ETV Bharat / opinion

చైనా యాప్స్‌పై నిషేధం- స్వదేశీ సత్తాకు అవకాశం

భారత ప్రభుత్వం జూన్‌ 29న 59 చైనా యాప్స్‌ను నిషేధించింది. చైనా యాప్స్‌ భారత దేశ భద్రతకు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు, దేశ రక్షణకు హానికరమైన కార్యకలాపాలు సాగిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. గల్వాన్‌ లోయ ఘర్షణ అనంతరం చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్లు భారతదేశంలో మిన్నంటాయి. ఫలితంగా స్వదేశీ వస్తువులు, సంస్థలకు అవకాశాలు పెరుగుతున్నాయి.

Indigenous opportunity provided by the ban on China apps
చైనా యాప్స్‌పై నిషేధంతో అందివచ్చిన స్వదేశీ అవకాశం
author img

By

Published : Jul 17, 2020, 7:17 AM IST

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)పై చైనా ఆగడాలకు ప్రతిచర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం జూన్‌ 29న 59 చైనా యాప్స్‌ను నిషేధించింది. భారతీయుల్లో విస్తృత ప్రాచుర్యం సంపాదించుకున్న టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్‌, క్యామ్‌ స్కానర్‌ వంటివీ నిషిద్ధ యాప్స్‌లో ఉన్నాయి. చైనా యాప్స్‌ భారత దేశ భద్రతకు, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతలకు, దేశ రక్షణకు హానికరమైన కార్యకలాపాలు సాగిస్తున్నాయని కేంద్రం పేర్కొంది. సర్కారు ఉత్తర్వు వెలువడిన మరుక్షణం భారతీయ వినియోగదారులు నిషిద్ధ చైనీస్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం లేకుండా గూగుల్‌, ఆపిల్‌ జాగ్రత్తలు తీసుకున్నాయి. టెలికాం ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు కూడా తక్షణం 59 చైనీస్‌ యాప్స్‌ను నిషేధించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్వాన్‌ లోయ ఘర్షణలను పురస్కరించుకుని చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్లు భారతదేశంలో మిన్నంటాయి. దీంతో యంత్ర సామగ్రి దిగుమతి కోసం ప్రభుత్వరంగ సంస్థలు చైనాతో కుదుర్చుకున్న కాంట్రాక్టులను కేంద్రం రద్దు చేసి, చైనా యాప్స్‌నూ నిషేధించింది.

భారీ ద్వైపాక్షిక వాణిజ్యం

భారతదేశానికి 2018లో అత్యధికంగా సరకులను ఎగుమతి చేసిన దేశం చైనాయే. ఆ సంవత్సరం చైనా ఎగుమతుల విలువ 7,550 కోట్ల డాలర్లు. చైనాకు భారత ఎగుమతుల విలువ కేవలం 1,660 కోట్ల డాలర్లు. 2019లోనూ భారతదేశ మొత్తం దిగుమతుల్లో గరిష్ఠం అంటే 14 శాతం చైనా నుంచి వచ్చాయి. నిషిద్ధ టిక్‌ టాక్‌ యాప్‌ను భారత్‌లో 12 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. ఆ యాప్‌నకు చైనా తరవాత భారత్‌లోనే ఎక్కువమంది వినియోగదారులు ఉన్నారు. టిక్‌ టాక్‌, హెలో, విగో వీడియోలను భారత సర్కారు నిషేధించడం వల్ల వాటి మాతృసంస్థ అయిన బైట్‌ డ్యాన్స్‌కు 600 కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుందని చైనా సమాచార సాధనాలు వెల్లడించాయి. చిన్న నిడివి వీడియోలను పోస్ట్‌ చేసి షేర్‌ చేయడానికి అనువైన టిక్‌ టాక్‌ యాప్‌ను భారత్‌లో అన్ని వయసులవారు, వర్గాలవారు విరివిగా ఉపయోగిస్తున్నారు. పాటలు పాడుతూ, నాట్యమాడుతూ, జోకులు పేలుస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఈ యాప్‌ భారత్‌లో అనేకులను సామాజిక మాధ్యమాల్లో తారలుగా మార్చేసింది. 2019లో భారతీయులు టిక్‌ టాక్‌లో 550 కోట్ల గంటలు గడిపారు. 2018లో 90 కోట్ల గంటలు గడిపారు. 2019నాటికి ఇది ఆరు రెట్లు పెరిగింది. 2,550 కోట్ల గంటలతో ఫేస్‌బుక్‌ ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నా, టిక్‌ టాక్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2019లో ఆపిల్‌, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల నుంచి ఫేస్‌బుక్‌ను 15.6 కోట్లమంది డౌన్‌లోడ్‌ చేసుకుంటే అంతకు రెట్టింపు సంఖ్యలో, అంటే 32.3 కోట్ల డౌన్‌లోడ్‌లు టిక్‌ టాక్‌ ఖాతాలో పడ్డాయి. భారత్‌లో టిక్‌ టాక్‌ మీద వినియోగదారులు వెచ్చించిన సమయం, యాప్‌ యానీ సంస్థ జాబితాలో తదుపరి 11 దేశాలన్నీ కలిపి వెచ్చించిన సమయంతో సమానం.

నిషేధంతో చైనాకు నష్టమెంత?

ముందే చెప్పుకొన్నట్లు టిక్‌ టాక్‌, యూసీ బ్రౌజర్‌ వంటి చైనా యాప్స్‌కు భారతదేశం అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవిస్తోంది. ప్రస్తుతానికి భారత్‌ నుంచి ఆదాయం తక్కువగానే ఉన్నా, మున్ముందు అది భారీగా పెరగనుంది. 2019లో భారత్‌లో 200 అగ్రశ్రేణి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నవారిలో 38శాతం చైనా యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోగా, 41 శాతం భారత్‌లో రూపొందిన యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. అదే 2018లో 43 శాతం చైనీస్‌ యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోగా, భారతీయ యాప్స్‌ను 38 శాతం చేసుకున్నారు. ఈ ఏడాది భారతదేశంలో డిజిటల్‌ వాణిజ్య ప్రకటనల మార్కెట్‌ 26 శాతం పెరగనుందని అంచనా. ప్రభుత్వ నిషేధం వల్ల చైనా యాప్‌లు ఈ మార్కెట్‌లో అవకాశాన్ని కోల్పోనున్నాయి. చైనాలో తయారైన 5జీ పరికరాలు, ఫోన్లు, సాఫ్ట్‌వేర్‌ మీదా మోదీ సర్కారు నిషేధం విధించవచ్ఛు వీటివల్ల మన దేశ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని నిఘూ సంస్థలు హెచ్చరించడంతో హువావై, జడ్‌టీఈ వంటి చైనా 5జీ సంస్థలకు వ్యాపారపరంగా భారీ దెబ్బ తగలనుంది. వీటితో భారతీయ టెలికాం సంస్థలు ఎటువంటి పొత్తూ పెట్టుకోకపోవచ్ఛు

టిక్‌ టాక్‌కు పోటీ యాప్‌

శ్రీశ్రీ రవిశంకర్‌ ఆధ్వర్యంలోని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ బృందం టిక్‌ టాక్‌కు పోటీగా ఎలిమెంట్స్‌ అనే భారతీయ సామాజిక మాధ్యమ యాప్‌ను రూపొందించగా, దాన్ని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ యాప్‌ వాట్సాప్‌తోనూ పోటీపడగలదు. వ్యక్తిగత సంభాషణ (చాట్‌) కనెక్షన్‌, ఉచిత ఆడియో, వీడియో కాల్‌ సౌకర్యం, వైబ్రెంట్‌ ఫీడ్‌ సదుపాయం అందించే ఎలిమెంట్స్‌, మిత్రుల మధ్య మాటామంతీని సులభతరం చేస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆపిల్‌ యాప్‌ స్టోర్‌ల నుంచి ఎనిమిది భాషల్లో ఎలిమెంట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్ఛు.

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్‌ విపణుల్లో ఒకటిగా ఎదుగుతున్న భారతీయ మార్కెట్‌ను కోల్పోవడం, చైనా సంస్థల భావి వ్యాపార అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. వాటి విస్తరణ వేగం మందగిస్తుంది. కొవిడ్‌ వ్యాప్తిని చైనా కప్పిపెట్టడం, ఎల్‌ఏసీపై అతిక్రమణలకు దిగడం వల్ల ఆ దేశంపై ఆర్థికంగా ఆధారపడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదనే భావన భారత్‌లో బలపడుతోంది. సెమీ కండక్టర్లు మొదలుకొని మందుల తయారీకి అవసరమైన ఏపీఐలు, టెలికాం పరికరాల వరకు చైనాయే ప్రధాన సరఫరాదారుగా ఉండటం భారతదేశ భద్రతకు, ప్రగతికి ప్రమాదకరం. చైనా కంపెనీలు భారత్‌కు 4జీ సామగ్రిని ఎగుమతి చేయడమే కాదు, రేపు 5జీ ప్రయోగాల్లోనూ కీలకపాత్ర పోషించనున్నాయి. దేశ భద్రతకు, ప్రయోజనాలకు భంగకరం కాని రీతిలో విదేశీ సంస్థలపై తగు నియంత్రణలు విధించాలి. టిక్‌ టాక్‌ నిషేధం వల్ల వేలాది భారతీయ ఔత్సాహిక రూపకర్తలకు ఆదాయ నష్టం సంభవిస్తుంది. భారత్‌కు చెందిన ఓయో సంస్థకు చైనాలో వ్యతిరేకత ఎదురుకావచ్ఛు 2018 జూన్‌లో చైనాలో రంగప్రవేశం చేసిన ఓయో అక్కడ 338 నగరాల్లో 59,000 హోటల్‌ గదులను అందించే స్థాయికి ఎదిగింది.

నేడు ప్రపంచ యాప్‌ పరిశ్రమ అనూహ్య వేగంతో విస్తరిస్తోంది. 2019లో మొత్తం 20,400 కోట్ల డౌన్‌లోడ్‌లు జరిగాయి. జనం రోజుకు మూడు గంటల 40 నిమిషాల సేపు యాప్‌లను వినియోగిస్తున్నారు. యాప్‌లంటే కేవలం కాలక్షేపానికి కాదు, అవి భారీ వ్యాపారం కూడా. అందులో చైనా బాగా ముందుంది. 2020లో యాప్‌ విభాగంలో రాబడి 293 కోట్ల డాలర్లు. 2020కల్లా ఇది 356 కోట్ల డాలర్లకు పెరగనుంది. చైనా యాప్‌లను నిషేధించడంతో సరిపెట్టుకోకుండా భారతదేశం కొత్త కొత్త యాప్‌లను రూపొందించి, దేశవిదేశాల్లో విపణులను కైవసం చేసుకోవాలి!

- డాక్టర్​ కె.బాలాజీ రెడ్డి, సాంకేతిక విద్యారంగ నిపుణులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.