*లీటర్ నీళ్లలో బేకింగ్ సోడా వేసి, ఆ నీటితో ప్లాస్క్ శుభ్రం చేస్తే వాసన మాయమవుతుంది.
*స్పాంజ్‌ను తడిపి, దానిమీద బేకింగ్ సోడా వేసి ఫ్రిజ్‌ను తుడిస్తే తేలిగ్గా శుభ్రమవుతుంది.
* పండ్లు, కూరగాయల్ని కొని తెచ్చాక వాటిని, బేకింగ్‌సోడా వేసిన నీళ్లతో కడగండి. వాటి మీద ఉన్న హానికర రసాయనాలు తొలిగిపోతాయి.
* ఫర్నిచర్ మీద క్రేయాన్ లేదా పెన్సిల్ గీతలు ఉంటే, తడిపిన స్పాంజి మీద బేకింగ్ సోడా వేసి రుద్దండి. మరకలు మాయమవుతాయి.
* కొంచం వేడినీళ్లలో చెంచా బేకింగ్ సోడా వేసి, మురికిగా ఉన్న దువ్వెనలు, బ్రష్‌లని వేయండి. అరగంట తర్వాత తీసి శుభ్రం చేస్తే మురికి తొలగిపోతుంది.
ఇదీ చూడండి: క్రెడిట్ కార్డులు ఎన్ని తీసుకుంటే మేలు..?