- సౌకర్యవంతంగా
అప్పటివరకూ నవ్వుతూ ఉండే పాపాయి ఒక్కసారిగా ఏడవడం మొదలుపెడుతుంది. అది ఆకలి లేదా ఒకేచోట ఉండటంవల్ల కలిగే విసుగు కావొచ్చు. అలాంటప్పుడు చిన్నారిని గాలీ వెలుతురు బాగా ఉన్నచోటుకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ముందుగానే అలాంటి ప్రాంతం సిద్ధం చేసుకోవాలి. పడకగది కిటికీ పక్కన లేదా బాల్కనీలో ఈ ఏర్పాట్లు చేస్తే మంచిది. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం పాపాయికి ఉపశమనాన్ని అందిస్తుంది.
- వస్తువులు..
ఇంట్లోకి బుజ్జాయి అడుగుపెట్టక ముందే తన అవసరాలకు వినియోగించే వస్తువులను సిద్ధం చేసుకోవాలి. ఆయా కాలాలను బట్టి మృదువైన, వదులుగా ఉండే దుస్తులు, సాక్సులు, టోపీ వంటివి కొని ఉంచాలి. అలాగే అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన మందులు ఇంట్లో ఉండేలా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. వైద్యుల ఫోన్ నంబర్లను రాసి పెట్టుకోవాలి.
- వర్ణాలు...
గది గోడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అలాగని పూర్తిగా ముదురు లేదా లేత రంగులు కాకుండా కాంతివంతంగా ఉండేలా జాగ్రత్తపడాలి. వర్ణమయమైన వాతావరణం చిన్నారిని ఉత్సాహంగా ఉంచుతుంది
- పాలసీసా
పాపాయిని నిద్రపుచ్చే మృదువైన వస్త్రంతో మెత్తని పడక మొదలు, స్నానం చేయించడానికి చిన్న టబ్ వంటి వస్తువులను ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. పాలిచ్చేటప్పుడు మీరు కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండే సోఫా లేదా కుర్చీని మంచం పక్కనే ఉండేలా చూసుకోవాలి. తల్లిపాలు సరిపోనపుడు.. సీసాలో పాలు కలిపి పట్టాల్సి వస్తుంది. నాణ్యమైన పాలసీసాను ముందుగానే కొని ఇంట్లో ఉంచితే మంచిది.
ఇదీ చదవండిః నీళ్లలో పెడితే బొమ్మొస్తుంది.. బుజ్జాయి ఏడుపు మానేస్తుంది!