ETV Bharat / opinion

దీర్ఘాయువులో 'ప్రాణవాయువు' కీలకపాత్ర - ప్రాణవాయువుతో దీర్ఘాయువు

ప్రపంచ మహమ్మారిపై ఆరునెలలుగా ఎడతెరపి లేకుండా పోరాటం కొనసాగుతోంది. ఇందుకోసం లాక్​డౌన్​ను ఆయుధంగా ఎంచుకొంది భారత్​. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. ఈ పరిణామాలతోనే దేశంలో వైరస్​ కేసులు, మరణాలు అంతకంతకూ విజృంభిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాణవాయువునందించే వెంటిలేటర్ల సమస్య ఎదురవుతోంది.

Longevity with oxygen on the fought of Corona Virus
ప్రాణవాయువుతో దీర్ఘాయువు
author img

By

Published : Jul 10, 2020, 9:18 AM IST

కరోనా వైరస్‌పై గత ఆరునెలలుగా ప్రపంచవ్యాప్తంగా అవిరళ పోరు కొనసాగుతోంది. భారత ప్రభుత్వం కరోనా మహమ్మారిని అంతమొందించడానికి లాక్‌డౌన్‌ విధించింది. ప్రజలందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంవంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే అవగాహన కలిగించింది. లాక్‌డౌన్‌ దేశార్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని గుర్తించిన ప్రభుత్వం దాన్ని సడలించి, కొవిడ్‌ నియమావళితో ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.

అదే సమస్య..

ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ఇంకా కరోనా కేసులు, మరణాలు రెట్టింపు సంఖ్యలో పెరగడానికి ఆజ్యం పోస్తూ ప్రజల్ని, ప్రభుత్వాలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. మరోవైపు విషమ పరిస్థితిలో ఉన్న కరోనా రోగులకు ప్రాణవాయువును అందించే వెంటిలేటర్ల సమస్య కూడా ఎదురవుతోంది. పలు రాష్ట్రాల్లో నూతనంగా కరోనా లక్షణాలేవీ కనిపించని వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగి ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనికి ముఖ్య కారణం వైరస్‌ మన శరీరంలోని రక్తంలో ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకొని కీలక అవయవాలకు ప్రాణవాయువు అందకుండా చేస్తుందని, తద్వారా మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంటున్నారు.

ఆక్సిజన్​ నిల్వలు తప్పనిసరి..

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో కరోనా అనుకూలత ఉన్న పేషెంట్లకు ఇంటివద్దనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారి ఆక్సిజన్‌ స్థాయిలను గుర్తించడం వైద్య సిబ్బందికి కష్టంగా మారింది. దిల్లీ ప్రభుత్వం వ్యాధిగ్రస్తుల ఆక్సిజన్‌ స్థాయులను పరీక్షించి, తగ్గినప్పుడు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును తగ్గిస్తోంది. వ్యక్తి రోగనిరోధక శక్తికి శరీరంలో ఆక్సిజన్‌ నిల్వలు తప్పనిసరి. ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే పరిస్థితి విషమంగా ఉన్నప్పుడు ఆక్సిజన్‌ పెట్టి చికిత్స అందించడం జరుగుతుంది. దీన్నిబట్టి స్పష్టమవుతున్నది ఏమిటంటే- మన శరీరంలో కరోనాను జయించడానికి రోగనిరోధక శక్తి పెంచే ఆహారంతో పాటు స్వచ్ఛమైన ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తుంది!

ఏసీలు ఉన్నా..

ఇల్లు, పరిసర ప్రాంతాలు ఏ మేరకు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తున్నాయనేది అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. ఆధునికంగా నిర్మించిన ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా, వ్యాపార సంస్థలు బహుళ అంతస్తుల భవనాల్లో సహజమైన గాలి, వెలుతురు ప్రసరించనివ్వకుండా ఏసీలను పెట్టుకొని ఎందరో చల్లదనం అనుభవిస్తున్నారు. ఒక గదిలో ఎక్కువమంది ఉన్నప్పుడు ఏసీ పనిచేస్తున్నా సరిపడా ప్రాణవాయువు లభించకపోవచ్చు. అదే సహజమైన గాలి, వెలుతురు ప్రసరించేచోట ఎంతమంది ఉన్నా కావలసినంత ఆక్సిజన్‌ లభిస్తుంది. దీన్నిబట్టి ఏసీలవల్ల ఆక్సిజన్‌ స్థాయులను మనమే పరిమితం చేసుకుంటున్నామని గ్రహించాలి. ఏసీలు పర్యావరణానికీ హానికరమే.

కరవైన గాలి..

గతంలో ఇంటి ముందు ఖాళీ స్థలాల్లో చెట్లు ఉండేవి. కానీ, ప్రస్తుతం ఇంటి ముందు ఉపరితలాలను ఫ్లోరింగ్‌, టైల్స్‌తో కప్పడంతో చెట్లు లేక స్వచ్ఛమైన గాలి కరవైపోయింది. దానికితోడు మానవ చర్యల ఫలితంగా గాలి కలుషితమవుతోంది. గాలిలో ప్రాణవాయువు తగ్గుతోంది. గాలి, వెలుతురు ఉన్న ఉపరితల, బహిరంగ ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువ ఉంటుందని అమెరికా ప్రభుత్వ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఇటీవల అధికారికంగా వెల్లడించింది. మూసివేసినట్లు ఉండే కార్యాలయాలు, సినిమా హాళ్లు, మతపరమైన ప్రదేశాలు ప్రమాదకరమని గుర్తించింది.

ప్రతి ఒక్కరి కృషి అవసరమే..

ప్రతి ఒక్కరూ- నిపుణులు నిర్దేశించిన నియమావళితో జీవిస్తూ స్వచ్ఛమైన ప్రాణవాయువుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇళ్లు, కార్యాలయాల్లో సహజంగా గాలి, వెలుతురు ప్రసరించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్షాకాలం, చలికాలాల్లో ఏసీల వినియోగం తక్కువ కాబట్టి- కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ప్రాణవాయువు కోసం మొక్కలు నాటి సహజ వాతావరణంలో జీవించాలి. ఇంట్లో వేడి గాలి బయటకు పంపించడానికి ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ పెట్టుకోవడం మేలు. డి-విటమిన్‌ తక్కువ కలిగినవారికి కరోనా ముప్పు ఎక్కువని ఇటీవలి అధ్యయనాలు పేర్కొంటున్న నేపథ్యంలో- శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. ప్రభుత్వం నిర్దేశించిన గ్రీన్‌ బిల్డింగ్‌ కోడ్‌ను పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలి. పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు ఈ నియమాలన్నీ సక్రమంగా అమలయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో పర్యావరణ హిత చర్యలను ఆచరించాలి. అంతిమంగా మనం నివసించే ప్రాంతాలను ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలుగా మార్చుకోవడమే ప్రస్తుతం మన కర్తవ్యమని, అది ఖర్చు లేని అంశమని అందరూ గుర్తించాలి.

- ఎస్‌.మల్లేశ్వరరావు, రచయిత సామాజిక విశ్లేషకులు

ఇదీ చదవండి: 'గాలిలోనూ కరోనా వైరస్ వ్యాప్తి- కానీ..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.