ETV Bharat / opinion

Fuel Price in India: కొవిడ్​ సంక్షోభంలోనూ సుంకాల పీడన

కొవిడ్‌ కల్లోల కాలంలోనూ(Corona crisis in India) లీటరు పెట్రోలుపై ఎక్సైజ్‌ సుంకాన్ని(Excise duty on petrol) పదమూడు రూపాయల వరకు పెంచిన కేంద్రం, డీజిలుపై రూ.16 దాకా(Fuel Prices) వడ్డించింది. నిరుడు మహమ్మారి(coronavirus) మూలంగా ఇంధన అమ్మకాల్లో(Fuel Price in India) తొమ్మిది శాతానికి పైగా తరుగుదల నమోదైంది. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆర్జన మాత్రం రూ.1.20 లక్షల కోట్ల మేరకు ఎగబాకిందంటే కారణం ఎక్సైజ్‌ సుంకమే! సుంకాలతో జనసామాన్యాన్ని కుళ్లబొడిచే దుర్విధానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్వస్తిపలకాలి.

fuel prices in india
ఇంధన ధరలపై సుంకాలు
author img

By

Published : Aug 31, 2021, 7:01 AM IST

కొవిడ్‌తో(Corona crisis in India) ఆదాయాలు కోసుకుపోయి అల్లాడుతున్న సామాన్యుల పాలిట- పెట్రో ధరాఘాతాలు(Fuel Price in India) పులి మీద పుట్రలా పరిణమించాయి. గృహ బడ్జెట్లు తలకిందులయ్యేలా జేబులను గుల్లచేస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల(Fuel Prices) ధాటికి ప్రజలు అత్యవసర ఖర్చులనూ కుదించుకోవాల్సి వస్తోందని ఇటీవలి ఒక అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 291 జిల్లాల్లో సాగిన సర్వేలో పాల్గొన్న ప్రజావళిలో 89శాతం- పెట్రోలు, డీజిలుపై కేంద్ర ఎక్సైజ్‌ సుంకం(Excise duty on petrol) దిగిరావాల్సిందేనని నినదించింది. సంక్షేమ పథకాల అమలుకు ఈ సుంకం సొమ్ము కీలకమంటూనే- ధరలపై దేశవాసులు త్వరలోనే తీపికబురు వింటారని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆశాభావం వ్యక్తంచేశారు.

కేంద్ర ఖజానాకే భారీగా..

అంతర్జాతీయ విపణితో ముడివడిన అంశం కాబట్టి దేశీయంగా ధరలు(Fuel Price in India) తగ్గే అవకాశమే లేదని అదే శాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి స్పష్టంచేశారు! ప్రజలపై భారం తగ్గించాలనుకొంటే ఆ మేరకు రాష్ట్రాలే చొరవ తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. గడచిన ఏడేళ్లలో పెట్రో రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 36 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాయి. అందులో 67.59శాతం కేంద్ర ఖజానాకే జమయ్యాయి. కొవిడ్‌ కల్లోల కాలంలోనూ లీటరు పెట్రోలుపై(Petrol rate) ఎక్సైజ్‌ సుంకాన్ని పదమూడు రూపాయల వరకు పెంచిన కేంద్రం, డీజిలుపై(Diesel rate) రూ.16 దాకా వడ్డించింది. నిరుడు మహమ్మారి మూలంగా ఇంధన అమ్మకాల్లో తొమ్మిది శాతానికి పైగా తరుగుదల నమోదైంది. కానీ, కేంద్ర ప్రభుత్వ ఆర్జన మాత్రం రూ.1.20 లక్షల కోట్ల మేరకు ఎగబాకిందంటే కారణం ఎక్సైజ్‌ సుంకమే! ఆ బాదుడుకు రాష్ట్రాల పన్నులు జతకలిసి జనావళిని ఠారెత్తిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తేనే- మండుతున్న ధరలు దిగివస్తాయి.

అహేతుక వడ్డనలతోనే..

ఇంధన ధరల పెరుగుదలకు దిగుమతి వ్యయమే కారణమని కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే ఇటీవల వ్యాఖ్యానించారు. కొన్ని అంశాలు ప్రభుత్వం చేతుల్లో ఉండవని సెలవిచ్చారు. పశ్చిమ్‌ బంగ ఎన్నికల వేళ వరసగా పద్దెనిమిది రోజుల పాటు పెట్రోలు, డీజిలు ధరలు స్థిరంగా కొనసాగాయి. ఓట్ల పండగ ముగిశాక రెండు నెలల్లోనే 34 సార్లు పైపైకి ఎగబాకాయి! ఏడేళ్ల క్రితం బ్యారెల్‌ ముడిచమురు వెల 110 డాలర్లు పలికినప్పుడు- ఇండియాలో లీటరు పెట్రోలు రూ.71, డీజిలు రూ.57కే లభ్యమయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 75 డాలర్ల నుంచి వారం క్రితం 66 డాలర్లకు దిగివచ్చినా, పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోలుకు వినియోగదారులు వంద రూపాయలకు పైగానే వెచ్చించాల్సి వస్తోంది. నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంకలతో సహా ఎన్నో దేశాలతో పోలిస్తే ప్రభుత్వాల అహేతుక వడ్డనలతోనే ఇండియాలో ఇంధన ధరలు ఇంతగా భగ్గుమంటున్నాయి.

తక్షణం స్వస్తిపలకాలి..

విదేశాల్లోని సుంకాల పద్ధతులను పరిశీలించి పెట్రో ఉత్పత్తులపై పన్నులను హేతుబద్ధీకరించాలని పార్లమెంటరీ స్థాయీసంఘం ఇదివరకే సిఫార్సు చేసింది. పెట్రోలుకు, డీజిలుకు జీఎస్టీని వర్తింపజేస్తే ప్రజలకు ధరల పోటు తప్పుతుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తల బృందం సూచించింది. అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని గత నెలలో పార్లమెంటు సాక్షిగా కేంద్రం స్పష్టంచేసింది. సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తెస్తామని ప్రధాని మోదీ లోగడ ప్రకటించారు. దానితో పాటే పెట్రోలు, డీజిలునూ(Petrol Diesel In Gst) ఆ చట్ట ఛత్రఛాయలోకి చేర్చాలని విపక్ష నేతలు గళమెత్తుతున్నారు. దానితో పాటు దేశీయంగా ఎలెక్ట్రిక్‌ వాహనాలు, ఇథనాల్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం ఊపందుకోవాలి. సుంకాలతో జనసామాన్యాన్ని కుళ్లబొడిచే దుర్విధానాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్వస్తిపలకాలి. 'పెట్రో' పాపానికి బాధ్యులు మీరంటే మీరంటూ పరస్పర విమర్శలతో పొద్దుపుచ్చకుండా- చమురు ధరల హేతుబద్ధీకరణకు ముందుకు రావాలి!

ఇదీ చూడండి: RAMESH BIDHURI: 'పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం సానుకూలం'

ఇదీ చూడండి: పెట్రోల్ ధరల​పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. త్వరలో గుడ్​ న్యూస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.