ETV Bharat / opinion

దేశంలో అవినీతి అసుర సంధ్య​ - india rank in corrutpion

పద్దెనిమిదేళ్లలో మొట్టమొదటిసారిగా చైనాను వెనక్కినెట్టి అవినీతి నియంత్రణలో ఇండియా మెరుగైన ఫలితాలు సాధించిందని అయిదేళ్లనాడు ప్రకటించిన 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌' తాజా నివేదికలో తద్విరుద్ధమైన దృశ్యాన్ని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాల్లో అవినీతి గతిరీతులపై పాతికేళ్లుగా నివేదికలు అందిస్తున్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనాల అనుసారం 2014లో ఇండియా అవినీతి ర్యాంకు ఎనభై అయిదు. ఈసారి మరోస్థానం దిగజారడమే సిగ్గుచేటు! వంద మార్కుల 'పరీక్ష'లో 88తో డెన్మార్క్‌, న్యూజిలాండ్‌; తలో 85 మార్కులు సాధించి ఫిన్లాండ్‌, సింగపూర్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ అత్యంత నీతిమంత దేశాలుగా కొనసాగుతున్నాయి.

India slips in corruption perception index
అవినీతి అసుర సంధ్య- మరోస్థానం దిగజారిన భారత్​
author img

By

Published : Feb 1, 2021, 9:17 AM IST

'నిజాయతీయుత పాలన వ్యవస్థ అవినీతిపరుల్ని ఏరిపారేస్తుంది' అంటూ రెండో పరిపాలన సంఘం ఎన్నో మహితోక్తుల్ని మేళవించి నివేదిక సమర్పిస్తే- దాన్ని ఏర్పాటు చేసిన యూపీఏ జమానాయే అవినీతికి పరాకాష్ఠగా భ్రష్టుపట్టిపోయింది. పద్దెనిమిదేళ్లలో మొట్టమొదటిసారిగా చైనాను వెనక్కినెట్టి అవినీతి నియంత్రణలో ఇండియా మెరుగైన ఫలితాలు సాధించిందని అయిదేళ్లనాడు ప్రకటించిన 'ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌' తాజా నివేదికలో తద్విరుద్ధమైన దృశ్యాన్ని నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా దేశదేశాల్లో అవినీతి గతిరీతులపై పాతికేళ్లుగా నివేదికలు అందిస్తున్న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ అధ్యయనాల అనుసారం 2014లో ఇండియా అవినీతి ర్యాంకు ఎనభై అయిదు. ఈసారి మరోస్థానం దిగజారడమే సిగ్గుచేటు! వంద మార్కుల 'పరీక్ష'లో 88తో డెన్మార్క్‌, న్యూజిలాండ్‌ తలో 85 మార్కులు సాధించి ఫిన్లాండ్‌, సింగపూర్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ అత్యంత నీతిమంత దేశాలుగా కొనసాగుతున్నాయి.

కరోనా సంక్షోభంలోనూ

ఈ మార్కుల జాబితాలో ప్రపంచ దేశాల సగటు 43, ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని 31 దేశాల సగటు 45 కాగా- వాటికంటే తీసికట్టుగా ఇండియా స్కోరు 40కి దిగజారింది. 42 స్కోరుతో చైనా 78వ ర్యాంకు సాధించింది. 'కొవిడ్‌ ఆరోగ్య ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, అది అవినీతి గరళాన్నీ విరజిమ్మింది' అన్న నివేదిక దాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాల వైఫల్యాల్ని ఎండగట్టింది. సరిగ్గా రెండు నెలల క్రితం 'గ్లోబల్‌ కరప్షన్‌ బారోమీటర్‌' ఆసియాలోనే అత్యధికంగా 39శాతం లంచాల రేటుతో ఇండియా ముందంజలో ఉందని వెల్లడించింది. పైవారినుంచి ఉత్తరం లేదా చేతులు తడిపే 'దక్షిణ' లేకుండా పౌరుల పనులు సాగని దురవస్థకు అది దర్పణం పట్టింది. స్వయం సమృద్ధ భారత్‌ సాక్షాత్కారానికి అవినీతి పెద్ద అవరోధంగా మారిందన్న ప్రధాని- దానిపై పూర్తిస్థాయి యుద్ధం చేయాలని నిరుడు అక్టోబరులో పిలుపిచ్చారు. ఆ యుద్ధానికి జాతిని సన్నద్ధం చేయాల్సింది ఎవరు?

'ఎవడి పాపాన వాడు పోతాడ్లే' అని సర్ది చెప్పుకొనే కర్మభూమిలో అవినీతి విష వృక్షం ఊరూవాడా ఊడలు దిగి విస్తరించింది. తక్కువ రిస్కుతో కళ్లు చెదిరే రాబడులకు పూచీ ఇచ్చే పరిశ్రమగా వ్యవస్థీకృతమైపోయిన అవినీతి- బడుగు జనం ప్రాణాలతోనూ మృత్యు క్రీడలాడుతోంది. యూపీలోని మురాద్‌నగర్‌ శ్మశానవాటికలో ఓ వ్యక్తి అంతిమ సంస్కారానికి హాజరై జోరువానలో తలదాచుకోవడానికి కొత్తగా నిర్మించిన కట్టడం కిందకు చేరితే- అది కూలిపోయి 25మంది మరణించిన దుర్ఘటన నాలుగు వారాల క్రితం నమోదైంది. రూ.30లక్షల కాంట్రాక్టులో 30శాతం పైగా లంచాల మేత పోగా, స్వీయ లాభాన్ని మిగుల్చుకొని చేపట్టిన నిర్మాణం అభాగ్యుల ప్రాణాల్ని తోడేసింది. ఎనిమిది మంది ముంబయి పోలీసులు, అయిదుగురు కస్టమ్స్‌ అధికారులు లంచాలు మేయకపోతే 1993నాటి ముంబయి వరస బాంబుపేలుళ్ల ఘాతుకం సాగేదే కాదని లోగడ సుప్రీంకోర్టే వాపోయింది. ఏటా లక్షల కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్లలో అభివృద్ధి లక్ష్యాల వల్లెవేత మోతెక్కుతున్నా- లబ్ధిదారులకు ప్రగతి ఫలాల్ని దక్కనివ్వని పందికొక్కులెన్నెన్నో!

నేషనల్ విజిలెన్స్​ కేర్​..

డెన్మార్క్‌లాంటి నీతిమంత దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తిలో 55శాతానికిపైగా ప్రజా పనులు సేవలపై వెచ్చిస్తుంటే, ఆ నిష్పత్తిలో నాలుగో వంతు కేటాయించలేని ఇండియాలో- అరకొర నిధులూ అవినీతి పందికొక్కుల పాలబడటం కంటే విషాదం ఏముంటుంది? పాలన వ్యవస్థలో పారదర్శకత కోసమంటూ తెచ్చిన సమాచార హక్కు చట్టాన్నీ సారహీనం చేసేలా అవినీతి అసుర సంధ్య దట్టంగా ముసురేసింది. అవినీతిపై సమరానికి యువతను సన్నద్ధం చేసేలా నేషనల్‌ విజిలెన్స్‌ కోర్‌ (ఎన్‌వీసీ) ఏర్పాటును సీవీసీగా ఎన్‌.విఠల్‌ ప్రతిపాదించి రెండు దశాబ్దాలు దాటింది. చీకటిని తిడుతూ కూర్చునే సమయం కాదిది. నల్లధనం ఏరివేతకంటూ పెద్దనోట్ల రద్దుకు సర్కారు సిద్ధపడితే వెన్నంటి నడిచిన జనావళి- అవినీతిపై సమరానికీ ‘సై’ అంటుంది. ఇక మోదీ సర్కారే మోగించాలి కదన కాహళి!

ఇదీ చూడండి: రైతు సమాజానికి టికాయిత్​ గర్వకారణం: బాదల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.