LIVE : హరీశ్‌రావు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - harish rao live
🎬 Watch Now: Feature Video


Published : Jan 2, 2024, 3:50 PM IST
|Updated : Jan 2, 2024, 4:15 PM IST
నేటి నుంచి బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్ వేదికగా ఈరోజు నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ సభాపతి మధుసూధనా చారి, మాజీ మంత్రులు హరీశ్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర నేతలు సమావేశాలు నిర్వహించనున్నారు.
నేటి నుంచి ఈ నెల 12 వరకు తొలి విడతగా రోజుకు ఒక లోక్‌సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి తర్వాత 16 నుంచి 21 వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానుండగా, ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ముఖ్యులని ఆహ్వానించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక భేటీలో చర్చిస్తారు. ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఇదే విషయమై సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతున్నారు.