ETV Bharat / opinion

గబ్బిలం కాదు.. వీధి కుక్క నుంచే కరోనా వ్యాప్తి! - Corona latest news

కరోనా వైరస్​ వీధి కుక్కల ద్వారా మనుషులకు వ్యాపించి ఉండొచ్చంటున్నారు కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయ పరిశోధకులు. తాజా అధ్యయన ఫలితాల ఆధారంగా ఈ విషయం చెబుతున్నట్లు స్పష్టం చేశారు. గబ్బిలం మాంసాన్ని తినడం ద్వారా వీధి కుక్కకూ.. తద్వారా మనుషులకు వ్యాపించి ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.

Stray dogs may have played role in novel coronavirus origin
గబ్బిలం కాదు వీధి కుక్కల నుంచే మనుషులకు కరోనా వ్యాప్తి!
author img

By

Published : Apr 15, 2020, 3:37 PM IST

కరోనా... ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న మహమ్మారి​. ఇప్పటికే లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్​.. అసలు ఏ జంతువులో పుట్టింది? మనుషులకు ఎలా సోకింది? అన్న పశ్నలకు ఎన్నో సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పరిశోధనలు గబ్బిలాల్లో పుట్టిందని చెబుతుంటే.. మరికొన్నేమో పాములు, కోతుల్లో పుట్టిందని అంటున్నాయి. అయితే కరోనా వీధి కుక్కల ద్వారా మనుషులకు వ్యాపించి ఉండొచ్చని కెనడాలోని ఒట్టావా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు భావిస్తున్నారు. వీరు చేసిన తాజా అధ్యయనాల్లో ముఖ్యంగా కుక్కల పేగుల్లోనే ఈ వైరస్​ అభివృద్ధి చెందినట్లు తేలిందని చెబుతున్నారు.

మాలిక్యులార్​ బయాలజీ అండ్​ ఎవల్యూషన్​ జర్నల్​లో ప్రచురితమైన వ్యాసం ప్రకారం.. గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా వ్యాపించేందుకు జంతువులు మధ్యస్త వాహకాలుగా ఉండే అవకాశముందా అన్న కోణంలో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. పాముల నుంచి అలుగు వరకు అనేక జంతువులను పరిశోధించారు. అయితే ఈ జంతువుల్లో పుట్టిన వైరస్​లు సార్స్​-సీఓవీ-2(కరోనా వైరస్​) కంటే భిన్నంగా ఉన్నట్లు తేలిందని పరిశోధకుల్లో ఒకరైన జుహువా జియా తెలిపారు. కానీ, వీధికుక్కల్లో పేగు సంబంధిత వ్యాధులకు కారణమయ్యే కనైన్​ కరోనా వైరస్​(సీసీఓవీఎస్​)లతో మాత్రం సార్స్​-సీఓవీ-2కు పోలికలున్నట్లు వెల్లడించారు. అందుకే మానవుల జీర్ణవ్యవస్థపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు.

గబ్బిలాల నుంచే కుక్కలకు

ఓ వీధి కుక్క గబ్బిలం మాంసాన్ని తినడం వల్లే సదరు శునకానికి కరోనా వ్యాపించిందని.. అలా కుక్కల ద్వారా మనుషులకు సోకి ఉండొచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు జియా.

"కరోనా గబ్బిలాల ద్వారా వీధి కుక్కలకు సోకింది. కుక్కల పేగులపై ప్రభావం చూపి అత్యంత వేగంగా అభివృద్ధి చెంది మానవులకు వ్యాపించినట్లు భావిస్తున్నాం."

- జుహువా జియా, పరిశోధకులు

అధ్యయనంలో ఏం తేలిందంటే..

మానవులు, క్షీరదాల్లో 'జాప్​'(జెడ్​ఏపీ) అనే అత్యంత కీలకమైన యాంటీవైరల్​ ప్రొటీన్​ ఉంటుంది. ఏదైనా జంతువుకు లేదా మనిషికి వైరస్ సోకినప్పుడు.. ఆ వైరస్​ జీనోమ్​ (ఒక బీజకణంలోని క్రోమోజోముల మొత్తం)పై ప్రభావం చూపి వైరస్​ అభివృద్ధి చెందకుండా చేయడంలో ఈ ప్రొటీన్​ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఆర్​ఎన్ఏ జీనోమ్​లోని సీపీజీ డైన్యూక్లియోటైడ్స్​ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రొటీన్​ పనిచేస్తుంది. కానీ, కరోనా లాంటి వైరస్​లు సీపీజీని తగ్గించడం ద్వారా జాప్​ను శక్తిహీనంగా మారుస్తుందని యూనివర్సిటీ ఆఫ్​ ఒట్టావా శాస్త్రవేత్తలు తేల్చారు. సీపీజీ ఎక్కువగా ఉన్నప్పుడు మానవులకు ఎలాంటి హాని ఉండదని, తక్కువగా ఉంటే ప్రమాదకరమని చెబుతున్నారు.

" ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 1,251 పూర్తిస్థాయి బీటా కరోనా వైరస్​ జీనోమ్స్​పై అధ్యయనం చేశాం. వీధికుక్కల్లోని కనైన్​ కరోనా వైరస్​లలోని సీపీజీ విలువలు​ సార్స్​-సీఓవీ-2, బ్యాట్ ​సీఓవీ, ర్యాట్​ సీఓవీ, జీ13 సీపీజీ విలువతో సమానంగా ఉన్నట్లు తేలింది. కుక్కలు సంపర్కంలో పాల్గొన్నప్పుడే కాకుండా మిగతా సమయాల్లోనూ తమ లైంగిక అవయవాలను నాలుకతో తరచూ నాకుతూ ఉంటాయి. ఈ అలవాటు వల్లే జీర్ణవ్యవస్థ నుంచి శ్వాస కోశ వ్యవస్థకు వైరస్ వ్యాపించి ఉంటుందని భావిస్తున్నాం."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.