ETV Bharat / lifestyle

MONSOON PRECAUTIONS: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తప్పని సరి... - house cleaning tips in rainy season

వర్షాకాలం(MONSOON) ఎంత హాయిగా అనిపిస్తుందో.. అంతే ఇబ్బందిగా ఉంటుంది. వాన కురుస్తున్నప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఇల్లు తడిగా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేకపోతే వ్యాధులు ప్రబలే అవకాశముంది. మరి.. వానాకాలంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

Rainy season precautions
వర్షాకాలం జాగ్రత్తలు
author img

By

Published : Jul 4, 2021, 6:57 AM IST

చినుకులు(MONSOON) పడుతున్నవేళ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే బ్యాక్టీరియా, ఫంగస్‌ చేరి అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. ఎంత శుభ్రం చేసినా, ఇంట్లో కొన్ని ప్రాంతాలు మాత్రం ఫంగస్‌ చేరడానికి అనువుగా ఉంటాయి. వాటిని గుర్తించి జాగ్రత్తలు పాటిస్తే ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉండొచ్చు.

పడకగది... వర్షాకాలం(MONSOON)లో పడకగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వాతావరణానికి దుప్పట్లు చెమ్మగా అవుతాయి. చలికి కప్పుకొనే క్విల్ట్స్‌ ఎక్కువగా వాడటం వల్ల త్వరగా మాసిపోతాయి. అయితే వీటిని ఎక్కువ సార్లు ఉతికే అవకాశం ఉండదు. అందుకే ఎండ వచ్చినప్పుడు వీటిని వారానికొకసారి ఆరనివ్వాలి. తలగడ కవర్లు కనీసం వారానికి ఒకసారి మార్చి, ఉతికినవి వేయాలి. లేదంటే జుట్టు మురికి, శరీరానికి ఉండే మృతకణాలు వాటికి అంటుకొని బ్యాక్టీరియా ఆవాసాలుగా మారతాయి. వాడిన తువ్వాళ్లను ఇంట్లో కాకుండా, బాల్కనీలో గాలి లేదా ఎండ ఉండేచోట ఆరనివ్వాలి. సిల్కు కర్టెన్లు వాడితే గది వెచ్చగా ఉంటుంది. ఉతికిన దుస్తులను బాగా ఆరిన తర్వాతే కప్‌బోర్డులో ఉంచాలి.

పడకగది

వెలుతురు... ఎండ ఉన్నప్పుడు కిటికీలన్నీ తెరచి, గదుల్లో గాలి, వెలుతురు ప్రసరించేలా చేయాలి. బయటి వాతావరణం మారితే తలుపులను మూసేయాలి. లేదంటే ఇంట్లో చెమ్మగా అవుతుంది. ప్రతి గది బయటా పొడిగా ఉండే డోర్‌మ్యాట్స్‌ వేసుకుంటే, లోపలికి వచ్చేటప్పుడు కాలికి అంటుకున్న తడి, దుమ్మును అవి గ్రహిస్తాయి. చెప్పులు, గొడుగు వంటి వాటిని బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బాల్కనీ లేదా వరండా బయట వదలాలి.

వంటిల్లు

వంటిల్లు... వంటింటిని రెట్టింపు శుభ్రంగా ఉంచుకోవాలి. కడిగిన గిన్నెలను బాగా ఆరిన తర్వాతే అలమరలో ఉంచాలి. సింక్‌ను ఎప్పటికప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. డస్ట్‌బిన్‌ను వంటింటి బయట ఉంచాలి. లేదంటే అందులో వేసే వ్యర్థాలపై దోమలు, ఈగలు వాలతాయి.

పరిమళాలు

పరిమళాలు... వర్షాకాలం(MONSOON)లో ఇంటిని పరిమళభరితంగా మార్చుకోవాలి. ఓ గిన్నెలో మూడొంతుల నీళ్లు పోసి అందులో కొన్ని చుక్కలు లావెండర్‌, శాండల్‌వుడ్‌ ఆయిల్‌ వేసి హాలులో ఓ మూల ఉంచితే చాలు. అలాగే మార్కెట్‌లో డ్రైఫ్లవర్స్‌ లభ్యమవుతున్నాయి. వీటిని టీపాయ్‌పై ఓ బౌల్‌లో వేసి ఉంచితే మంచి వాసన వస్తాయి. చెమ్మ వాసన దూరమవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.