ETV Bharat / opinion

జీవ నదులకు వ్యర్థాల ఉరి!

నదులు జీవనాధారం అంటారు. అయితే.. ఆ నదులే కలుషితమై పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. భారతీయులు పవిత్రంగా భావించే గంగానది పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకోవడం వల్ల.. ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఈ ఏడాది చివరి నాటికి ఈ పనులు పూర్తికావాలని నిర్దేశించుకున్నా.. సగం వరకైనా సాగలేదు. తెలుగు రాష్ట్రాల్లో గంగానదిగా భావించే కృష్ణా, గోదావరి పరిస్థితీ అధ్వానంగానే తయారైంది.

RIVERS POLLUTED WITH PLASTIC AND WASTAGES, GOVT NEED TO TAKE ACTIONS
జీవనదులకు వ్యర్థాల ఉరి!
author img

By

Published : Nov 5, 2020, 1:25 PM IST

దేశంలో దాదాపు 70 శాతం ఉపరితల జలాలు మనుషుల వినియోగానికి పనికి రావనేది కఠోర వాస్తవం. జీవ నదులు సైతం కాలుష్య కోరల్లో చిక్కుకుని పర్యావరణానికి పెనుముప్పుగా మారాయి. భారతీయులంతా పవిత్రంగా భావించే గంగానది పూర్తిగా కలుషితం కావడంతో మోదీ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ‘నమామి గంగే’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి ప్రక్షాళనకు నడుం కట్టింది. 2020 డిసెంబరు వరకు మొత్తంగా ప్రక్షాళన పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నా, 37 శాతం పనులే పూర్తయినట్లు జలశక్తి అభియాన్‌ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో గంగానది శుద్ధి కార్యక్రమం మరికొన్నేళ్లు కొనసాగాల్సిందే. గంగకు ఏమాత్రం తీసిపోని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న నదులు కూడా ప్రమాదకర స్థాయిలో కలుషితం అవుతున్నాయన్నది నిష్ఠుర సత్యం. తాజాగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ గుండా ప్రవహిస్తున్న మూసీ నదిని ఏడాదిలో ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.

సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను పెంచితేనే..

ఇప్పటి వరకు మూసీ ప్రక్షాళన కోసం చేపట్టిన చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసి, ఇక నుంచైనా పర్యవేక్షణ పక్కాగా ఉండాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ విలాస్‌ అఫ్జల్‌ పుర్కర్‌ నేతృత్వంలో కమిటీని సైతం నియమించింది. కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ ఒకప్పుడు హైదరాబాద్‌ దాహార్తిని తీర్చే అపర భాగీరథి స్థాయి నుంచి ఇప్పుడు మురికినీటిని తరలించే నాలాగా మారింది. పారిశ్రామికీకరణ వల్ల శుద్ధి చేయని జలాలు, పరిశ్రమల వ్యర్థాలన్నీ మూసీలో కలపడంతో నది రూపురేఖలే మారిపోయాయి. ప్రస్తుతం 1450 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే)వరకు మురుగు నీరు మూసీలో కలుస్తుండగా, మురుగు నీటి శుద్ధి కేంద్రాల సామర్థ్యం కేవలం 725 ఎంఎల్‌డీ మాత్రమే. మూసీ ప్రక్షాళన చేయాలంటే అదనంగా సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను గణనీయంగా పెంచాల్సిందే. ఇప్పటికే దేశంలోనే అత్యంత కలుషితమైన నాలుగో నదిగా మూసీ అవతరించింది.

ప్రమాదకర స్థాయిలో...

తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ప్రధాన నదులను ప్రక్షాళించాల్సిన సమయం ఆసన్నమైంది. 1400 కి.మీ.పైగా పొడవుతో దేశంలోనే రెండో అత్యంత పొడవైన గోదావరి, నాలుగో అత్యంత పొడవైన కృష్ణా నది- కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. వీటితోపాటు మంజీర, పెన్నా, తుంగభద్ర, నాగావళి లాంటి నదులు, ఉపనదులు పోనుపోను తీవ్ర కాలుష్యమయమవుతున్నాయి. గంగానది ప్రక్షాళనకు కొనసాగింపుగా కేంద్రం దేశవ్యాప్తంగా మరిన్ని నదులను ప్రక్షాళించాలనే ఆలోచనతో గత ఏడాది ‘నదులను రక్షిద్దాం’ (సేవ్‌ రివర్స్‌) నినాదంతో 13 నదుల జాబితాను సిద్ధం చేసింది. అందులో తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయనులైన గోదావరి, కృష్ణా నదులూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోని కాలుష్య నియంత్రణ మండళ్లు నదుల్లోని వివిధ ప్రాంతాల్లో నమూనాలు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించినప్పుడు గోదావరి, కృష్ణా రెండు నదుల్లోని నీరు 'సీ' కేటగిరిలోకి రావడం ఎంతో ఆందోళన కలిగించే అంశం. నీరు ఏ, బీ కేటగిరీల్లో ఉన్నప్పుడు వాటిని శుద్ధి చేసుకొని తాగేందుకు వీలుంటుంది. 'సీ' కేటగిరీ అంటే స్నానం చేసేందుకూ పనికిరాని స్థితికి చేరినట్లు భావించాలి. 'డి', 'ఈ' కేటగిరీలంటే జల చరాలు కూడా ఆ నీటిలో బతకలేని దుర్భర స్థితికి చేరినట్లు పరిగణించాలి.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి కొన్ని నెలలుగా రాష్ట్రంలోని గోదావరి, కృష్ణ, నాగావళి, పెన్నా, తుంగభద్ర, వంశధార తదితర నదుల నీటి నమూనాలు సేకరించి విశ్లేషించింది. విజయవాడ నగరం సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో హానికారకమైన కోలిఫామ్‌ బ్యాక్టీరియా శాతం అత్యధికంగా ఉందని స్పష్టమైంది. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రధాన పట్టణాల్లో అనేక పరిశ్రమలు రసాయన వ్యర్థాలను సరైన శుద్ధి చేయకుండా కలిపేస్తున్నా కాలుష్య నియంత్రణ మండళ్లు ప్రేక్షక పాత్రే వహిస్తున్నాయి. ఈ నదుల పరిస్థితిపై గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అనేక సూచనలు చేసిన దరిమిలా అక్కడక్కడా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ)లు నిర్మించి కొంతమేర నీటి శుద్ధికి రాష్ట్రాలు నడుం కట్టాయి. తెలంగాణలో కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న ఎనిమిది నదుల పరిరక్షణ కోసం ఇప్పటికే కమిటీ ఏర్పాటైనా, కార్యాచరణ అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.

విభిన్న వ్యూహాలతో...

ఇప్పుడు సీ కేటగిరీలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల నదుల ప్రక్షాళన చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టకుంటే భవిష్యత్తులో మరింత కలుషితమై డీ, ఈ కేటగిరీల్లోకి వెళ్లి మూసీ తరహాలో పరిణమించే ప్రమాదం పొంచే ఉంది. తీరాల్లో ఉన్న అనేక పట్టణాలు, నగరాల్లోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా నదుల్లోకి వదిలేయడం, అనేక పరిశ్రమల నుంచి వెలువడే ప్రాణాంతకమైన రసాయన వ్యర్థాలను నదుల్లో కలిపేయడంతో జీవజలం హాలాహలంగా మారుతోంది. నదులను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలంటే- ఎక్కడెక్కడ మురుగు నీరు కలుస్తుందో గుర్తించి, శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఒకటైతే, నదుల ఉపరితలంపై పేరుకుపోయిన చెత్తాచెదారాలను పూర్తిగా శుభ్రం చేసి ఘన వ్యర్థాలను తొలగించి జలచరాలు స్వేచ్ఛగా తిరుగాడేలా మార్చాలి.

మొక్కలు పెంచాలి..

పుష్కరాలు, కుంభమేళాల్లాంటి వేడుకల సమయంలో వ్యర్థాలు నీటిలో కలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు నదులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి. పరీవాహక ప్రాంతాలు ఆక్రమణకు గురై కలుషితం కాకుండా తీరాలకు ఇరువైపులా విరివిగా మొక్కలు పెంచి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలి. ఈ బృహత్‌ కార్యంలో జన భాగస్వామ్యమూ అవసరం. పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవాలి. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నదుల ప్రక్షాళన కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళితేనే మన పవిత్ర నదులు సజీవంగా ప్రవహిస్తాయి.

'లాక్‌డౌన్‌'లో పెరిగిన నీటి నాణ్యత

ప్రతి రోజూ దేశవ్యాప్తంగా కనీసం నాలుగుకోట్ల లీటర్ల కలుషిత జలాన్ని నదులు, ఇతర నీటి వనరుల్లోకి వదులుతున్నారు. ఇది మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక వ్యవస్థను సైతం అతలాకుతలం చేస్తున్నదని, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాల్లో జాతీయాదాయం సగానికి సగం తగ్గుతోందని, వ్యవసాయ పంటల దిగుబడుల్లో 16 శాతం కోత పడుతున్నదని ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీతిఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 60 కోట్ల జనాభా నీటి ఎద్దడితో సతమతమవుతోంది. మూడో వంతు ఇళ్లకు పరిసరాల్లో సరైన తాగునీటి సౌకర్యం కొరవడింది. లాక్‌డౌన్‌ సమయంలో చాలామేర మానవ కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యంలో- కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అనేక నదుల్లో కాలుష్య శాతాన్ని గణించారు. బ్రహ్మపుత్ర, కావేరి, గోదావరి, యమున, తపతి తదితర నదుల నీటి నాణ్యత పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది శుభ సంకేతమే. ఈ సమయంలో గృహాల నుంచి వెలువడే వ్యర్థాలు నదుల్లో కలిసినా, పారిశ్రామిక వ్యర్థాల విడుదల నిలిచిపోవడంతో నీటి నాణ్యత మెరుగైంది.

(జి.పాండురంగ శర్మ)

ఇదీ చదవండి: 'అయోధ్యలో నిర్మాణాలకు మీరూ సలహాలు ఇవ్వొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.