ETV Bharat / opinion

దేశ ప్రగతికి గ్రహణం.. ప్రజాస్వామ్యానికి ఏమవుతోంది? - గుజరాత్​ రాజకీయాలు

రాజ్యసభ రేసులో తమ అభ్యర్థుల్ని గెలిపించే గుర్రాల వేట జోరుగా సాగుతోంది. ప్రజాస్వామ్యం అక్షరాలా సంతలో సరకుగా మారి బావురుమంటోంది. తాజాగా గుజరాత్‌, రాజస్థాన్ల రాజకీయ ముఖచిత్రం చెబుతున్న చేదు వాస్తవమిది! శాసనసభ్యులే ఓటర్లుగా రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాల దృష్ట్యా ఎవరికెన్ని సీట్లు రాబోతున్నాయన్నది ముందే తెలిసిపోతుంది. అయితే తన చేతికి మట్టి అంటకుండా పనులు చక్కబెట్టి పెద్ద గీతను చిన్నగీతగా మార్చి ప్రజాభిమతాన్ని ఏమార్చే రాజకీయం ఆ మధ్య కర్ణాటకలో, ఇటీవల మధ్యప్రదేశ్‌లో కళ్లకు కట్టగా- ఇప్పుడు, గుజరాత్‌, రాజస్థాన్ల వంతు!

Mla's tend to resign amid rajya sabha elections
ప్రజాస్వామ్యానికి రాజీనామా
author img

By

Published : Jun 14, 2020, 9:50 AM IST

నీతి నిబద్ధతల్లేనివారి ఆఖరి విడిది రాజకీయాలేనన్న జార్జి బెర్నార్డ్‌ షా మాటలకూ కాలదోషం పట్టింది. ఏళ్ల తరబడి విడిది రాజకీయాల ఉరవడి ఎలుగెత్తి చాటుతున్న నిజం- అవినీతి భ్రష్టులందరికీ పాలిటిక్సే తొలి మజిలీ! ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 29ఏ సెక్షన్‌ అనుసారం రాజకీయ పక్షాలన్నీ భారత రాజ్యాంగానికి విధేయత చాటాలి. ప్రజాక్షేత్రంలో మెజారిటీ సీట్లు గెలుచుకొచ్చిన పార్టీలు రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామని పదవీ ప్రమాణం చెయ్యాలి. ఆ విధేయత, ఈ రాజ్యాంగబద్ధత రెండూ నేతిబీరలో నెయ్యిచందం కాబట్టే- రాజ్యసభ రేసులో తమ అభ్యర్థుల్ని గెలిపించే గుర్రాల వేట జోరుగా సాగుతోంది. ప్రజాస్వామ్యం అక్షరాలా సంతలో సరకుగా మారి బావురుమంటోంది. తాజాగా గుజరాత్‌, రాజస్థాన్ల రాజకీయ ముఖచిత్రం చెబుతున్న చేదు వాస్తవమిది!

'అధికారంలో కొనసాగడానికి అవినీతిని ఆశ్రయించం, అనైతిక పద్ధతులూ అవలంబించం. మా ఆత్మల్ని అమ్ముకోవాలనో, తాకట్టు పెట్టాలనో మేము అనుకోవడం లేదు'- ఇరవై నాలుగేళ్ల క్రితం పదమూడునాళ్ల ప్రధానిగా పార్లమెంటులో చేసిన చారిత్రక ప్రసంగంలో వాజపేయీ గుండెలోతుల్లోనుంచి ఉబికివచ్చిన సమున్నతాదర్శ భావఝరి అది. 'దశాబ్దాలుగా మేము నిబద్ధంగా రాజకీయ క్రీడ ఆడుతున్నా, ప్రత్యర్థులు తొండాట ఆడుతుంటే ఏం చేయాలి?' అని కొన్ని సందర్భాల్లో ఆయన నిర్వేదం చెందినా- భిన్నమైన పార్టీగా కమల దళానికి ఆదర్శం మప్పడంలో వాజపేయీ, ఆడ్వాణీల పరిశ్రమ ఎనలేనిది. సారథ్య స్థానాల్లో తరాలు మారేసరికి విలువలతో 'రాజీ'కీయాలు ముమ్మరించాయి. ప్రాథమిక సభ్యత్వాల ప్రాతిపదికన ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా సొంతంగా 12 రాష్ట్రాల్లో, భాగస్వామ్య పక్షాలతో కలిసి మరో ఆరుచోట్ల అధికారం నెరపుతోంది. ఓడలు బండ్లయిన తీరుగా కాంగ్రెస్‌ నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టి మరో రెండింట యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి చక్రం తిప్పుతోంది. ఏఐఏడీఎమ్‌కే, తెరాస, వైఎస్‌ఆర్‌సీపీ, బిజెడీ, తృణమూల్‌, లఫె్ట్‌ పార్టీల వంటివి ఆరు రాష్ట్రాల్లో పాగా వేసినా సరైన ప్రతిపక్షం లేని లోటు ప్రజాస్వామ్యాన్ని కదలబారుస్తూనే ఉంది. తన చేతికి మట్టి అంటకుండా పనులు చక్కబెట్టి పెద్ద గీతను చిన్నగీతగా మార్చి ప్రజాభిమతాన్ని ఏమార్చే రాజకీయం ఆ మధ్య కర్ణాటకలో, ఇటీవల మధ్యప్రదేశ్‌లో కళ్లకు కట్టగా- ఇప్పుడు, గుజరాత్‌, రాజస్థాన్ల వంతు!

శాసనసభ్యులే ఓటర్లుగా రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీల బలాబలాల దృష్ట్యా ఎవరికెన్ని సీట్లు రాబోతున్నాయన్నది ముందే తెలిసిపోతుంది. ఈ నెల 19న 24 సీట్లకు జరిగే ఎన్నికల్లో 18 కొవిడ్‌ ఆందోళనల నేపథ్యంలో మొన్న మార్చిలో వాయిదా పడ్డాయి. ముఖ్యమంత్రి పదవి, పీసీసీ పీఠం, కడకు రాజ్యసభ సీటూ దక్కకపోవడంతో కుపితుడైన జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయించి కమలం గూటికి చేరడంతో మొన్న మార్చిలో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ సర్కారు కూలి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం కొలువుతీరింది. పాలకపక్ష ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం ద్వారా సర్కారు మెజారిటీని కోసేసి కోటలో తాను పాగా వేయడంలో రాటుతేలిపోయిన భాజపా- విపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను మరింత బలహీనపరచేందుకు గుజరాత్‌లో అదే వ్యూహం పన్నుతోంది. 2017 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాలు 77 అయినా క్రమానుగత రాజీనామాల దరిమిలా ఆ బలిమి నేడు అరవై అయిదే. తొలి ప్రాథమ్య ఓట్లు 68 వస్తేనే ఇద్దరిని రాజ్యసభకు పంపించగల పరిస్థితుల్లో కాంగ్రెస్‌ అవకాశాలను నీరుగార్చడమే లక్ష్యంగా ఇటీవల రాజీనామాలు చోటుచేసుకొన్నాయి. ప్రలోభాల వల నుంచి తక్కిన వారినైనా కాచుకోవాలని ఎమ్మెల్యేల విడిదిని రాజస్థాన్‌కు మారిస్తే అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ముంత పొగపెట్టేలా సాగుతున్న రాజకీయం- నిశ్చేష్టపరుస్తోంది. 'కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్'’ అంటూ ఎన్నికల వేళ కమలనాథులు నినదించారంటే- ఆ పార్టీ దుష్పరిపాలన పద్ధతులను ప్రజల దృష్టికి తెచ్చే క్రమంలో అలా చేశారనుకోవచ్ఛు హస్తం పార్టీకే ప్రజలు పట్టం కట్టిన చోటా పట్టుబట్టి ప్రభుత్వాన్ని దిగలాగే ధోరణులు ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలి పెట్టు!

ఎన్నికలు ఏవన్నదానితో నిమిత్తం లేకుండా పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా వాటిని భ్రష్టు పట్టించడంలో పార్టీలన్నింటిదీ తిలాపాపం తలా పిడికెడు. పార్టీ ఆదేశాల్ని తుంగలో తొక్కి కాసుల కక్కుర్తితో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడే నైచ్యం మూడు దశాబ్దాల క్రితమే ఊడలు దిగింది. 1988లో కర్ణాటకలో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యుల చేత క్రాస్‌ ఓటింగ్‌ చేయించడానికి జనతా పార్టీ నేతలు చెరో రూ.75 వేలు ముట్టజెప్పారని అప్పటి ప్రతిపక్ష నేత ఆరోపించగా- ఆ లక్షన్నర సొత్తునూ సర్కారు ఖాతాలో జమచేయించాలని నాటి సభాపతి ఆదేశించారు. 1992 జూన్‌ బిహార్‌ రాజ్యసభ ఎన్నికల్లో అక్రమాలు విక్రమించాయని దర్యాప్తు బృందం వెల్లడించగా దీటుగా స్పందించిన ఈసీ, ఆ ఎన్నికల్ని రద్దు చేసింది. రాజ్యసభ సీటు వందకోట్లు పలుకుతోందన్న మాన్య ఎంపీ ఒప్పుకోలు ధన రాజకీయ విష పరిష్వంగం ఎంత గాఢంగా పెనవడిందో వెల్లడిస్తోంది. విశేషం ఏమిటంటే, క్రాస్‌ ఓటింగ్‌ జాడ్యాన్ని తుదముట్టించడానికంటూ రాజ్యసభ ఎన్నికల్లో బహిరంగ ఓటింగ్‌ ప్రక్రియకు బాటలు పరిచింది వాజపేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వమే. నేడు అదే పార్టీ రాజీనామాల ముసుగులో ఫిరాయింపులకు లాకులెత్తి బలాబలాల తరాజును తనకు అనుకూలంగా మార్చుకోవడం- అప్రజాస్వామికమే!

అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతాలతో వ్యవస్థాగతంగా పుచ్చి, పార్టీ పునాదులు విచ్చిన కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కమలం పార్టీ పురుడు పోసుకుంది. అధికారం కోసం రాజకీయాలను ఆదర్శం కోసం రాజకీయాలుగా, అవకాశవాద రాజకీయాలను సైద్ధాంతిక కట్టుబాటు రాజకీయాలుగా, మోసపూరిత రాజకీయాలను శీలవర్తనం కల రాజకీయాలుగా మార్చాలన్నది తమ సంకల్పమని తొలినాడే వాజపేయీ ప్రకటించారు. ఆ తొలినాటి ఆదర్శాన్ని ఆచరణలోకి తీసుకురాగల సామర్థ్యం కమలం పార్టీకి నేడు ఉందనడంలో సందేహం లేదు. భ్రష్టుపట్టిన రాజకీయమే రాహువుగా మారి దేశ ప్రగతికి గ్రహణం పట్టిస్తున్న వేళ- ఆ తిమిరంపై సమరం చేయగల స్థితిలో ఉన్న భాజపా శీలవర్తన రాజకీయాలకు పాదుచేస్తే, దేశ భవిత సముజ్జ్వలమవుతుంది. మహాత్మాగాంధీ చెప్పిన ఏడు మహా పాపాల్లో సిద్ధాంతరహిత రాజకీయం ఒకటి. శేషన్‌ చెప్పిన దశ మహాపాతకాల నడుమ బందీ అయిన ఎన్నికల వ్యవస్థకు స్వేచ్ఛ ప్రసాదించి, విలువల కోసం, సమగ్ర వికాసం కోసం రాజకీయాల్ని ప్రక్షాళించగలిగిన స్థితిలో ఉండీ- అధికార లాలసకే లొంగిపోతే భాజపా విభిన్న పార్టీ ఎలా అవుతుంది? దేశ ప్రజాస్వామ్యం ఏమవుతుంది?

- పర్వతం మూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.