ETV Bharat / opinion

మానవ హక్కులపై దాడి- నిరసనలపై ఉక్కు పాదం - మానవ హక్కుల ఉల్లంఘన

రైతుల ఉద్యమంపై కేంద్ర వైఖరిని ప్రశ్నించిన విదేశీయులకు.. అది దేశ అంతర్గత విషయం అంటూ ప్రభుత్వం జవాబు ఇచ్చింది. ఎర్రకోట ఘటనను తప్పుపట్టిన కేంద్రం స్వాతంత్య్రోద్యమం సమయంలో జరిగిన చౌరీచౌరా ఘటనను సమర్థించడంపై విమర్శలను ఎదుర్కొంటోంది. మరి ప్రభుత్వ వైఖరిపై సామాజిక కార్యకర్తలు ఏమంటున్నారు?

human rights
మానవ హక్కులపై దాడి
author img

By

Published : Feb 26, 2021, 7:37 AM IST

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఒక పక్క రైతుల ఉద్యమం సాగుతుండగానే, ప్రభుత్వం స్వాతంత్య్రోద్యమ కాలంనాటి చౌరీచౌరా సంఘటనకు సంబంధించిన వేడుకల్ని జరిపింది. ఆ పోరాటంలో పాల్గొన్న స్వతంత్ర యోధుల కుటుంబాలను కీర్తించింది. స్వతంత్ర పోరాట కాలంలో మహాత్మాగాంధీ సారథ్యంలో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆందోళనకారులపై కాల్పులు జరిగాయి. అందుకు ప్రతిగా, ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ సమీపంలో చౌరీచౌరా పోలీసుస్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పు పెట్టడం వల్ల 22 మంది పోలీసులు మరణించారు. ఆ హింసాత్మక ఘటనతో గాంధీజీ చలించిపోయారు. మొత్తం ఉద్యమాన్నే ఆపేశారు. పోలీసులతోపాటు ఠాణాను తగలబెట్టిన ఘటనలో పాలుపంచుకున్న ప్రజల మనోభావాలు అర్థం చేసుకోదగ్గవే కానీ, అవి సమర్థనీయం కాదు.

నాటి ఘటనలో పాలుపంచుకున్న వారిలో 19 మందిని ఉరితీయగా, 110 మందికి జీవిత ఖైదు పడింది. తాజాగా భాజపా ఆనాటి ఘటనలో పాలుపంచుకున్నవారి బంధువులను గౌరవించడం- మహాత్మాగాంధీ విజ్ఞతను ప్రశ్నించడమే కాకుండా, హింసను సమర్థించడమే అవుతుంది. మరోవైపు, ఇటీవల గణతంత్ర దినం రోజున చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను ప్రభుత్వం ఖండించింది. దీనిద్వారా ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రమేయం ఉన్న ముఖ్యమైన ఉదంతాలను విస్మరిస్తూ, ఎంచుకొన్న కొన్ని సంఘటనలనే కీర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రకృతి విపత్తులు

వాతావరణ మార్పుల ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్‌ రైతుల పోరాటానికి సంఘీభావం తెలపడంపై ప్రభుత్వం నుంచి, దాని మద్దతుదారులు, అనుకూల మీడియా నుంచి తీవ్రస్థాయిలో ప్రతిస్పందన ఎదురైంది. దీని తరవాత రోజుల వ్యవధిలోనే ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విపత్తు సంభవించింది. చమోలిలో కొండచరియలు విరిగిపడటం, రిషిగంగ, ధౌలిగంగ నదుల్లో మెరుపు వరదలు సంభవించడంవల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తపోవన్‌ విష్ణుగఢ్‌, రిషిగంగ జలవిద్యుత్తు ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఈ సందర్భంగా- దేశీయ ఉద్యమకారుడు స్వామి జ్ఞాన స్వరూప్‌ సనంద్‌గా పేర్కొనే ప్రొఫెసర్‌ జి.డి.అగ్రవాల్‌ 112 రోజులపాటు ఆమరణ దీక్షతో 2018లో ప్రాణాలు విడిచిన ఘటనను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.

గంగా నది ఎగువ భాగంలో అన్ని జల విద్యుత్తు ప్రాజెక్టుల పనుల్నీ నిలిపివేయాలని డిమాండు చేస్తూ ఆయన దీక్ష చేపట్టారు. ఆయన మరణం తరవాత యువ సన్యాసి బ్రహ్మచారి ఆత్మబోధానంద మరో సుదీర్ఘ నిరాహార దీక్ష చేపట్టారు. స్వామి శివానంద్‌ మూడు జలవిద్యుత్తు ప్రాజెక్టుల పనుల్ని రద్దుచేయాలని డిమాండు చేశారు. అందులో ఒకటి తపోవన్‌ విష్ణుగఢ్‌. తాను నిరాహార దీక్ష కారణంగా మరణిస్తే, ప్రధానమంత్రిదే బాధ్యత అంటూ ప్రొఫెసర్‌ అగ్రవాల్‌ గతంలోనే హెచ్చరించారు. ప్రభుత్వం ఆ హెచ్చరికల్ని వినకపోయినా, ఆ ప్రాజెక్టును ఆపేయాలని ప్రకృతే నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమకారులు నొక్కి వక్కాణించే అభివృద్ధి పరమైన అంశాలపై ప్రభుత్వం శ్రద్ధ పెడితే మేలు.

ఉద్యమం అంతర్గత విషయం కాదు..

వాతావరణ మార్పులు అనేది ఎలాగైతే కేవలం ఒక్క దేశానికే పరిమితమయ్యే అంశం కాదో.. రైతుల ఉద్యమం కూడా దేశ అంతర్గత వ్యవహారం కాదు. మానవ హక్కులు అనేవి అంతర్జాతీయ అంశం. వాటి ఉల్లంఘన జరిగినప్పుడు ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ప్రపంచంలోని ఏ మూలనుంచైనా విమర్శలు చేయవచ్చు. అంతేకాకుండా, వ్యవసాయం అనేది వాతావరణ మార్పులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే అంశం. పంట వ్యర్థాల దహనం కాలుష్యానికి ప్రధాన కారణం. దీనికి సరైన ప్రత్యామ్నాయాన్ని వెదకాల్సి ఉంది. అదేవిధంగా, మూడు సాగు చట్టాల పర్యవసాన పరిణామం వ్యవసాయ రంగం కార్పొరేటీకరణే. దీనివల్ల మరింతగా కర్బన ఉద్గారాలు విడుదలై వాతావరణంపై తీవ్రస్థాయి దుష్ఫలితాలను కనబరుస్తాయి. ఇవి రైతులను బలహీనపరచి దెబ్బతీస్తాయి.

- సందీప్‌ పాండే (రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)

ఇదీ చదవండి : నేడు భారత్​ బంద్- నిరసనలో 40 వేల వాణిజ్య సంఘాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.