ETV Bharat / opinion

వాగ్దానాల వరద ముట్టడి

దేశంలో పేద మధ్య ఆదాయ వర్గాల వారికి భిన్నంగా రాజకీయ పక్షాల వరస సాగుతోంది. రాజ్యాంగ విలువల్ని, సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తిని విస్మరించిన పార్టీలు.. వాగ్దానాల వరదానాల్ని గుమ్మరిస్తున్నాయి. మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణం అన్న ఆమ్‌ఆద్మీ పార్టీ వాగ్దానంపై.. దిల్లీ మెట్రో నష్టాల పాలవుతుందంటూ సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవానికి ఆ చొరవ చూపాల్సింది ఎన్నికల సంఘమే. బ్రిటన్​ ఎన్నికల సంఘం.. మ్యానిఫెస్టోలను విడుదల చేసినట్టు మన ఎలక్షన్​ కమిషన్​ చొరవ చూపితేనే రాజకీయ అవినీతి మ్యానిఫెస్టోలకు కళ్లెం వేయగలిగేది!

Election Commission should take the initiative to curb political corruption manifestos
వాగ్దానాల వరద ముట్టడి
author img

By

Published : Nov 29, 2020, 7:49 AM IST

పిండికొద్దీ రొట్టె అన్నది అందరికీ తెలిసిన నానుడి. పేద మధ్యాదాయ వర్గాలకు అదే బతుకు బడి! రాజకీయ పక్షాల వరస దానికి పూర్తిగా భిన్నమైనది. రాజ్యాంగ విలువల్ని సుప్రీంకోర్టు ఆదేశాల స్ఫూర్తిని పిండిపిండి చేసేసిన పార్టీలు వాగ్దానాల వరదానాల్ని దండిగా గుమ్మరించే ఔదార్య ప్రదర్శనలో పాత రికార్డుల్ని నిష్ఠగా బద్దలు కొడుతున్నాయి. ఖజానాలో కాసులు నిండుకున్నా వేలకోట్ల రూపాయల వ్యయం కాగల ఉచిత పథకాల్ని సమయోచితంగా వండివార్చి రాజకీయంగా పబ్బం గడుపుకొనే కళలో ఒకరెక్కువ, మరొకరు తక్కువ అని వంకపెట్టే అవకాశం లేశమాత్రమైనా లేదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు!

ఓటుకు బేరాలు

అడ్డదారిలో సాధించే విజయానికి అసలు విలువే లేదన్నారు తొలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నెహ్రూ. ప్రతి ఎన్నికా భిన్నాంశాలపై ఓటర్ల అవగాహన స్థాయిని పెంచే సందర్భమని అడ్వాణీ సూత్రీకరించారు. ఆ చాదస్తాలకు ఎప్పుడో చాపచుట్టేసిన పార్టీలు- ధన, భుజ, అధికార మదబలుల దన్నుతో ఎన్నికల రంగాన్ని దున్నేసేందుకు గెలుపు గుర్రాల్ని చేరదీసి అభ్యర్థిత్వాల జీనుల్ని తగిలించి ఎన్నికల్ని గుర్రప్పందాల స్థాయికి దిగజార్చాయి. ఓటువెయ్యి అని అర్థించడం పోయి... ఓటుకు వెయ్యి అన్న బేరాలూ ఫలించనంతగా ప్రజాస్వామ్యం ‘పరిణతి’ సాధించాక, మ్యానిఫెస్టోల్నే కామధేనువులుగా మార్చేసే కళ పురుడు పోసుకుంది. పద్నాలుగేళ్ల క్రితం తమిళనాట డీఎంకే ఓటర్లపై వర్షించిన వరాల కరుణ ఆ పార్టీని విజయతీరాలకు చేర్చడంతో అన్ని పార్టీలదీ అదే ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా జీహెచ్‌ఎంసీ ఓటర్లనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది వాగ్దానాల వరద ముట్టడి!

మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా..

కోటికి చేరువైన గ్రేటర్‌ జనసంఖ్య అంతటితో ఆగదని విశ్వ నగరంగా మునుముందు అది కాంతులీనాలంటే మౌలిక సదుపాయాల కల్పన భారీగా సాగాలని పార్టీలన్నింటికీ తెలుసు. జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ రూ.5600 కోట్లలో పన్నులు, వినియోగ రుసుముల రూపేణా వచ్చేది రూ.3571 కోట్లు. అందులో పరిపాలన వ్యయమే రూ.2414 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే రూ.3186 కోట్లతోనే అభివృద్ధి పనులు చేపట్టాల్సి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆయా పార్టీలు ప్రకటించిన వరదానాల అమలుకు పైసలెక్కడివి? నగర జీవితాన్ని సరళతరం చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రస్తావనను దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా స్వాగతించాల్సిందేగాని, తక్షణ రాజకీయ లబ్ధిని లక్షించిన వాగ్దానాలతోనే వస్తోంది పేచీ. జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను రాబడి రమారమి రూ.1800 కోట్లు. కొత్తగా ప్రతిపాదిస్తున్న మినహాయింపు వాగ్దానంతో కోల్పోయేది అందులో రూ.400 కోట్లు! రెండు పడకగదుల ఇళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.9000 కోట్ల మొత్తాన్ని సొంత నిధుల నుంచి, బ్యాంకు రుణాల ద్వారా కేటాయించింది. రహదారి అభివృద్ధి ప్రణాళికలకూ వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు దూసి తీసుకురావాల్సి వస్తోంది.

సాటిలేని వాగ్దానాలతో

ఈ నేపథ్యంలో వరద బాధితులకు తెరాస సర్కారు ఇచ్చిన పదివేల రూపాయల మొత్తాన్ని రూ.25 వేలకు పెంచుతామన్న భాజపా అందుకు రూ.1600 కోట్లు ఖర్చు కాగలదనుకొంటోంది. పేదల ఇళ్ల నిర్మాణానికి రెండు లక్షల రూపాయల వంతున ఆర్థిక సాయం, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ సౌకర్యాలు, విద్యార్థుల ట్యాబ్లకు రూ.1700 కోట్లు వెచ్చిస్తామని హామీ ఇస్తోంది. భాజపా హామీల అమలు కోసం దాదాపు రూ.40 వేల కోట్లు అవసరమన్న అంచనాలున్నప్పుడు- ఆ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. భాజపా వాగ్దానాలకు కేంద్ర సర్కారు కొమ్ము కాసే ఆస్కారం ఉంటుందేమో అనుకొన్నా- తాడూబొంగరం లేని కాంగ్రెస్‌ హామీల మాటేమిటి? తెరాస, భాజపా హామీల్ని తలదన్నేలా వేలంలో పైపాట తనదే కావాలన్నట్లుగా హస్తం పార్టీ మ్యానిఫెస్టో ఔదార్యాన్ని టన్నుల లెక్కన గుమ్మరించింది. వరద బాధితుల కుటుంబాలకు అర లక్ష వంతున, పేదల ఇళ్ల నిర్మాణానికి ఎనిమిది లక్షల రూపాయల చొప్పున ఇస్తామనడం- అధికారానికి వచ్చినప్పుడు కదా అన్న దిలాసాకు సంకేతం. విద్యుత్‌ రాయితీలు, ఉచిత నీటి సరఫరా, కొవిడ్‌ నిరుద్యోగ భృతి నిమిత్తం అవసరపడే రూ.4000 కోట్లు పైవాటికి అదనం. ఇలా మంది సొమ్ముతోనా పార్టీల మృష్టాన్న అధికార భోజనం?

తమిళనాడు పరిస్థితి

ప్రగతిశీల రాష్ట్రమైన తమిళనాడు డీఎంకే, అన్నా డీఎంకేల ఆకర్షణీయ వరదానాల వెల్లువలో కొట్టుకుపోతూ- యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగల తరవాత అప్పుల ఊబిలో కూరుకొన్న నాలుగో రాష్ట్రంగా మిగిలింది. 2006లో మ్యానిఫెస్టో వాగ్దానం మేరకు కోటీ 12 లక్షల కలర్‌ టీవీల సంతర్పణకు కరుణానిధి వెచ్చించిన ప్రజాధనం అక్షరాలా నాలుగు వేల కోట్ల రూపాయలు. సామాజిక రంగంపై రూ.78 వేలకోట్లకుపైగా వెచ్చిస్తున్న అక్కడి సర్కారు పద్దులో- ఓటర్లకు గాలం వెయ్యడానికి చేసిన వాగ్దానాలదే సింహభాగం అన్న సంగతి విస్మరించరాదు! మ్యానిఫెస్టోల ద్వారా వాగ్దానాలు చేసి పంచే తాయిలాలకు రాష్ట్ర ఖజానాలు కుదేలైపోతుంటే, అధికారం చేజిక్కాక వాగ్దానాలకు సొడ్డు కొట్టే పార్టీల మోసం- నమ్మిన జనాన్ని నట్టేట ముంచుతోంది. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు డబ్బూదస్కం ఓటర్లకు ముట్టజెప్పడం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. అదే పనిని పార్టీల మ్యానిఫెస్టోల ద్వారా చెయ్యడం నేరం కాకపోతుందా అన్నదానిపై 2013లోనే ‘సుప్రీం’ న్యాయపాలిక తీర్పు ఇచ్చినా పరిస్థితి తేటపడకపోవడం- ఈసీ నిష్క్రియాపరత్వానికే నిదర్శనం!

ఎన్నికల సంఘాలు చొరవ చూపితేనే..

సరైన చట్టం లేనందువల్ల మ్యానిఫెస్టోల్లోని అనుచిత వాగ్దానాల్ని రాజకీయ అవినీతిగా పరిగణించలేమన్న సుప్రీంకోర్టు మరో కీలకాంశాన్ని లేవనెత్తి ఆ రకంగా పార్టీల దూకుడుకు పగ్గం వేయాలని నిర్వాచన్‌ సదన్‌కు సూచించింది. స్వతంత్రులైనా, పార్టీ అభ్యర్థులైనా నిర్దిష్ట వ్యయ నిబంధనలకు లోబడే ఉండాలంటున్న నిబంధన- అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించింది. ఉచిత వాగ్దానాల ఉరవడి ఆ సమాన స్థాయీ సూత్రానికి గండికొడుతుందన్న ‘సుప్రీం’- పార్టీలతో చర్చించి మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలని ఈసీకి సూచించింది. 2014లోనే జారీ అయిన మార్గదర్శకాలకు మన్నన దక్కుతున్నదెక్కడ? ఎన్నికల వాగ్దానాల్ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించలేమన్న న్యాయపాలిక నిర్దేశం- పార్టీల మాయ వలలకు ఊతమిస్తోంది. మహిళలకు మెట్రోలో ఉచిత ప్రయాణం అన్న ఆమ్‌ఆద్మీ పార్టీ వాగ్దానంపై దిల్లీ మెట్రో నష్టాల పాలపడుతుందంటూ అలాంటి ఉచిత హామీల్ని తాము అడ్డుకొంటామని నిరుడు సుప్రీంకోర్టు గట్టిగా తలంటింది. వాస్తవంగా ఆ చొరవ చూపాల్సింది ఎన్నికల సంఘమే. అమెరికా, స్వీడన్‌, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో లేకపోయినా మ్యానిఫెస్టోలకు సంబంధించిన మార్గదర్శకాల్ని బ్రిటన్‌ ఎన్నికల సంఘం వెలువరిస్తూ ఉంటుంది. పెనుభూతంగా మారిన రాజకీయ అవినీతి మ్యానిఫెస్టోల్లోనే తిష్ఠవేస్తున్నప్పుడు చేష్టలు దక్కి చోద్యం చూడటానికా ఇక్కడి ఎలెక్షన్‌ కమిషన్‌ ఉన్నది?

- పర్వతం మూర్తి, రచయిత

ఇదీ చదవండి: వ్యాక్సిన్​ ఎలా తయారవుతుందో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.