ETV Bharat / opinion

ఆకాశమే హద్దుగా అంతరిక్ష ప్రయోగాలు - ఇస్రో

అంతరిక్షరంగంలో ప్రయోగాలను విస్తరించేందుకు ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నప్పుడు మిశ్రమ స్పందన లభించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్​ మాధవన్​ నాయర్​ లాంటివారూ దీనిని వ్యతిరేకించారు. అయినప్పటికీ కేంద్ర మంత్రి వర్గం తాజా సంస్కరణలకే మొగ్గుచూపింది. ఫలితంగా ఉపగ్రహ ప్రయోగ సేవలు, రాకెట్లు మొదలగు నిర్మాణ ప్రక్రియ మరింత వృద్ధి చెందుతుందని ఇస్రో ఛైర్మన్​ శివన్​ అంటున్నారు.

SPACE EXPERIMENTS DEVELOPING THROGH ATMA NIRBHAR BHARAT
ఆకాశమే హద్దుగా... అంతరిక్ష ప్రయోగాలు
author img

By

Published : Jun 27, 2020, 7:06 AM IST

'ఆత్మ నిర్భర్‌ భారత్‌'ను ఆవిష్కరించే క్రమంలో ఉపగ్రహ నిర్మాణం, రోదసి ప్రయోగ సేవల రంగాన ప్రైవేటు భాగస్వామ్యానికి చోటుపెట్టే ప్రతిపాదన గత నెలలో వెలుగు చూసినప్పుడు- మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) మాజీ సారథి డాక్టర్‌ మాధవన్‌ నాయర్‌ వంటివారు ఆ యోచనను బహిరంగంగానే వ్యతిరేకించారు. ఇస్రో వ్యవస్థాగత చట్రంలో మార్పుల పట్ల అభ్యంతరాల్ని తోసిరాజంటూ కేంద్ర మంత్రిమండలి తాజాగా సంస్కరణలకే ఓటేసింది. రోదసి పరిశోధనల్లో ప్రైవేటుకు పాత్ర కల్పించడంవల్ల వాణిజ్య ప్రాతిపదికన ఉపగ్రహ ప్రయోగ సేవలు, రాకెట్లు తదితరాల నిర్మాణ ప్రక్రియ పరిధి విస్తరిస్తుందని ఇస్రో ప్రస్తుత ఛైర్మన్‌ శివన్‌ ప్రస్తుతిస్తున్నారు. మున్ముందు చేపట్టే గ్రహాంతర యాత్రల్లోనూ ప్రైవేటు రంగం కీలక భూమిక పోషించగల వీలుంటుందనీ ఆయన చెబుతున్నారు.

'ఇన్​స్పేస్​'కు గ్రీన్​ సిగ్నల్​..

ప్రైవేటు రంగ అంతరిక్ష కార్యక్రమాలకు అనుమతుల జారీ, నియంత్రణలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే నిమిత్తం 'ఇన్‌ స్పేస్‌(ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌)' ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. వాస్తవానికి రోదసి కార్యక్రమాల్లో పరివర్తనను లక్షించి ఎన్‌సిల్‌(న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌) పేరిట ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థనొకదాన్ని కొలువు తీర్చారు. దానితో ఇన్‌ స్పేస్‌ జతకట్టి దశాబ్దాలుగా ఇస్రో ఒంటిచేత్తో నిభాయిస్తున్న విస్తృత కార్యకలాపాల వర్గీకరణ చేపడుతుందంటున్నారు. తద్వారా మునుపటికన్నా మిన్నగా పరిశోధన అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డి) కసరత్తులో ఇస్రో అధిక సమయాన్ని వనరుల్ని వెచ్చించగలదన్న అంచనా- వాస్తవిక కార్యాచరణలో ఎంతమేరకు నిజమవుతుందో చూడాలి!

రోదసీ బడ్జెట్​లో చైనాదే అధిపత్యం

తీవ్ర ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి అచంచల విశ్వాసంతో పాటవ పరీక్షలో స్వీయ సామర్థ్యాన్ని పదేపదే నిరూపించుకున్న ఇస్రో సంకల్పదీక్ష వంకపెట్టలేనిది. కొత్తగా ప్రైవేటు సంస్థలకు ఎర్రతివాచీ పరవడం ఇస్రో రెక్కలు విరవడమేనంటున్న విమర్శకులు స్పేస్‌ ఎక్స్‌ ఆవిర్భావ నేపథ్యాన్ని ప్రస్తావిస్తున్నారు. 'నాసా(అమెరికా రోదసి సంస్థ)' నిర్వాకాల పర్యవసానంగానే ఇలాన్‌ మస్క్‌ నేతృత్వంలో స్పేస్‌ ఎక్స్‌ పుట్టుకొచ్చిందని, ఇండియాలో అటువంటి వాతావరణం ఎక్కడుందన్నది వారి సూటిప్రశ్న. అగ్రరాజ్యం రోదసి బడ్జెట్‌(2,500 కోట్ల డాలర్లు)లో ఇంచుమించు మూడోవంతు చైనాది. అందులో మూడోవంతు వార్షిక కేటాయింపులతోనే ఇస్రో వరసగా అద్భుతాలు సృష్టిస్తున్నప్పుడు మార్పులెందుకన్న సందేహంలోనే సమాధానం దాగి ఉంది.

ఇస్రోకు మంచి తరుణమిదే..

భూరి బడ్జెట్‌ కలిగిన నాసాయే అంతర్జాతీయ రోదసి కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో వాణిజ్య కార్యకలాపాలకు నిరుడు తెరతీసింది. ఇప్పటికే అది 375కు పైగా అంతరిక్ష సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఉపగ్రహ ప్రయోగ రంగ విపణిలో యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, జపాన్‌కు చెందిన 'జాక్సా', ఫ్రెంచ్‌ సంస్థ 'ఏరియాన్‌ స్పేస్‌', పునర్వినియోగ సామర్థ్యం కలిగిన ఫాల్కన్‌ వాహక నౌకలతో 'స్పేస్‌ ఎక్స్‌'లకు దీటైన పోటీ ఇవ్వగల సామర్థ్యాన్ని ఇస్రో పుణికిపుచ్చుకోవాల్సి ఉంది. అంకుర సంస్థలు, విద్యార్థులు రూపొందించిన స్వల్ప పరిమాణంలోని ఉపగ్రహాల్ని ప్రయోగించడంలో సత్తా చాటుతున్న ఇస్రో- ఆరు, ఆరున్నర టన్నుల శ్రేణిలోనూ నెగ్గుకు రావాలి. మానవ సహిత ప్రయోగాలపై కన్నేసిన ఇస్రో విస్తృత వాణిజ్య అవకాశాల్నీ చురుగ్గా చేజిక్కించుకోవడానికి ప్రతిపాదిత పని విభజన దోహదపడాలి. అందుకనుగుణంగా విధివిధానాల్ని పరిపుష్టీకరించడంలో ప్రభుత్వం గెలిస్తేనే- జాతి ఖ్యాతి అంబరాన్ని చుంబిస్తుంది!

ఇదీ చదవండి: భద్రతను విస్మరించొద్దు - అసత్యాలు చెప్పొద్దు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.