ETV Bharat / opinion

TOKYO PARALYMPICS 2020: టోక్యో పారాలింపిక్స్​లో భారత నారీమణులు.. - టోక్యో పారాలింపిక్స్​లో 14మంది భారత అమ్మాయిలు

లక్ష్యం పట్ల సరైన అవగాహన, అనుకున్నది సాధించాలనే తపన ఉంటే చాలు.. విధి వక్రించినా మన లక్ష్య సాధనను ఎవరూ ఆపలేరని నిరూపించారు భారత​ నారీమణులు. శారీరకంగా లోపాలు ఉన్నా వాటిని లెక్క చేయలేదు. మానసికంగా ధైర్యాన్ని కూడదీసుకుని నచ్చిన రంగాన్ని ఎంచుకున్నారు. వారి లక్ష్య సాధనవైపు అడుగులేస్తున్నారు. అందుకే టోక్యో పారాలింపిక్స్​లో అర్హత సాధించి పతకాల కోసం పోటీపడుతున్న ఈ విధి విజేతల గురించి తెలుసుకుందాం.

TOKYO PARALYMPICS 2020
టోక్యో పారాలింపిక్స్ 2020
author img

By

Published : Aug 24, 2021, 10:53 AM IST

వైకల్యం ఉన్నంత మాత్రాన కలలకు కంచెలు వేసుకోవాలా? ప్రతికూల పరిస్థితుల్నే... విజయానికి సోపానాలుగా మార్చుకుని... ఆశలకు రెక్కలు తొడుక్కున్న వాళ్లే వీరంతా! నేటి నుంచి ప్రారంభం అవుతున్న టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత జట్టులో 14 మంది అమ్మాయిలున్నారు... ఒక్కొక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ... వారిలో కొందరు వీళ్లు...

సివిల్స్‌ రాసి..

నడుము కింద నుంచీ చచ్చుబడిపోయిన శరీరం. పైభాగంలోనూ సగం అవయవాలు పనిచేయవు ఏక్తా భ్యాన్‌కి. 19 ఏళ్లుగా చక్రాల కుర్చీకే అంకితమైన ఏక్తా బంగారు పతకం గెలవాలని పట్టుదలతో ఉంది..

రియాణాలోని హిస్సార్‌ ఏక్తా స్వస్థలం. 18 ఏళ్ల వయసులో ఓ కారు ప్రమాదంలో మరణం అంచుల వరకూ వెళ్లింది. మూడు సర్జరీలు.. తొమ్మిది నెలలు ఆసుపత్రికే పరిమితం అయ్యింది. ఏ అవయవమూ పని చేయకపోయినా అమ్మానాన్నల సాయంతో ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో డిగ్రీ చేసింది. నిరాశని తరిమికొట్టడానికి... సివిల్స్‌పై దృష్టి పెట్టి విజయం సాధించింది. పత్రికలు ఆమె గురించి గొప్పగా రాశాయి. ఆ ఇంటర్వ్యూలు చదివిన వాళ్లలో అమిత్‌ సరోహీ ఒకరు. ఆయన అర్జున అవార్డు అందుకున్న పారాలింపియన్‌. ఏక్తా పట్టుదలని గమనించి ఆయనే ఆమెకు కోచ్‌, మెంటర్‌గా మారాడు. ఆమెని క్లబ్‌ త్రూ ఈవెంట్‌లో మెరికలా తీర్చిదిద్దాడు. ‘అసిస్టెంట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌గా విధులు... క్లబ్‌త్రో డిస్కస్‌త్రోల్లో సాధన. చాలా కష్టమయ్యేది. వారాంతాల్లో దిల్లీ వెళ్లి ప్రత్యేక కోచింగ్‌ తీసుకొనేదాన్ని. ఎంత కష్టమైనా సాధించి చూపించాలనుకున్నా. ఆ పట్టుదలతోనే మూడేళ్లలో నేషనల్స్‌కి అర్హత సాధించా’ అనే ఏక్తా 2017లో లండన్‌లో వరల్డ్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ని గెల్చుకుంది. తర్వాత ఏషియన్‌ పారాగేమ్స్‌లో బంగారు పతకం గెలిచి నిరూపించింది.

నమ్మకాన్ని నిజం చేయాలనీ..

సరిగా పనిచేయని కాలు. చదువే ఆమెకున్న ఏకైక మార్గమన్నారంతా. ఆమెకేమో అంతకు మించి సాధించాలన్న తపన. ‘నువ్వేదైనా సాధించగలవు’ అన్న నాన్న నమ్మకం తోడైంది. ఫలితమే పారాలింపిక్స్‌లో పోటీపడుతోంది.

రుబీనా ఫ్రాన్సిస్‌ది మధ్యప్రదేశ్‌. గగన్‌ నారంగ్‌ షూటింగ్‌ అకాడెమీ గురించి తెలిసి, దానిలో చేరతానంది. తండ్రి మెకానిక్‌. కూతురి కోరికను కాదనలేక చేర్పించారు. గన్‌ కొనివ్వడానికి అప్పు చేశారు. ఆమెను అకాడెమీలో దింపి, తీసుకురావడానికి అయ్యే పెట్రోల్‌ ఖర్చు భరించలేక తరగతులు పూర్తయ్యే దాకా ఆయన బయట వేచి ఉండేవాడు. కుటుంబ పోషణ భారమై తల్లి ఓ ఆసుపత్రిలో ఉద్యోగంలో చేరింది. ఇదంతా చూస్తూ పెరిగిన రుబీనా మరింత పట్టుదలతో సాధన చేసేది. రెండేళ్లకే రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో రాణించింది. 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై పోటీపడింది. అది మొదలు... అంతర్జాతీయ పోటీల్లో 15 పతకాలను సాధించి, ఐదో ర్యాంకులో నిలిచింది. ప్రభుత్వం నుంచి కొంత సాయం అందడం మొదలైంది. ఈ ఏడాది మేలో కొవిడ్‌ సోకి, బాగా నీరసపడిపోయింది. నెలపాటు సాధనకే దూరమైంది. ఐదంటే ఐదు రోజుల సాధనతో పెరూ పారా స్పోర్ట్స్‌ కప్‌లో పాల్గొంది. 10 మీ. ఎయిర్‌ పిస్తోల్‌ విభాగంలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడమే కాక బంగారు పతకాన్నీ సాధించింది. అదే 22ఏళ్ల రుబీనా పారాలింపిక్స్‌కు అర్హత సాధించడంలోనూ సాయపడింది. ‘షూటింగ్‌ శక్తికి మించిన భారమైనా, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నాన్న వెనకడుగు వేయలేదు. ఇవన్నీ నాలో మానసిక సమస్యలకు దారి తీశాయి. కానీ కుటుంబం, కోచ్‌లు అండగా నిలిచారు. పతకం సాధించి వాళ్ల నమ్మకాన్ని నిజం చేయడమే లక్ష్యం’ అంటోంది రుబీనా.

కెరియర్‌ మార్చుకుని...

స్విమ్మింగ్‌ నుంచి కెరియర్‌ను రెండేళ్ల క్రితమే కెనోయింగ్‌కు మార్చుకుంది. అందుకే 2024 లండన్‌ పారాలింపిక్స్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొవిడ్‌ కారణంగా అయిన ఆలస్యం ప్రాచీ యాదవ్‌కు టోక్యోలో అర్హత సాధించే అవకాశం కల్పించింది.

ప్రాచీది గ్వాలియర్‌. ఈమెకు పుట్టుకతోనే 60% వైకల్యం. నడుము కింది భాగం పనిచేయదు. కానీ తండ్రి ప్రోత్సాహంతో ఏడో తరగతి నుంచి ఈత నేర్చుకుంది. తల్లి క్యాన్సర్‌తో 2003లో మరణించింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందారు. ముగ్గురు పిల్లలున్న కుటుంబంలో ప్రాచీ రెండో సంతానం. మధ్యతరగతి కుటుంబమే అయినా తండ్రి ఆమెను క్రీడలపరంగా ప్రోత్సహించాడు. పారా స్విమ్మర్‌గా ఛాంపియన్‌షిప్‌నూ గెల్చుకుంది. కానీ తన పొడవైన చేతులు కెనోయింగ్‌కు అనువుగా ఉంటాయన్న కోచ్‌ సలహాతో 2018లో కెరియర్‌ మార్చుకుంది. ఈమె కోసం కోచ్‌ ప్రత్యేకంగా పడవనీ తయారు చేయించాడు. ఈ కొద్దిసమయం పారాలింపిక్స్‌కు సరిపోవని 2024ను లక్ష్యంగా పెట్టుకుంది. కానీ కొవిడ్‌ కారణంగా పడిన వాయిదా ఈమె శిక్షణకు సాయపడింది. అలా టోక్యో పారాలింపిక్స్‌కు కయాకింగ్‌ అండ్‌ కెనోయింగ్‌కు ఎంపికైంది. అంతేకాదు.. దేశం నుంచి ఈ విభాగం నుంచి పోటీపడుతున్న ఏకైక, మొదటి మహిళా అథ్లెట్‌గానూ నిలిచింది.

అవని...అదరగొట్టేస్తుంది

‘వైకల్యాన్ని తలుచుకుని కుమిలిపోయే కంటే... నీ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని జీవితాన్ని గెలువు’’ అన్న నాన్న మాటలతోనే క్రీడల్లోకి వచ్చానంటుంది అవనీ లేఖరా. జైపురకి చెందిన ఈ పందొమ్మిదేళ్ల రైఫిల్‌ షూటర్‌ టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొంటున్న పిన్న వయస్కుల్లో ఒకరు.

అది 2012. అప్పటికి అవనికి పదేళ్లు. ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి ఆ అమ్మాయిని చక్రాల కుర్చీకే పరిమితమైంది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు...! అయినా ఫలితంలేదు. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు దొరికింది. ‘బాధను దిగమింగుకోవడం సులువు కాలేదు. మనసు మళ్లేందుకు ఏదైనా రంగంలో పట్టు సాధించాలని నిర్ణయించుకున్నా. అదే నాన్న సూచన కూడా. ఆయనోసారి ఆర్చరీ, షూటింగ్‌ రేంజ్‌లకు తీసుకెళ్లారు. అక్కడ మొదటిసారి రైఫిల్‌ని చేతితో తాకినప్పుడే దాంతో ప్రేమలో పడిపోయాను. నాలో స్ఫూర్తినింపడానికి ఆయన... అభినవ్‌ బింద్రా రాసిన ‘ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ’ పుస్తకం ఇచ్చారు. అది చదివాక సీరియస్‌గా సాధన ప్రారంభించా. ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అంటోంది అవని. గత కొన్నేళ్లుగా అవని సాధించిన విజయాలు ఆమె పట్టుదలకు నిదర్శనం. శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మూడు పతకాలు అందుకుంది. అప్పటికి ఆమెకో సొంత రైఫిల్‌ కూడా లేదు. కోచ్‌ దగ్గర అరువు తెచ్చుకుంది. 2017లో ఆన్‌ఐన్‌ఓలో జరిగిన పారా షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో రజతాన్ని అందుకుంది. కరోనా కారణంగా గతేడాదిగా ఫిజియోథెరపీ సెషన్‌లు ప్రభావితమైనా, సరైన శిక్షణా, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్‌కు సిద్ధమైంది.

ఇదీ చదవండి: ETV BHARAT EXCLUSIVE: "రాజకీయ అరంగేట్రాలకు అడ్డా.. ఉమ్మడి నల్గొండ గడ్డ"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.