ETV Bharat / opinion

ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి తూట్లు

కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో 'ఇసుక' బంగారం చందంగా మారింది. వేగంగా విస్తరిస్తోన్న కాంక్రీట్​ జంగిల్​లు ఇసుకకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ఈ క్రమంలో తవ్వకాలు పరిధిని మించి చేయడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోంది.

Problems to the environment with dangerous level sand excavations
ప్రమాద స్థాయి ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి తూట్లు
author img

By

Published : Nov 12, 2020, 7:33 AM IST

దేశంలో నదీ పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో అడ్డగోలుగా సాగుతున్న ఇసుక తవ్వకాలు- పర్యావరణ వ్యవస్థకు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్న తవ్వకాలను నియంత్రించడం, విపరీతంగా పెరుగుతున్న డిమాండుకు తగినట్లుగా ఇసుకను సమకూర్చడం ప్రభుత్వ వ్యవస్థలకు కత్తిమీద సాములా మారింది.

ఏపీ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఇసుక తవ్వకాలు, తరలింపు, విక్రయాల కోసం ఒక ప్రత్యేక విధానాన్ని అమలులోకి తెచ్చింది. అది ప్రభుత్వ వర్గాలకు, కొనుగోలుదారులకు సంతృప్తి కలిగించకపోవడం వల్ల మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇసుక రేవుల్లో తవ్వకాల ప్రక్రియ చేపట్టేందుకు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థతోపాటు పలు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం గమనార్హం.

మరోపక్క వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న ఇసుక తవ్వకాలను తరచూ న్యాయస్థానాలు ఆక్షేపించడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేటు లీజుదార్ల అజమాయిషీలో తవ్వకాలు జరిగే రాష్ట్రాల్లో మార్గదర్శకాలు అమలు కావడం లేదని, ఇసుక మాఫియా రాజ్యమేలుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఎన్నో వ్యవస్థలకు హాని

దేశంలో గత ఏడు దశాబ్దాలలో కాంక్రీటు నిర్మాణాల కారణంగా ఇసుక వినియోగం పెరిగింది. నదులు, జలాశయాలు, సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నదులు, జలాశయాల ప్రాంతాల్లో లభించే ఇసుకను భవన నిర్మాణాల్లో వినియోగిస్తుండగా- సముద్ర తీరాల్లో వెలికితీసే ఇసుకలో జిర్కోనియం, టైటానియం, థోరియం వంటి పరిశ్రమల్లో వినియోగించే విలువైన ఖనిజ వనరులు ఉంటాయి.

ఇసుకలో లభించే సిలికాను గ్లాసు తయారీలో వాడతారు. పెరుగుతున్న అవసరాలకు తగినట్లుగా ప్రత్యామ్నాయ పర్యావరణ హితకరమైన నిర్మాణాలపై అవగాహన పెరగడంలేదు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా ఇసుకకు ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై ప్రభుత్వ వ్యవస్థలు ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదు. దీంతో ఇసుక వనరులపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది.

దశాబ్దాల తరబడి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చిన్న, మధ్య స్థాయి నదీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి. మితిమీరి సాగించే ప్రకృతి వనరుల వెలికితీత పర్యావరణ వ్యవస్థలకు, జీవవైవిధ్యానికి అంతులేని నష్టం చేకూరుస్తుంది. ఇసుక వంటి సహజ వనరుల తవ్వకాల్లో సుస్థిర పద్ధతిలో పొదుపు పాటించకపోతే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది- పశ్చిమ, తూర్పు కనుమల్లో కొన్నేళ్లుగా తలెత్తిన వరదలు కలిగించిన నష్టంతో తెలుసుకోవచ్చు.

వరదల వేళ జనావాసాలపై జలం విరుచుకుపడటానికి ప్రధాన కారణం- ఇసుక విచ్చలవిడి తవ్వకాల మూలంగా నదుల ప్రవాహ స్థితిగతులు మారిపోవడమేనని అనేక అధ్యయనాలు తేల్చి చెప్పాయి. కొన్ని ప్రాంతాల్లో అడుగడుగునా పాతుకుపోయిన అవినీతి, అక్రమాలు, రాజకీయ ప్రాబల్యం... ఇసుక విచ్చలవిడి తవ్వకాలకు ఊతమిస్తున్నాయి. సముద్ర ప్రాంతాల్లో సాగే ఇసుక తవ్వకాల వల్ల ఆలివ్‌ రిడ్లె తాబేళ్లు వంటి అరుదైన జీవులు, పగడపు దిబ్బలు, సున్నితమైన తీర వ్యవస్థల మనుగడ ప్రమాదంలో పడింది. సుందరమైన పర్యాటక ప్రాంతాల రూపురేఖలు మారిపోయి ఆదాయం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.

హరిత మార్గదర్శకాలతో నష్టం భర్తీ

‘గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం’ ప్రకారం ఇసుక చిన్నతరహా ఖనిజాల జాబితాలో ఉంది. సుస్థిర ప్రాతిపదికన ఇసుక తవ్వకాల కోసం నియమాలు రూపొందించి అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

దేశంలోని యమున, గంగ, కావేరి, గోదావరి, కృష్ణలతో పాటు అనేక చిన్న,పెద్ద నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణ కోసం సర్వోన్నత న్యాయస్థానం, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. అయిదు హెక్టార్లలోపు విస్తీర్ణం దాటితే నిర్దేశిత పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతులు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అయిదేళ్ల క్రితం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

ఈ ఆదేశాలపై స్పందించిన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సుస్థిర ఇసుక తవ్వకాలు, యాజమాన్య పద్ధతుల నిర్వహణ కోసం 2016లో రాష్ట్రాలు అమలు చేసే విధంగా మార్గదర్శకాల నమూనా అందుబాటులోకి తెచ్చింది. సిబ్బంది కొరత, పర్యవేక్షణ క్లిష్టతరం కావడంతో ఈ మార్గదర్శకాల అమలులో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా ఎలా అమలవుతున్నాయనే అంశంపై జస్టిస్‌ ఎస్వీఎస్‌ రాఠోడ్‌ నేతృత్వంలోని పర్యవేక్షణ కమిటీ ఈ ఏడాది ఆగస్టు 13న ఒక నివేదికను ట్రైబ్యునల్‌కు సమర్పించింది.

గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధించడంలో వైఫల్యాలను వెల్లడించింది. ఇసుక తవ్వకాల కోసం ‘జిల్లా సర్వే నివేదిక’లను రూపొందించాలని సిఫారసు చేసింది.

ప్రత్యామ్నాయాలకు ప్రోత్సాహం

రాజకీయ నేతల జోక్యం, ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక తవ్వకాల మూలంగా ప్రభుత్వ ఆదాయానికి ఏళ్ల తరబడి గండిపడుతోంది. ఏపీతోపాటు కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ అజమాయిషీలో తవ్వకాలు చేపట్టి, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లతో నియంత్రణను పటిష్ఠం చేసే ప్రయత్నాలు చేపట్టాయి. అవసరాలకు తగిన రీతిలో ఇసుకను సమకూర్చడం, క్షేత్రస్థాయి పరిస్థితులు, పర్యవేక్షణ లోపం మూలంగా ఆశించిన ఫలితాల సాధనలో వెనకబడుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుకను ఆదాయ వనరుగా కాకుండా, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేదిగా భావించి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రెవిన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖలతో ముడివడి ఉన్న ఇసుక తవ్వకాల్లో ఆయా విభాగాల సిబ్బంది జవాబుదారీగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలి.

రాతి ఇసుక, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తయ్యే బూడిద, నిర్మాణ వ్యర్థాలు వంటి ప్రత్యామ్నాయ వనరుల వాడకంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఇసుక వనరులపై ఒత్తిడి తగ్గేలా కార్యాచరణను ముమ్మరం చేయాలి. రాయితీలతో ప్రత్యామ్నాయ యూనిట్ల ఏర్పాటుకు గ్రామీణ యువతకు ప్రోత్సాహం అందించాలి. నదీ పరీవాహక ప్రాంతాలు, అటవీ ప్రాంతాల పరిరక్షణలో పౌరసమాజం భాగస్వామ్యాన్ని పెంచి సుస్థిర ప్రాతిపదికన ఇసుక తవ్వకాలు సాగేలా చూడాలి.

-గంజివరపు శ్రీనివాస్​, అటవీ పర్యావరణ నిపుణులు

ఇదీ చూడండి:ప్రమాదంలో పర్యావరణం.. కాగితాల్లోనే నిబంధనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.