాతావరణంలో తీసుకురాదగిన మార్పుల గురించి తల్లిదండ్రులకూ అవగాహన కల్పించాలి.

(రచయిత- తమ్మా మల్లికార్జునరావు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.